Crime Thriller Series : ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు ఇప్పడు ఎక్కువ ఆదరణ పొందుతున్న సంగతి తెల్సిందే. అయితే మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకుడిని ఊహించని ట్విస్టులతో ఉత్కంఠను పెంచే సిరీస్‌లు మాత్రం చాలా అరుదు. అలాంటి ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లలో ఒకటి ‘Brinda’. త్రిష తన కెరీర్‌లో తొలిసారి ఓటీటీలో చేసిన ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించారు. త్రిష, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్ర విజయ్, ఆమని, జయప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Brinda వెబ్ సిరీస్ 2024 ఆగస్టు 2 నుంచి SonyLIVలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. క్రైమ్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడేవారికి ఇది మంచి బింజ్ వాచ్.
బ్రింద (త్రిష) ఒక నిజాయితీ గల, కాస్త ఇంట్రోవర్ట్ స్వభావం ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మహిళ కావడంతో ఆమె ఎన్నో అవమానాలు, వివక్షను ఎదుర్కొంటూ తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి సమయంలో ఒక యువతి అత్యంత దారుణంగా హత్యకు గురవుతుంది. మొదట ఈ కేసును సాధారణ హత్యగా భావించిన పోలీసులు, విచారణ ముందుకు సాగేకొద్దీ దాని వెనుక చాలా భయంకరమైన నిజాలు ఉన్నాయని గుర్తిస్తారు. ఆ హత్య జరిగిన విధానం, అక్కడ లభించిన ఆధారాలు అన్నీ చాలా విచిత్రంగా ఉండటంతో బ్రింద ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటుంది.
ఒక్కో క్లూను ఛేదిస్తూ ముందుకు వెళ్లే కొద్దీ వరుస హత్యలు, మూఢనమ్మకాలు, రహస్య ఆచారాలు, మూఢ నమ్మకాలతో ముడిపడిన ఒక పెద్ద కుట్ర బయటపడుతుంది. ఈ కేసులోకి ప్రొఫెసర్ కబీర్ ఆనంద్ (ఇంద్రజిత్ సుకుమారన్) ఎంట్రీ ఇవ్వడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.
ఇంతకీ ఈ వరుస హత్యల వెనుక ఉన్న అసలు నేరస్థుడు ఎవరు? ఈ నేరాలకు మత విశ్వాసాలకు ఉన్న సంబంధం ఏమిటి? బ్రింద ఈ కేసును ఎలా ఛేదించింది? చివరికి బయటపడే షాకింగ్ నిజం ఏమిటి? అనేదే ఈ సిరీస్ ప్రధాన కథ. ప్రతి ఎపిసోడ్ చివర వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిని తర్వాతి ఎపిసోడ్ వెంటనే చూడాలనిపించేలా చేస్తాయి.
‘Brinda’లో కేవలం మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు. మహిళా పోలీస్ ఆఫీసర్ ఎదుర్కొనే సవాళ్లు, మానసిక సంఘర్షణలు, సామాజిక అంశాలు, సస్పెన్స్ అన్నింటినీ అద్భుతంగా మిళితం చేశారు. త్రిష తన కెరీర్‌లో అత్యంత మెచ్యూర్ పెర్ఫార్మెన్స్‌లలో ఒకదాన్ని అందించింది. ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్ర విజయ్ కూడా తమ పాత్రల్లో ఆకట్టుకుంటారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే ఈ సిరీస్‌కు ప్రాణం పోశాయి. స్లో బర్న్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు, సీరియల్ కిల్లర్ కథలు, సైకలాజికల్ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ సిరీస్‌ను తప్పకుండా చూడాలి. మొదలుపెడితే చివరి ఎపిసోడ్ వరకు ఆపకుండా చూసేలా చేసే థ్రిల్లర్ ఇది.
Read Also : 44కు పైగా ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న మూవీ… రన్ టైమ్ 20 నిమిషాలే