E-Paper
Advertisement

Malayalam Thriller : భర్త కళ్లముందే మరో అబ్బాయితో… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్ట్

Malayalam Thriller : భర్త కళ్లముందే మరో అబ్బాయితో… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్ట్
Advertisement

Malayalam Thriller : కొన్ని థ్రిల్లర్ సినిమాలు హత్యల చుట్టూ తిరుగుతాయి. మరికొన్ని పోలీసు దర్యాప్తుతో ఉత్కంఠ కలిగిస్తాయి. కానీ కొన్ని కథలు మాత్రం మనుషుల కోరికలు, ద్రోహం, ప్రతీకారం చుట్టూ తిరుగుతూ చివరి వరకు ఏం జరుగుతుందో అర్థం కాకుండా చేస్తాయి. అలాంటి ఇంటెన్స్ అడల్ట్ సైకాలజికల్ థ్రిల్లర్ల సినిమానే ‘చతురం’ (Chathuram). 2022లో విడుదలైన ఈ మలయాళ చిత్రం సిద్ధార్థ్ భరతన్ దర్శకత్వంలో తెరకెక్కింది. స్వాసిక విజయ్, రోషన్ మాథ్యూ, అలెన్సియర్ లే లోపెజ్, జాఫర్ ఇడుక్కి ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో చర్చనీయాంశంగా నిలిచిన ఈ చిత్రం సైనా ప్లేలో స్ట్రీమ్ అవుతోంది.

చతురం కథేంటి?

కథలో సెలీనా అనే యువతి తనకంటే చాలా పెద్దవాడైన ధనవంతుడు ఎల్దోస్ అచాయన్ను వివాహం చేసుకుంటుంది. కానీ పెళ్లి తర్వాత ఆమె జీవితం నరకంగా మారుతుంది. అచాయన్ అనుమాన స్వభావం కలవాడు. వేధింపులతో ఆమెను మానసికంగా, శారీరకంగా హింసిస్తుంటాడు. ఒక రోజు జరిగిన ప్రమాదంలో అచాయన్ మంచానికే పరిమితమవుతాడు. అక్కడి నుంచి కథ పూర్తిగా మారిపోతుంది. అతడిని చూసుకునేందుకు బెల్తజార్ అనే నర్సింగ్ యువకుడు ఇంటికి వస్తాడు. అతని రాకతో సెలీనా జీవితంలో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయి. అయితే ఇది సాధారణ ప్రేమకథ కాదు. ప్రతి పాత్రకు ఒక రహస్యం ఉంటుంది. ప్రతి నిర్ణయం వెనుక ఒక స్వార్థం ఉంటుంది. కథ ముందుకు సాగే కొద్దీ ప్రేమ, మోసం, ప్రతీకారం, ఆస్తి, అధికారం అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఊహించని మలుపులు తిరుగుతాయి. చివరికి నిజంగా ఎవరు బాధితులు? ఎవరు ఆట ఆడుతున్నారు? అనే ప్రశ్న ప్రేక్షకుడిని వెంటాడుతుంది.

ఎందుకు చూడాలి?

Advertisement

చతురం బలం దాని పాత్రలే. ఇందులో పూర్తిగా మంచివాళ్లు, పూర్తిగా చెడ్డవాళ్లు అంటూ ఎవరూ ఉండరు. ప్రతి పాత్రలో గ్రే షేడ్స్ కనిపిస్తాయి. అందుకే కథ చివరి వరకు ఎవరిని నమ్మాలో అర్థం కాదు. స్వాసిక విజయ్ తన కెరీర్‌లో అత్యంత వైవధ్యమైన పాత్రల్లో నటించింది. రోషన్ మాథ్యూ కూడా తన పాత్రలో ఆకట్టుకుంటాడు. అలెన్సియర్ నటన కథకు మరింత బలం చేకూరుస్తుంది.

అందరికీ కాదు…

ఈ సినిమాలో అడల్ట్ థీమ్స్, బోల్డ్ సన్నివేశాలు, సంబంధాలపై సీరియస్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. అందుకే ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు. స్లోగా సాగినా, కథలోని సస్పెన్స్, పాత్రల మధ్య సైకాలజికల్ గేమ్ ప్రేక్షకుడిని చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెడుతుంది. సైకాలజికల్ థ్రిల్లర్లు, రిలేషన్‌షిప్ డ్రామాలు, ఊహించని ట్విస్టులు ఉన్న సినిమాలు ఇష్టపడేవారికి చతురం ఒక మంచి ఎంపిక. కథలోని అసలు ట్విస్ట్ తెలిసే వరకు ప్రతి పాత్రపై మీ అభిప్రాయం మారుతూనే ఉంటుంది. అదే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుంది.

Advertisement

Read Also : నచ్చినోడిపై వ్యామోహం… అతని భార్య శరీరాన్ని స్వైప్ చేసుకునే లేడీ సైకో

Tags

Related News

18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు… 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

స్కూల్లోనే పిల్లల్ని చంపి తినే టీచర్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!

రూపాయి ఖర్చు లేకుండా చూడొచ్చు… ఓటీటీ ఫ్రీ క్యాటగిరీలో దుమ్మురేపుతున్న 7 వెబ్ సిరీస్‌లు

10 కోట్ల బ్యాగ్‌ దొరకడంతో మొదలయ్యే గందరగోళం… కితకితలు పెట్టే ఇమ్మిగ్రెంట్స్ కష్టాలు

స్కూల్ టీచర్ నుంచి డిటెక్టివ్‌గా… ట్రిపుల్ మర్డర్, ట్రెజర్ హంట్, లవ్ ట్రయాంగిల్ తో అదిరిపోయే డార్క్ కామెడీ సిరీస్

కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

Big Stories

Advertisement
×