E-Paper

తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉండదు… లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ

తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉండదు… లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ
Advertisement

Social Drama : ఓటీటీల్లో ప్రేమ కథలు చాలానే వస్తుంటాయి. కానీ ప్రేమతో పాటు పేదరికం, మత వివక్ష, సామాజిక అసమానతలను హృదయానికి హత్తుకునేలా చూపించే సినిమాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి ఎమోషనల్ రొమాంటిక్ డ్రామానే ‘Mon Potongo’. 2024లో విడుదలైన ఈ బెంగాలీ చిత్రానికి రాజ్‌దీప్ పాల్, సర్మిష్ఠ మైతి దర్శకత్వం వహించారు. సుభంకర్ మొహంతా, బైశాఖి రాయ్, సీమా బిశ్వాస్ ప్రధాన పాత్రల్లో నటించారు.

స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mon Potongo 2024 డిసెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం భారత్‌లో ఏ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ స్ట్రీమింగ్‌లో అందుబాటులో లేదు. భవిష్యత్తులో ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

హసన్ అనే ముస్లిం యువకుడు, లక్ష్మి అనే హిందూ యువతి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే వారి ప్రేమను గ్రామంలోని మతపరమైన విభేదాలు అంగీకరించవు. దీంతో ఇద్దరూ తమ ఊరిని వదిలి కోల్‌కతా నగరానికి పారిపోతారు. అక్కడ వలస కార్మికుల్లా చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతుకుతుంటారు. ఒక రోజు ఓ షోరూమ్‌లో ఉన్న విలాసవంతమైన ఆర్మ్‌చైర్‌ను చూసి, ఎప్పుడో ఒక రోజు అందులో రాజు-రాణిలా కలిసి కూర్చోవాలని కలలు కంటారు. అదే వారి జీవిత లక్ష్యంగా మారుతుంది.

కానీ పేదరికం, ఆకలి, సామాజిక వివక్ష, మత ఉద్రిక్తతలు, అపోహలు వారి జీవితాన్ని మరింత కఠినంగా మారుస్తాయి. బతకడమే కష్టమైన పరిస్థితుల్లో తమ కలను నెరవేర్చుకోవడానికి ఇద్దరూ ఎన్నో త్యాగాలు చేస్తారు. చివరికి వారి ప్రేమ గెలిచిందా? ఆ కలల కుర్చీ వరకు చేరుకోగలిగారా? లేక సమాజం వారిని విడదీసిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా ప్రధాన కథ. ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాదు, వర్గ అసమానతలు, మత విభేదాలు, మనిషి కోరికల గురించి చెప్పే ఒక ఎమోషనల్ ప్రయాణం.

ఎందుకు చూడాలి?

Advertisement

‘Mon Potongo’ కమర్షియల్ ప్రేమకథ కాదు. ఇందులో భారీ యాక్షన్ లేదా మాస్ ఎలివేషన్లు ఉండవు. ఇందలో ప్రేమ, పేదరికం, సామాజిక అసమానతలు, మత సామరస్యం వంటి అంశాలను చాలా సహజంగా చూపించారు. కోల్‌కతా వీధుల వాతావరణం, పాత్రల భావోద్వేగాలు, రియలిస్టిక్ స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలాలు. స్లో బర్న్ రొమాంటిక్ డ్రామాలు, సోషల్ థీమ్స్‌తో కూడిన సినిమాలు ఇష్టపడే వారికి ‘Mon Potongo’ మంచి ఎంపికగా నిలుస్తుంది.

Read Also : సీటు అంచున కూర్చోబెట్టే మోస్ట్ డేంజరస్ సస్పెన్స్ థ్రిల్లర్లు… డోంట్ మిస్

Related News

హత్యలు చేస్తూ పత్రికల్లో వింత పజిల్స్… కిర్రాక్ సైకో థ్రిల్లర్

Malayalam Thriller : భర్త కళ్లముందే మరో అబ్బాయితో… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్ట్

మిస్టీరియస్ నాలుకతో ముద్దూ ముచ్చట… మైండ్ ను మడత పెట్టే ట్విస్టులు

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..!

ఈ ఇద్దరమ్మాయిల రచ్చ చూస్తే నిద్ర కరువు… సింగిల్ గా చూడాల్సిన మూవీ భయ్యా

కనిపించిన ప్రతీ అబ్బాయితో సన్నిహితంగా ఉండే అమ్మాయి… చివరికి షాకింగ్ క్లైమాక్స్

ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన సిరీసులు… ‘ధురందర్ 2’ వ్యూస్ ఎంతంటే ?

×