E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

కోమాలో ఉన్నవాళ్ళంతా మిస్టరీ ప్రపంచంలోకి… మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కోమాలో ఉన్నవాళ్ళంతా మిస్టరీ ప్రపంచంలోకి… మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్
Advertisement

Sci Fi Action Thriller : కోమాలోకి వెళ్లడం కంటే చావడం బెటర్ అని అంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే కోమాలో ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు అన్న విషయం డాక్టర్లు కాదు కదా ఆ దేవుడు కూడా చెప్పలేడు. కానీ అలా వెళ్ళిన వాళ్ళు మరో ప్రపంచంలోకి అడుగుపెట్టి, ప్రాణాలతో అక్కడి నుంచి బయటపడి రియల్ వరల్డ్ లోకి అడుగు పెట్టడానికి ఎలాంటి సాహసాలు చేస్తారో ఊహకు అందని విధంగా కళ్లకు కట్టిన మూవీ ‘కోమా’ (Coma). ఇదొక రష్యన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఇన్సెప్షన్’ తరహాలో మైండ్ బెండింగ్ విజువల్స్, విభిన్నమైన కాన్సెప్ట్ తో సాగుతుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

యంగ్ ఆర్కిటెక్ట్ విక్టర్ ఈ సినిమాలో మన హీరో. ఘోరమైన రోడ్డు ప్రమాదం తర్వాత, అతను కళ్ళు తెరిచి చూసేసరికి వింత ప్రపంచంలో కనిపిస్తాడు. ఆ ప్రపంచంలో ఫిజిక్స్ రూల్స్ ఏవి పనిచేయవు. పైగా నగరాలు, నదులు, పెద్ద పెద్ద హిమ ఖండాలు, భవనాలు అన్నీ ధ్వంసమై, ఒకేచోట గందరగోళంగా ముక్కలు ముక్కలుగా గాల్లో తేలుతూ కనిపిస్తాయి. నిజానికి విక్టర్ ఉన్నది అసలైన ప్రపంచంలో కాదు. నిజ జీవితంలో ఎవరైతే తీవ్రమైన ప్రమాదాల వల్ల కోమా వంటి పరిస్థితిలోకి వెళ్తారో వారి సబ్కాన్షియస్ మైండ్ జ్ఞాపకాలతో ఏర్పడిన ఊహాజనిత ప్రపంచమే ఆ కోమా ప్రపంచం.

Advertisement

అక్కడ రీవర్స్ అనే భయంకరమైన నల్లటి రాక్షసులు తిరుగుతూ ఉంటారు. కోమాలో ఉన్న రోగులు నిజ ప్రపంచంలో బ్రెయిన్ డెడ్ అయినప్పుడు… ఈ ప్రపంచంలో రీవర్స్ లాగా మారి, ఇతరులపై దాడి చేసి చంపేస్తారు. అయితే వాటి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్న విక్టర్ అదే ప్రపంచంలో ప్రాణాలతో ఉన్న మరికొందరు మనుషులను కలుస్తాడు. వీళ్లంతా రీవర్స్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఒక రహస్య స్థావరంలో తలదాచుకొని ఉంటారు. ముందుగా ఇతన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. కానీ ఆ తర్వాత విక్టర్ ఒక ఆర్కిటెక్ట్ కావడం వల్ల వాళ్ళకి ఉపయోగపడతాడు. తన ఆలోచనల ద్వారా అతను ఆ ప్రపంచంలో కొత్త వస్తువులను పెద్ద పెద్ద కట్టడాలను, రోడ్లను సృష్టించగల శక్తి ఉందని తెలుసుకుంటాడు.

అయితే ఆ గ్రూపు లీడర్ గా ఉన్న యాన్ అనే వ్యక్తి విక్టర్ ని ఉపయోగించుకొని రీవర్స్ పై దాడి చేయాలని, ఒక సురక్షితమైన నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. అయితే సినిమాలో అసలు ఏంటంటే… నిజమైన ప్రపంచంలో ఒక మత గురువు. అతని అనుచరులు కావాలనే ఒక రహస్య ప్రయోగం ద్వారా విక్టర్ తో పాటు మరికొంత మందిని కోమాలోకి పంపిస్తారు. నిజజీవితంలోని కష్టాల నుంచి తప్పించుకోవాలంటే ఈ కోమా ప్రపంచమే శాశ్వతమైన స్వర్గమని నమ్ముతాడు. అలాగే అందరినీ అక్కడే ఉంచాలని చూస్తాడు.

Advertisement

కానీ ఇదంతా తెలియని విక్టర్ మాత్రం తనకు నచ్చిన అమ్మాయితో కలిసి ఈ నకిలీ ప్రపంచం నుంచి బయట పడాలని డిసైడ్ అవుతాడు. అందులో భాగంగా కోమా ప్రపంచంలో యుద్ధానికి సిద్ధమవుతాడు. మరి యాన్ గురించిన అసలు నిజం హీరోకి ఎలా తెలిసింది? అక్కడి నుంచి ఎలా బయట పడ్డాడు? ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ మూవీని డోంట్ మిస్. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

Read Also : కంటికి కనిపించకుండా మనుషులను చంపే జీవులు.. క్లైమాక్స్ చూస్తే మతిపోద్ది!

Tags

Related News

అర్దరాత్రి అడవి మధ్యలో ఆగిపోయే ట్రెయిన్… ‘ట్రెయిన్ టు బుసాన్’లాంటి థ్రిల్లింగ్ హర్రర్ మూవీ

బొమ్మను చూసుకోవడానికి వచ్చే బేబీ సిట్టర్… ఊహించని ట్విస్ట్‌లతో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్..!

మార్చురీ నుంచి అమ్మాయి మృతదేహం మాయం… క్లైమాక్స్ కేక భయ్యా

పసి పిల్లాడిని బలి తీసుకునే అల్మారా… ఒళ్లు గగుర్పొడిచే సీన్లున్న హర్రర్ మూవీ

అమెరికాను రెండు భాగాలుగా పంచుకునే జపాన్ జర్మనీ… మిస్ అవ్వకుండా చూడాల్సిన మాస్టర్ పీస్ సిరీస్

కంటికి కనిపించకుండా మనుషులను చంపే జీవులు.. క్లైమాక్స్ చూస్తే మతిపోద్ది!

Big Stories

×