E-Paper
Advertisement

ఓటీటీలో అబ్బురపరిచే ఇన్వెస్టిగేషన్… మిస్సింగ్ కేసులో పిచ్చెక్కించే ట్విస్టులు… ఐయండిబిలో 8.1 రేటింగ్

ఓటీటీలో అబ్బురపరిచే ఇన్వెస్టిగేషన్… మిస్సింగ్ కేసులో పిచ్చెక్కించే ట్విస్టులు… ఐయండిబిలో 8.1 రేటింగ్
Advertisement

Crime Thriller Series OTT : గత ఏడాది వచ్చిన ఒక హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో మంచి రేటింగ్ తో ఆకట్టుకుంటోంది. ఒక మిస్సింగ్ కేసుతో ఈ సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ కథ మెల్లగా మొదలై, ఒక్కో క్లూ దొరుకుతుంటే టెన్షన్ పెరుగుతుంది. ఒక అరగంట చూశాక అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పీక్స్‌కి వెళ్తుంది. ఇందులో విలన్ ను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడని కనిపెట్టడం ఇంకో ఎత్తు. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడేవాళ్ళకు ఇది ఒక మంచి ఆప్షన్. దీనిని ఐయండిబిలో 8.1 రేటింగ్ ఉందంటే కంటెంట్ ఎంత గట్టిగా ఉంటుందో ఇట్టే పట్టేయచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు “డిపార్ట్‌మెంట్ క్యూ” (Dept. Q). ఇందులో మాథ్యూ గూడ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో అలెగ్సీ మాన్వెలోవ్, కెల్లీ మెక్‌డొనాల్డ్ నటించారు. ఇందులో మెయిన్ హీరోగా నటించిన మాథ్యూ గూడ్ తన నటనతో అదరగొట్టాడు. సీరియస్ గా ఎవరితోనూ కలవని డిటెక్టివ్ పాత్రలో అతను ఒదిగిపోయాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఈ సిరీస్‌కు మెయిన్ హైలైట్. ఇక దీనిని స్కాట్ ఫ్రాంక్ డైరెక్ట్ చేశారు. ఇతను గతంలో నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ అయిన ‘ది క్వీన్స్ గాంబిట్’ (The Queen’s Gambit) అనే సిరీస్‌ను తీసిన డైరెక్టరే. అందుకే మేకింగ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మొదటి సీజన్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. మీరు ఒక్కసారి చూడటం మొదలుపెడితే ఆపకుండా చూసేలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్ 2025 మే లో నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో కార్ల్ మోర్క్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. కానీ ఒక పెద్ద షూటౌట్‌లో అతని టీమ్ మొత్తం దెబ్బతింటుంది. ఒక పార్ట్‌నర్ చనిపోతే ఇంకొకడు మంచాన పడతాడు. ఆ గిల్టీతో బాధపడుతున్న కార్ల్‌ను డిపార్ట్‌మెంట్‌లోని పెద్దలు తప్పుపట్టి, ఎవరికీ కనిపించని ఒక అండర్ గ్రౌండ్ బేస్‌మెంట్‌లోకి పంపిస్తారు. అక్కడ దుమ్ము పట్టి ఉన్న పాత ఫైళ్లు, అంటే ఎవరూ సాల్వ్ చేయలేని పాత కేసులను క్లియర్ చేయమని చెబుతారు. ఇప్పుడు కార్ల్ దీన్నే ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటాడు. అక్కడే అతనికి అక్రమ్ అనే ఒక తెలివైన కుర్రాడు తోడవుతాడు. వీళ్లిద్దరూ కలిసి ఒక ఐదేళ్ల క్రితం మాయమైపోయిన ఒక పెద్ద లేడీ లాయర్ కేసును డీల్ చేస్తారు.

అయితే అందరూ ఆమె చనిపోయిందని మర్చిపోయినా, కార్ల్ మాత్రం ఏదో తేడా ఉందని కనిపెడతాడు. ఆ ఫైళ్లను తిరగేస్తుంటే అది మామూలు కిడ్నాప్ కాదని, దీని వెనుక ఎవరో పెద్ద తలకాయలు ఉన్నారని, చాలా కాలంగా ప్లాన్ చేసి ఆమెను ఒక నరకంలో బంధించారని అర్థమవుతుంది. పై అధికారులు వద్దన్నా వినకుండా కార్ల్ తన స్టైల్‌లో వేట మొదలుపెడతాడు. క్లూస్ కోసం గాలిస్తూ, నిందితుడి మైండ్ సెట్‌ను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. చివరకు ఆ లేడీ ఎక్కడ ఉంది? ఆమెను బంధించింది ఎవరు? అంత పగ ఎందుకు? అనేదే ఈ వెబ్ సిరీస్ క్లైమాక్స్. మెల్లగా మొదలై చివర్లో అదిరిపోయే ట్విస్టులతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సాగుతుంది.

Advertisement

Read Also : చచ్చినోళ్ళు హత్యలు చేస్తూ డిటెక్టివ్ లకే ముప్పుతిప్పలు పెట్టే కేసు… ఓటీటీలో అదరగొడుతున్న సిరీస్

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×