BigTV English

Brahmamudi Serial Today August 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు కాల్‌ చేసిన ఇంద్రాదేవి – స్వరాజ్‌ను తీసుకొచ్చిన రాజ్‌

Brahmamudi Serial Today August 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు కాల్‌ చేసిన ఇంద్రాదేవి – స్వరాజ్‌ను తీసుకొచ్చిన రాజ్‌

Brahmamudi serial today Episode: స్వరాజ్‌ మారాం చేయడంతో రేవతి, అపర్ణకు ఫోన్‌ చేస్తుంది. అపర్ణ, స్వరాజ్ తో మాట్లాడుతుంది. తర్వాత రేవతితో మీరు చాలా అదృష్టవంతులు స్వరాజ్‌ లాంటి కొడుకు పుట్టాడని చెప్తుంది. దీంతో రేవతి ఎమోషనల్‌ అవుతుంది. తర్వాత ఎలాగైనా రాజ్‌ను రప్పించాలంటే స్వరాజ్‌ ను తీసుకురావాలని అపర్ణ, ఇంద్రాదేవి డిసైడ్‌ అవుతారు.


రుద్రాణి, యామినిక ఫోన్‌ చేసి కావ్య ప్రెగ్నెంట్‌ విషయం చెప్తుంది. యామిని షాక్‌ అవుతుంది. ఏంటి రుద్రాణి గారు మీరు చెప్పేది.. కావ్య ప్రగ్నెంటా..? అని అడుగుతుంది. అవును నాకు ఇందాకే తెలిసింది. అందుకే నీకు వెంటనే ఫోన్‌ చేశాను అని చెప్తుంది. యామిని హ్యాపీగా గుడ్‌ వెరీ గుడ్‌ ఆఫర్‌ కోసం ఎదురుచూస్తున్న వాడికి బంఫర్‌ ఆఫర్‌ దొరికింది. రుద్రాణి గారు. కావ్య కడుపుకు కారణం బావే అన్న విషయం బావకు తెలియదు. ఆ కావ్యకు నిజం చెప్పే అవకాశం లేదు.  ఆ కావ్యన ఇరికించడానికి భలే చాన్స్‌ దొరికింది రుద్రాణి గారు. వెంటనే ఈ విషయం బావకు చెప్పి ఇక పూర్తిగా బావను నావాణ్ని చేసుకుంటాను అంటుంది యామిని. తొందరపడకు యామిని కాస్త ఓపిక పట్టు.. అంటుంది రుద్రాణి.

ఏమంటున్నారు రుద్రాణి గారు నాకు అర్థం కావడం లేదు అంటుంది యామిని.. దీంతో రుద్రాణి ఆ కావ్య కడుపుతో ఉన్న విషయం నువ్వు చెప్పడం కన్నా ఆ కావ్యే చెప్పేటట్టు చేయాలి. ఆ కావ్య తీసుకున్న గోతిలో అదే పడుతుంది. అని చెప్తుంది. దీంతో అదెలా అని యామిని అడగ్గానే.. తన ప్లాన్‌ చెప్తుంది రుద్రాణి. ప్లాన్‌ ప్రకారం చేశామంటే కావ్యే నిజం బయటకు చెప్పేస్తుంది. కావ్య నిజం చెబితే రాజ్‌ మనసు విరిగిపోతుంది. వెంటనే రాజ్‌ను నువ్వు మచ్చిక చేసుకోవచ్చు అని చెప్తుంది రుద్రాణి. థాంక్స్‌ రుద్రాణి గారు వెంటనే మీ ప్లాన్‌ ఎగ్జిక్యూట్‌ చేయండి అని చెప్తుంది యామిని.


ఇంద్రాదేవి.. రాజ్‌కు కాల్‌ చేసి స్వరాజ్‌ను తీసుకుని రా కావ్యకు దగ్గర అవ్వొచ్చని చెప్తుంది. రాజ్‌ హ్యాపీగా ఫీలవుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన యామిని ఏమైంది బావ ఎందుక అంత హ్యాపీగా ఉన్నావు అని అడుగుతుంది. ఆ కళావతికి దగ్గరయ్యే మంచి అవకాశం వచ్చింది అని చెప్తాడు రాజ్‌. ఇంకా ఎన్ని రోజులు ఇలా దగ్గరయ్యే చాన్స్‌ దొరికింది అనుకుంటూ సంతోషపడతావు బావ..  ఎప్పుడు తనతో శాశ్వతంగా ఉంటావు అని అడుగుతుంది.  అవును యామిని తనతో పాటు ఉండిపోవాలని తనతో జీవితాన్ని పంచుకోవాలని నాకు ఆత్రుతగానే ఉంది. కానీ ఆ టైం రావాలి కదా అంటాడు రాజ్‌.

నాకు ఎందుకో ఆ టైం వచ్చినా కలావతి కావాలనే అలా చేస్తుందేమో అనిపిస్తుంది బావ. అంటుంది యామిని. దీంతో ఏమంటున్నావు యామిని అంటూ రాజ్ అడగ్గానే.. ఒక ఆడపిల్లగా మరో ఆడపిల్ల మనసును నేను అర్థం చేసుకోగలను బావ. కళావతి నీతో రావడం ఇష్టం లేకనే అలా నిన్ను అవైడ్‌ చేస్తుందని నాకు అనిపిస్తుంది బావ అంటుంది యామిని. దీంతో ఆలోచిస్తుంటే.. నువ్వు చెప్పింది కూడా నిజమేమో అనిపిస్తుంది యామిని ఒకసారి ఇలా కూడా చెప్పి ట్రై చేస్తాను యామిని. తనకు ఇక్కడకు రావడం ఇష్టం లేకపోతే నేనే అక్కడ ఉంటానని చెప్తాను.  నిజంగా తనకు నా మీద ప్రేమ ఉంటే తన ఇంట్లో కూడా చోటిస్తుంది అంటాడు రాజ్‌. నీకు అది చోటివ్వడం కాదు బావ. శాశ్వతంగా ఆ కళావతి నీకు దూరం అయ్యే ప్లాన్‌ చేశాను అని యామిని మనసులో అనుకుంటుంది.

దుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. కావ్య పూజ కోసం ప్రసాదం చేస్తుంటుంది. అపర్ణ, ఇంద్రాదేవి వెళ్లి కావ్యను తిడతారు. పనులు చేయోద్దంటే ఎందుకు చేస్తున్నావేంటి అని తిడతుంది అపర్ణ. నువ్వు వెళ్లి వెంటనే రెడీ అవ్వు నువ్వు కూడా వ్రతంలో కూర్చుందువు అంటుంది ఇంద్రాదేవి. రాజ్‌ లేకుండా ఎలా కూర్చోవాలి అని కావ్య అడుగుతుంది. అన్ని మేము చూసుకుంటాము కదా నువ్వేమీ ఆలోచించకుండా పూజలో కూర్చోపో వెళ్లు అని చెప్తుంది అపర్ణ. ఇంతలో అప్పు వచ్చి వాళ్లు అంతలా చెప్తున్నారు కదా నువ్వు రెడీ అవ్వు అక్కా అమ్మవారి వ్రతం చేస్తే అంతా మంచే జరుగుతుంది. త్వరలోనే నువ్వు బావ ఒక్కటవుతారు అక్క నువ్వు రెడీ అవ్వు అని చెప్పగానే సరే అంటూ కావ్య వెళ్తుంది. అంతా విన్న రుద్రాణి రాజ్‌ను కావ్యను ఒక్కటి చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అసలు పూజే జరగనివ్వను అనుకుంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లి.. తన మాటలతో రెచ్చగొడుతుంది. కానీ ధాన్యలక్ష్మీ కోపంగా రుద్రాణిని తిట్టి వెళ్లిపోతుంది.

ఇంట్లో అందరూ పూజ దగ్గర ఉండగా రాజ్‌, జూనియర్‌ స్వరాజ్‌ను తీసుకుని వస్తాడు. స్వరాజ్‌ను చూసిన అపర్ణ సర్‌ప్రైజ్‌ అయినట్టు నటిస్తుంది. రాజ్‌ వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో కావ్య రెడీ అయి కిందకు వస్తుంది. కావ్యను ట్రెడిషనల్‌ గా చూడగానే రాజ్‌ మైమరిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి వార్నింగ్ ఇచ్చిన భానుమతి.. ప్రణతికి తెలిసిన నిజం.. పెళ్లి ఆగిపోతుందా..?

Nindu Noorella Saavasam Serial Today August 15th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రావును వెళ్లిపోమ్మన్న అమర్‌

Gundeninda GudiGantalu Today episode: మౌనికకు మాటిచ్చిన మీనా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..ప్రభావతికి షాక్..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒకటి వేరీ స్పెషల్..

Illu Illalu Pillalu Today Episode: కామాక్షిని బుట్టలో వేసుకున్న భాగ్యం.. భాగ్యం ప్లాన్ సక్సెస్. శ్రీవల్లకి దూరమైన చందు..?

Big Stories

×