OTT Movie : హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలీలో ఒక ప్రశాంతమైన ఉదయం… ఇద్దరు వ్యక్తులు నడుస్తూ గుండె జారిపోయే దృశ్యాన్ని చూస్తారు. ఒక టీనేజ్ అమ్మాయిని దారుణంగా హత్య చేసి పడేస్తారు. అయితే రోజులు గడిచే కొద్దీ, మరింత మంది అమ్మాయిలు మిస్ అవుతారు. అయితే అందరి శవాలు ఒకే విధమైన భయంకర స్థితిలో కనిపిస్తాయి. ప్రతి క్రైమ్ సీన్‌లో ఒక విచిత్రమైన సిండ్రెల్లా బొమ్మ ముఖం ఉంటుంది. ఈ హత్యల వెనుక ఉన్న కిల్లర్ ఎవరు? అతని లక్ష్యం ఏమిటి? ఈ చిన్న హిల్ టౌన్‌ను భయాందోళనలో ముంచిన ఈ రాక్షసుడిని ఆపడం సాధ్యమా? అనే విషయాలు తెలియాలంటే మూవీ పేరు, ఓటీటీ వంటి వివరాలు తెలుసుకోవాల్సిందే.
కథలోకి వెళ్తే…
అర్జన్ సేథీ (అక్షయ్ కుమార్), ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్‌మేకర్. సైకోపాథ్‌లపై సినిమా తీయాలనేది అతని డ్రీం. కానీ అతని స్క్రిప్ట్‌లు తరచుగా రిజెక్ట్ అవుతాయి. కానీ కుటుంబ ఒత్తిడి, అతని సోదరి సీమా, బావ నరీందర్ సింగ్ (చంద్రచూర్ సింగ్) సలహాతో అతను హిమాచల్ ప్రదేశ్ పోలీసు ఫోర్స్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా చేరతాడు. కసౌలీలో చేరిన వెంటనే, ఒక 15 ఏళ్ల బాలిక సమీక్ష హత్య జరుగుతుంది, ఆమె శవం దారుణంగా విరిగిపోయి, సిండ్రెల్లా బొమ్మ ముఖంతో కనిపిస్తుంది. అర్జన్ అప్పటికే సైకోపాథ్‌లపై అధ్యయనం చేసి ఉండడంతో, ఈ హత్యలు ఒక సీరియల్ కిల్లర్ చేసినవని గుర్తిస్తాడు.
కానీ అతని సీనియర్ SHO గుడియా పర్మార్ (సర్గున్ మెహతా) అతని థియరీలను తేలిగ్గా తీసుకుంటుంది. దీంతో మరిన్ని హత్యలు జరుగుతాయి. అయితే అతను చెప్పిందే నిజమని గుర్తించిన పోలీస్ అధికారులు అతనికే కేసు అప్పగిస్తారు. అతను కిల్లర్ మోడస్ ఒపెరాండీని గుర్తిస్తాడు. ఈ దర్యాప్తులో అర్జన్ ఒక స్కూల్ టీచర్ దివ్య (రకుల్ ప్రీత్ సింగ్)తో ప్రేమలో పడతాడు. ఆమె అతని వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అవుతుంది. అర్జన్ దర్యాప్తు అతన్ని ఒక స్కూల్ ప్రొఫెసర్ తోమర్ వైపు నడిపిస్తుంది.
అతను విద్యార్థినులపై లైం*గిక వేధింపులకు పాల్పడతాడు. అర్జన్ మేనకోడలు పాయల్‌పై దాడి చేస్తున్నప్పుడు తోమర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడతాడు, అర్జన్ అతన్ని బాగా కొట్టి, హాస్పిటల్‌లో చేరుస్తాడు. అయితే తోమర్ తాను ఆ హత్యలు చేయట్లేదని అంటాడు. అదే రోజు పాయల్ మిస్ అవుతుంది. రెండు రోజుల తర్వాత ఆమె శవం కనిపిస్తుంది. అర్జన్, తోమర్‌ను పబ్లిక్ ప్లేస్‌లో కాల్చినందుకు సస్పెండ్ అవుతాడు. కానీ అతను దర్యాప్తును కొనసాగిస్తాడు. మరి చివరికి అర్జన్ హత్యలు చేస్తున్న సైకోను పట్టుకుంటాడా? క్లైమాక్స్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
Read Also : ఎండలోకి వెళ్తే చస్తారు… నెవర్ బిఫోర్ సునామీ… ఫ్యూజులు అవుట్ అయ్యే సైఫై మూవీ
ఏ ఓటీటీలో ఉందంటే?
ఈ సైకో కిల్లర్ మూవీ పేరు ‘Cuttputlli’. 2022లో వచ్చిన ఈ మూవీ Hotstarలో అందుబాటులో ఉంది. ఇందులో అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, సర్గున్ మెహతా, చంద్రచూర్ సింగ్, జోషువా లెక్లైర్, సుజిత్ శంకర్, గుర్ప్రీత్ ఘుగ్గి ప్రధాన పాత్రలు పోషించారు.