OTT Movie : కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రవీణా, దర్శకత్వంలో కూడా తన ప్రతిభని చూపుతున్నారు. ఈమె ‘కొత్తపల్లి గ్రామంలో’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుని, ఓటీటీలో కూడా అడుగు పెట్టింది. ఇందులో రామకృష్ణ అనే యువకుడు తన ప్రేమను సాధించేందుకు సృష్టించిన ఒక అబద్ధం ఊహించని గందరగోళానికి దారితీస్తుంది. ఈ స్టోరీ చివరివరకు ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఆహాలో స్ట్రీమింగ్
‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ (Kothapallilo Okappudu), 2025లో విడుదలైన తెలుగు కామెడీ డ్రామా చిత్రం, ప్రవీణా పరుచూరి దర్శకత్వంలో రూపొంది, రానా దగ్గుబాటి సమర్పణలో విడుదలైంది. గురు కిరణ్ బత్తుల రాసిన ఈ కథ, 1990లలో ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో మనోజ్ చంద్ర (రామకృష్ణ), మోనికా టి (సావిత్రి), ఉషా బొనేలా (ఆదిలక్ష్మి), రవీంద్ర విజయ్ (అప్పన్న), బెనర్జీ (రెడ్డి) ప్తదానా పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జూలై 18న థియేటర్లలో విడుదలై, ఆగస్టు 22 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే
కొత్తపల్లి గ్రామంలో, రామకృష్ణ నాటకాలు వేసే వాళ్ళని నడిపే ఒక చురుకైన యువకుడు. అతను జమీందార్ రెడ్డి మనవరాలు సావిత్రితో ప్రేమలో పడతాడు. రామకృష్ణ గ్రామంలో అప్పన్న అనే ఒక కిరాతక వడ్డీ వ్యాపారి వద్ద చేస్తుంటాడు. అప్పన్న గ్రామంలోని స్త్రీలను చులకనగా చూస్తూ, అధికారం కోసం రెడ్డితో పోటీపడతాడు. మరోవైపు రామకృష్ణ, సావిత్రిని తన నాటకంలో చేర్చడానికి, తన స్నేహితురాలు ఆదిలక్ష్మి, ఇంటి పనిమనిషిగా పనిచేసే సావిత్రి సన్నిహితురాలి సహాయం కోరతాడు. అయితే సావిత్రిని కలవడానికి రామకృష్ణ ఒక గడ్డి కుప్ప వద్ద ప్లాన్ చేసిన సమావేశం ఊహించని గందరగోళ సంఘటనకు దారితీస్తుంది. ఇది గ్రామంలో నిశ్చితార్థం గురించిన పుకార్లను రేకెత్తిస్తుంది. ఈ గందరగోళాన్ని సరిచేయడానికి రామకృష్ణ ఒక పురాణాన్ని సృష్టిస్తాడు.
కానీ ఈ అబద్ధం వటవృక్షంలా వ్యాపించి, గ్రామంలోని నమ్మకాలు, సామాజిక డైనమిక్స్‌ను అస్తవ్యస్తం చేస్తుంది. ఈ అబద్ధం గ్రామంలో కుల గొడవలకు దారితీస్తుంది. రామకృష్ణ చర్యలు ఊహించని పరిణామాలకు దారితీస్తాయి. అప్పన్న, రెడ్డి మధ్య శత్రుత్వం, గ్రామంలో నీటి సమస్యలు కథను మరో లెవెల్ కి తీసుకెళ్తాయి. రామకృష్ణ ప్రేమ, అతడు సృష్టించిన పురాణం కథతో, ఒక ఎమోషన్ క్లైమాక్స్‌కు వెళ్తుంది. రామకృష్ణ సృష్టించిన పురాణ కథ ఏమిటి ? గ్రామంలో ఎలాంటి గందరగోళం ఏర్పడుతుంది ? రామకృష్ణ లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : మనిషి మాంసాన్ని పీక్కుతినాలనే ఆకలి… ఈ అక్కాచెల్లెళ్ల అరాచకం చూస్తే గుండె గుభేల్… పోతారు మొత్తం పోతారు