E-Paper
Advertisement

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2
Advertisement

Animated Horror Comedy Series OTT : ఓ హోటల్ నడపాలంటే కస్టమర్లను ఆకట్టుకోవాలి. గదులను శుభ్రంగా ఉంచాలి, వాళ్లకు మంచి సర్వీస్ ఇవ్వాలి. కానీ ఆ హోటల్‌ లోకి వచ్చే అతిథులు మనుషులు కాకుండా దెయ్యాలు, రాక్షసులు అయితే… పైగా హోటల్ నడిపే మహిళకు సహాయం చేసేది చనిపోయిన ఆమె సోదరుడి ఆత్మ. ఇంట్లో ఉండే చిన్న పిల్లాడి శరీరంలో ఓ పురాతన డెమాన్ ఉంటే… అప్పుడు ఆ హోటల్‌లో జరిగే గందరగోళానికి హద్దులే ఉండవు. హారర్ ‌ను కామెడీతో కలిపి నవ్విస్తూనే భయపెట్టే అడల్ట్ యానిమేటెడ్ సిరీస్ ‘Haunted Hotel’ రెండో సీజన్‌తో తిరిగొచ్చింది. తాజాగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సీజన్‌ లో అండర్‌ వేల్ హోటల్‌ లో ఎలాంటి వింతలు ఎదురవుతాయో చూద్దాం.

కథలోకి వెళ్తే…

కేథరిన్ ఫ్రీలింగ్ ఓ సింగిల్ మదర్. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ బతుకుతుంది ఆమె. తన సోదరుడు చనిపోయిన తర్వాత అతడి హోటల్ బాధ్యతలు కూడా వచ్చి పడతాయి. ఆ హోటల్ పేరు అండర్‌ వేల్. సాధారణంగా ఓ వ్యాపారాన్ని వారసత్వంగా పొందితే అదృష్టంగా భావిస్తారు. కానీ కేథరిన్ ‌కు దక్కిన హోటల్ ‌లో మాత్రం సాధారణ సమస్యల కంటే అతీంద్రియ ఇబ్బందులే ఎక్కువ.

Advertisement

హోటల్‌ లో దెయ్యాలు తిరుగుతుంటాయి. వింత అతిథులు వస్తుంటారు. ఒక్కోసారి చిన్న సమస్యగా మొదలైన విషయం పెద్ద గందరగోళంగా మారుతుంది. కేథరిన్‌ కు తోడుగా ఉండే ఆమె సోదరుడు నాథన్ ఇప్పుడు బతికున్న మనిషి కాదు. అతడు దెయ్యంగా మారిపోయినా, తన సోదరికి సహాయం చేయడానికి హోటల్ ‌లోనే ఉంటాడు. నాథన్ ‌కు ఇతర దెయ్యాలతో మాట్లాడటం, వాళ్ల వింత అలవాట్లను అర్థం చేసుకోవడం అలవాటు. అయితే అతడి సలహాలన్నీ ఉపయోగపడతాయని మాత్రం చెప్పలేం.

కేథరిన్ పిల్లలు బెన్, ఎస్తర్ కూడా ఈ వాతావరణంలోనే పెరుగుతుంటారు. బెన్ కొంత సామాజికంగా ఇబ్బంది పడే స్వభావం కలవాడు. ఎస్తర్ ‌కు మాత్రం మంత్రాలు, బ్లాక్ మ్యాజిక్ వంటి విషయాలపై ఆసక్తి ఉంటుంది. పైగా హోటల్‌ లో ఉన్న అబాడన్ అనే పురాతన డెమాన్, 1700ల కాలానికి చెందిన చిన్న పిల్లాడి శరీరంలో బంధించబడి ఉంటాడు. అతడి ఉనికి హోటల్‌ లోని పరిస్థితులను మరింత విచిత్రంగా మారుస్తుంది.

Advertisement

రెండో సీజన్‌ లో ఈ కుటుంబం ఎదుర్కొనే సమస్యలు మరింత పెరుగుతాయి. దెయ్యాలు, రాక్షసులు, అతీంద్రియ సంఘటనలతో పాటు హోటల్ ‌ను నడిపించడానికి కావాల్సిన డబ్బు, అతిథులను నిలబెట్టుకోవడం వంటి సాధారణ సమస్యలూ ఉంటాయి. ఒక్కోసారి హోటల్‌ లో జరిగే సంఘటనలు భయపెట్టినా, పాత్రలు వాటిని ఎదుర్కొనే తీరు నవ్వు తెప్పిస్తుంది. దెయ్యాల మధ్య బతకడం కేథరిన్‌కు అలవాటైన పనిలా మారిపోయినా, ప్రతి కొత్త సమస్య ఆమెను మరో చిక్కులోకి నెడుతుంది.

అబాడన్ తిరిగి తెరపైకి రావడం, కొత్త అతీంద్రియ సమస్యలు మొదలవడం, నాథన్ తన కుటుంబాన్ని కాపాడే ప్రయత్నాలు చేయడం ఈ సీజన్‌లో కీలకంగా ఉంటాయి. హోటల్‌లో చివరకు ఎవరి మాట నెగ్గుతుంది ? కేథరిన్ ఈ వింత వ్యాపారాన్ని నిలబెట్టుకోగలదా ? ప్రతి గదిలోనూ ఏదో ఓ రహస్యం దాగి ఉన్న ఈ హోటల్‌ లో మరోసారి ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే రెండో సీజన్ చూడాల్సిందే.

Also Read : కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

తెలుగులో ఉందా ?

‘Haunted Hotel’ను మాట్ రోలర్ రూపొందించారు. నాథన్ ‌కు విల్ ఫోర్టే, కేథరిన్ ‌కు ఎలైజా కూప్, బెన్‌ కు స్కైలర్ గిసోండో, ఎస్తర్ ‌కు నటాలీ పాలమిడెస్, అబాడన్‌ కు జిమ్మీ సింప్సన్ వాయిస్ అందించారు. రెండో సీజన్ 2026 అక్టోబర్ 9న విడుదలైంది. ప్రస్తుతం Netflixలో ఇంగ్షీషులోనే స్ట్రీమింగ్ అవుతోంది ఈ ఇంగ్షీషు మూవీ.

Tags

Related News

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

పోలీస్ స్టేషన్‌లో ఖాకీల క్రైమ్… నిజాన్ని దాచేందుకు పోలీసులే కుట్ర… ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ కావొద్దు

వైష్ణవి చైతన్య – ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ఓటీటీలోకి… తెలుగుతో సహా 5 భాషల్లో

క్రిమినల్స్ వేటలో శవమై తేలే ఏజెంట్… అనుకున్నంత సింపుల్ కాదు ఈ కేసు… ఇంటెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్

మళ్లీ మొదలైన రచ్చ… నలుగురు ఫ్రెండ్స్ లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్ ట్విస్టులతో సీజన్ 2 స్ట్రీమింగ్ షురూ

Big Stories

Advertisement
×