OTT Movie : ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలను తీయడంలో మలయాళ మేకర్స్ ఒకడుగు ముందే ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీని సకుటుంబ సమేతంగా కలిసి చూడడమే కాదు, పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మలయాళ కామెడీ మూవీ ఏ ఓటీటీలో ఉందో ఒక లుక్కేద్దాం పదండి.
హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
ఈ మలయాళ కామెడీ డ్రామా పేరు ‘Falimy’. 2023లో విడుదలైన ఈ మూవీలో ఒక కుటుంబం తమ ఇంటి పెద్దాయన కాశీ యాత్ర కోరికను నెరవేర్చడానికి చేసే ప్రయాణం గురించి ఉంటుంది. ఈ చిత్రంలో హాస్యం, కుటుంబ బంధాలు, విలువలు, వ్యక్తిగత సమస్యలు… అలా ఒక సాధారణ మనిషి జీవితంలో ఉండే అంశాలన్నీ ఉంటాయి. కానీ కామెడీ హైలెట్. ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్ నటన, కామెడీ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలతో తేలిగ్గా, కుటుంబంతో ఆనందించేలా ఉంటుంది. నితీష్ సహదేవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ (అనూప్), జగదీష్ (చంద్రన్), మంజు పిళ్ళై (రేమ), సందీప్ ప్రదీప్ (అభిజిత్), మీనరాజ్ (జనార్ధనన్), అమిత్ మోహన్ రాజేశ్వరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా JioHotstarలో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
అనూప్ (బాసిల్ జోసెఫ్) ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, తిరువనంతపురంలో తన తల్లిదండ్రులు చంద్రన్ (జగదీష్), రేమ (మంజు పిళ్ళై), తమ్ముడు అభిజిత్ (సందీప్ ప్రదీప్), తాత జనార్ధనన్ (మీనరాజ్)తో కలిసి నివసిస్తాడు. చంద్రన్ ఎప్పుడూ సరిగ్గానే ఉంటానని చెప్పే మొండి తండ్రి, రేమ కుటుంబ ఆదాయానికి ఆధారం, అనూప్ తన లవ్ ఫెయిల్యూర్ తో నిరాశలో ఉంటాడు. అభిజిత్ డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తాడు. జనార్ధనన్ (82) కాశీకి ఒంటరిగా వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఇంటి నుండి పారిపోతుంటాడు.
అనూప్‌కు ఇష్టమైన అనఘ అనే అమ్మాయి సలహాతో, కుటుంబం జనార్ధనన్ కాశీ యాత్ర కోరికను నెరవేర్చడానికి ఒక రోడ్ ట్రిప్‌కు బయలుదేరుతుంది. అయితే వారి వ్యక్తిగత సమస్యలు, అహంకార ఘర్షణలు ఈ ప్రయాణాన్ని గందరగోళంగా మారుస్తాయి. ప్రయాణంలో, మధ్యలో చిక్కుకోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం, ఒకరి తప్పులను మరొకరు ఎగతాళి చేయడం. జనార్ధనన్ ఒక సందర్భంలో మిస్ అవ్వడం వంటివి జరుగుతాయి. ఇది ఆ కుటుంబాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ ప్రయాణంలో, కుటుంబం ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటారు. జనార్ధనన్ కాశీ కోరిక వెనుక ఉన్న కారణం వెల్లడవుతుంది. చెప్పడానికి ఇంత సింపుల్ గా ఉన్నా, చూస్తే మాత్రం మూవీ అదిరిపోతుంది.
Read Also : తినడానికి తిండి కూడా లేని వ్యక్తికి 5000 కోట్లు… ట్విస్టులతో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్