E-Paper
Advertisement

గుడ్డిపిల్ల బాడీలోకి మంత్రగత్తె ఆత్మ… దిమ్మతిరిగిపోయేలా ప్రతీ ఎపిసోడ్

గుడ్డిపిల్ల బాడీలోకి మంత్రగత్తె ఆత్మ… దిమ్మతిరిగిపోయేలా ప్రతీ ఎపిసోడ్
Advertisement

Fantasy Adventure series OTT : ఫాంటసీ, యాక్షన్, రొమాన్స్ కలగలిసిన ఒక పీరియడ్ డ్రామా ఓటీటీలో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇది ఒక కొత్త ప్రపంచాన్ని మన కళ్ళముందు ఉంచుతుంది. అందుకే దీనిని ‘హ్యారీ పాటర్’, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి కథలతో పోలుస్తుంటారు. ఇందులో మ్యాజిక్, కత్తి యుద్ధాలు, ఆత్మల పొసెషన్స్ వంటి అంశాలు ఉండటం వల్ల ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. దీనికి ఐయండిబిలో 8.7 రేటింగ్ ఉందంటే దీని కంటెంట్ ఎలా ఉంటుందో తెలుస్తోంది. మీరు ఒక మంచి గ్రాండియర్ ఉన్న కథను, అదిరిపోయే విజువల్స్‌తో చూడాలనుకుంటే ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా పేరు ‘అల్కెమీ ఆఫ్ సోల్స్’ (Alchemy of Souls). ఈ సిరీస్ కోసం దక్షిణ కొరియాలోని ముంగ్యోంగ్ ప్రాంతంలో దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఒక గ్రామాన్ని సెట్‌గా నిర్మించారు. ఇందులోని మాయాజాలం, యుద్ధ సన్నివేశాల కోసం వాడిన విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిని తలపిస్తాయి. ఈ డ్రామా తర్వాత హీరో లీ జే-వూక్ అంతర్జాతీయంగా స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పార్ట్ 1లో జుంగ్ సో-మిన్, పార్ట్ 2లో గో యూన్-జుంగ్ తమ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ సిరీస్ కేవలం కొరియాలోనే కాకుండా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా టాప్-10లో నిలిచింది. ఇందులోని ‘స్కార్స్ లీవ్ బ్యూటిఫుల్ ట్రేస్’ వంటి పాటలు ఇప్పటికీ మ్యూజిక్ చార్ట్స్‌లో పాపులర్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ netflix లో తెలుగు అడియోతో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

దేహో అనే మాయా ప్రపంచంలో కొందరు మాంత్రికులు తమ ఆత్మలను వేరే వాళ్ల శరీరాల్లోకి మార్చుకుంటూ ప్రాణాలతో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. నక్-సు అనే ఒక పవర్‌ఫుల్ లేడీ కిల్లర్ కూడా గాయపడినప్పుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన ఆత్మను ఒక బలహీనమైన డియోక్ అనే గుడ్డి అమ్మాయి శరీరంలోకి మారుస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ ఆ శరీరంలోకి వెళ్ళాక ఆమె శక్తులన్నీ మాయమైపోతాయి. మరోవైపు హీరో తన తండ్రి చేసిన పని వల్ల చిన్నప్పుడే తన శక్తులన్నీ కోల్పోతాడు. తను మంత్రవిద్యలు నేర్చుకోవాలని ఎంత ప్రయత్నించినా ఎవరూ నేర్పించరు. అలాంటి సమయంలో డియోక్ వెనుక ఉన్నది ఎవరో  హీరో కనిపెడతాడు.

దీంతో ఆమెని తనకి గురువుగా ఉండి మంత్రాలు నేర్పించమని అడుగుతాడు. అలా వారిద్దరి మధ్య ఒకవైపు గురుశిష్యుల సంబంధం, మరోవైపు ప్రేమ మొదలవుతాయి. హీరో తన శక్తులను ఎలా సాధించాడు, విలన్లు చేసే కుట్రల నుండి తన రాజ్యాన్ని ఎలా కాపాడాడు అనేదే మిగతా కథ. ఈ ప్రయాణంలో హీరోయిన్ ఆత్మ ఏమైంది? ఆమె నిజంగానే మాయమైపోయిందా? మళ్ళీ తిరిగి వచ్చిందా? అనే మలుపులతో పార్ట్ 1 పార్ట్ 2 సాగుతాయి. అద్భుతమైన విజువల్స్. ఎమోషన్స్‌తో ఈ సిరీస్ చాలా ఆసక్తిగా ఉంటుంది.

Advertisement

Read Also : కోట్లు కొల్లగొట్టే ప్లాన్.. నవ్విస్తూనే గజగజ వణికించే యాక్షన్… మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×