E-Paper
Advertisement

మనుషులను రాక్షసులుగా మార్చే మందు… రెండు సీజన్లతో వణికిపోయిన ఓటీటీ

మనుషులను రాక్షసులుగా మార్చే మందు… రెండు సీజన్లతో వణికిపోయిన ఓటీటీ
Advertisement

Horror series OTT : భయంకరమైన రాక్షసులతో ఒక ఉత్కంఠభరితమైన హిస్టారికల్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 1945 నాటి కాలంలో జపాన్ లో సాగే ఈ సిరీస్, మనుషులపై జరిగే క్రూరమైన సైంటిఫిక్ ప్రయోగాల వల్ల పుట్టిన ఒక వింత రాక్షసి చుట్టూ కథ తిరుగుతుంది. భారీ విజువల్స్, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఈ సిరీస్ ఓటీటీలో బాగా ట్రెండ్ అయింది. రెండు సీజన్లతో వచ్చిన ఈ సిరీస్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఒక్క ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఇక చివరి ఎపిసోడ్ వరకు కుర్చీలకు అతుక్కుపోతారు.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ హారర్ మిస్టరీ సిరీస్ పేరు ‘గైంగ్‌సియాంగ్ క్రీచర్’ (Gyeongseong Creature). ఇందులో పార్క్ సియో-జూన్, హాన్ సో-హీ ప్రధాన పాత్రల్లో నటించారు. సిరీస్‌లో రాక్షసిని జపాన్ సైన్యం ‘యూనిట్ 731’ పేరుతో చేసిన నిజమైన క్రూర ప్రయోగాల ఆధారంగా సృష్టించారు. దాదాపు 430 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కోసం 1945 నాటి కొరియా వాతావరణాన్ని అచ్చం అలాగే చూపించేలా భారీ సెట్స్ వేశారు. ఇందులో వాడిన విజువల్ ఎఫెక్ట్స్, ఆ రాక్షసి రూపం హాలీవుడ్ స్థాయి మేకింగ్‌ను తలపిస్తాయి. ముఖ్య పాత్రల్లో నటించిన పార్క్ సియో-జూన్, హాన్ సో-హీలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ వల్ల ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది రెండు భాగాలుగా వచ్చింది. మొదటి భాగం (7 ఎపిసోడ్లు) 2023 డిసెంబర్ 22న విడుదలవ్వగా, రెండో భాగం (3 ఎపిసోడ్లు) 2024 జనవరి 5న విడుదలైంది. మొత్తం 10 ఎపిసోడ్లతో ఈ సీజన్ 1945 కాలం నాటి కథను చూపించింది. ఇక సీజన్ 2: మొత్తం 7 ఎపిసోడ్లతో 2024 సెప్టెంబర్ 27న విడుదలైంది. ఇది మొదటి సీజన్‌కు భిన్నంగా 79 ఏళ్ల తర్వాత, అంటే ప్రస్తుత కాలం నేపథ్యంలో సాగుతుంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

1945లో జపాన్ పాలనలో ఉన్న కొరియాలో టే-సాంగ్ అనే ఒక ధనవంతుడు ఉంటాడు. ఒక పోలీస్ అధికారి తన ప్రేయసిని వెతికి పెట్టమని ఇతడిని ఆదేశిస్తాడు. దాంతో టే-సాంగ్, తప్పిపోయిన మనుషుల్ని వెతకడంలో ఆరితేరిన చై-ఒక్ అనే యువతి సహాయం తీసుకుంటాడు. వీళ్ళు ఆ అమ్మాయి కోసం వెతుకుతుండగా, అనుమానాస్పదంగా ఉన్న ఒక మిలిటరీ ఆసుపత్రిలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఆసుపత్రిలో జపాన్ సైన్యం మనుషులపై రహస్యంగా భయంకరమైన ప్రయోగాలు చేస్తుంటుంది. ఒక వింత వైరస్ వల్ల అక్కడున్న ఒక మనిషి క్రూరమైన రాక్షసిగా మారిపోతుంది. అక్కడ బందీలుగా ఉన్న వారిని కాపాడే ప్రయత్నంలో హీరో హీరోయిన్లు ప్రాణాలకు తెగించి పోరాడుతారు. ఆ ఆసుపత్రి లోపల జరిగే భయానక పరిస్థితులు, సైన్యం చేసే అరాచకాలు ఈ సిరీస్‌లో ప్రధానంగా కనిపిస్తాయి. అయితే కథలో అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఆ రాక్షసిగా మారింది మరెవరో కాదు, పదేళ్ల క్రితం చై-ఒక్ కి దూరమైన తన కన్నతల్లి. తన తల్లిని ఆ రూపంలో చూసి ఆమె తట్టుకోలేకపోతుంది. ఆతరువాత యాక్షన్ పీక్స్ కి వెళ్తుంది. అటు రాక్షసి నుండి, ఇటు జపాన్ సైన్యం నుండి తప్పించుకుని హీరో హీరోయిన్లు ఎలా బయటపడ్డారు అనేదే ఈ సీజన్ ఉత్కంఠభరితమైన ముగింపు.

Read Also : బ్లాక్ మెయిల్ ఉచ్చులో వయ్యారి భామ… ఆటాడేసుకునే అపరిచితుడు… మైండ్ గల్లంతయ్యే క్లైమాక్స్

Tags

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×