Crime Investigation Series OTT : నేరం జరిగిన తర్వాత ఆధారాలు వెతకడం ఒక ఎత్తయితే… దేశ భద్రతకు సంబంధించిన రహస్య కేసుల వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోవడం మరో ఎత్తు. అలాంటి క్లిష్టమైన కేసులను ఛేదించే ఎఫ్‌బీఐ స్పెషల్ టీమ్ మరోసారి రంగంలోకి వచ్చింది. కొత్త పార్ట్‌నర్, అండర్‌కవర్ ఆపరేషన్, ప్రభుత్వ రహస్య ప్రాజెక్ట్ చుట్టూ తిరిగే హత్య కేసు… ఇలా సీజన్ 9లో కథ మరింత ఇంటెన్స్‌గా మారింది. ముఖ్యంగా ఓ యువతి హత్య కేసు వెనుక ఊహించని రహస్యం బయటపడటంతో టీమ్‌కి కొత్త సవాళ్లు ఎదురవుతాయి. డెడ్లీ క్రైమ్స్, ఇన్వెస్టిగేషన్, యాక్షన్‌తో వచ్చిన ‘FBI Season 9’ ఇప్పుడు స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సీజన్‌ను తెలుగులో చూడొచ్చా ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది తెలుసుకుందాం పదండి.
న్యూయార్క్‌లో పని చేసే ఎఫ్‌బీఐ స్పెషల్ టీమ్ చుట్టూనే ఈ సీజన్ కథ కొనసాగుతుంది. నగరంలో జరిగే హత్యలు, టెర్రరిజం, జాతీయ భద్రతకు సంబంధించిన కేసులను పరిష్కరించడం ఈ టీమ్ పని. సీజన్ 9 ప్రారంభంలోనే ఓ యువతిని స్టేట్ పార్క్‌లో కాల్చి చంపేస్తారు. మొదట అది హత్యలా కనిపించినా, దర్యాప్తు మొదలైన తర్వాత ఆమె ఓ కీలకమైన విషయానికి సాక్షిగా ఉందని తెలుస్తుంది. ఆమె చూసింది ఓ వ్యక్తి హత్య. ఓ టాప్ సీక్రెట్ ప్రభుత్వ ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న వ్యక్తిని హత్య చేయడాన్ని ఆ యువతి చూసినట్లు టీమ్ గుర్తిస్తుంది. దీంతో కేసు ఒక్కసారిగా దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా మారుతుంది.
మరోవైపు మాగీ బెల్ తన కొత్త పార్ట్‌నర్ ఇసయ్య గ్రీన్‌తో కలిసి పని చేయాల్సి వస్తుంది. ఇంతకాలం తనతో కలిసి పని చేసిన టీమ్ డైనమిక్స్ మారిపోవడంతో కొత్త పార్ట్‌నర్ తో సమన్వయం చేసుకోవడం ఆమెకు ఇబ్బందిగా మారుతుంది. కేసు ఎంత సీరియస్‌గా ఉన్నా వ్యక్తిగతంగా ఎదురయ్యే ఈ మార్పులను కూడా ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే సమయంలో ఓఏ జిదాన్ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. అతడు ఓ అండర్‌కవర్ ఆపరేషన్‌లో భాగంగా అన్నా వోర్పేకు సంబంధించిన రోగ్ స్ట్రైక్ టీమ్‌లోకి చొరబడతాడు. వాళ్లతో కలిసి పని చేస్తున్నట్లు కనిపించినా, అసలు లక్ష్యం ఆ టీమ్ వెనుక ఉన్న వ్యక్తులను బయటకు లాగడం. అయితే ఆ టీమ్ అనుసరించే పద్ధతులు ఓఏ నమ్మే విలువలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి.
కేసును ఛేదించేందుకు అతడు మరింత లోతుగా వెళ్లాల్సి వస్తుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని అనుమానించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు మాగీ టీమ్ కూడా ప్రభుత్వ రహస్య ప్రాజెక్ట్ వెనుక ఉన్న వ్యక్తులను వెతుకుతూనే ఉంటుంది. ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ కేసు మరింత పెద్దదిగా మారుతుంది. ఓఏ తన మిషన్‌ను పూర్తి చేయగలిగాడా ? హత్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ? కొత్త టీమ్ డైనమిక్స్ ఎలా మారాయి ? అన్నది తెలుసుకోవాలంటే సీజన్ 9 చూడాల్సిందే.
Also Read : పాపులర్ షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ
‘ఎఫ్బిఐ సీజన్ 9’లో మిస్సీ పెరెగ్రిమ్, జీకో జాకీ, జెరెమీ సిస్టో, అలానా డి లా గార్జా, జాన్ బోయిడ్, జూలియానా ఐడెన్ మార్టినెజ్, రోలాండ్ బక్ III తదితరులు నటించారు. డిక్ వోల్ఫ్ ఈ సిరీస్‌కు ప్రధాన నిర్మాతల్లో ఒకరు. సీజన్ 9 ప్రీమియర్ 2026 అక్టోబర్ 5న జరిగింది. Amazon Prime Videoలో ఈ సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే Paramount+ ద్వారా కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇంగ్షీషులోనే ఉంది సిరీస్.