E-Paper
Advertisement

ఇంట్రోవర్ట్ ను చీట్ చేసినందుకు ఇంత ఘోరమా… మెంటల్ మాస్ క్లైమాక్స్

ఇంట్రోవర్ట్ ను చీట్ చేసినందుకు ఇంత ఘోరమా… మెంటల్ మాస్ క్లైమాక్స్
Advertisement

Psychological Thriller : మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఫ్రెడ్డీ’ (Freddy) ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ తన చాక్లెట్ బాయ్ ఇమేజ్‌ ను పక్కన పెట్టి, సైకో డెంటిస్ట్‌ గా నటించిన సినిమా ఇది. ఓ ఇంట్రవర్ట్ డాక్టర్ తనను చీట్ చేసిన అమ్మాయిపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది ఈ మూవీ స్టోరీ.

కథలోకి వెళ్తే…

డాక్టర్ ఫ్రెడ్డీ గిన్‌వాలా (కార్తీక్ ఆర్యన్) అమాయకపు డెంటిస్ట్. ముంబైలో ఒంటరిగా ఉండే ఈ డాక్టర్ కంప్లీట్ గా ఇంట్రవర్ట్. చిన్నతనంలో తండ్రి తన తల్లిని చంపేస్తాడు. తరువాత అతను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఇవన్నీ చూసిన ఫ్రెడ్డీ తీవ్రమైన మానసిక గాయంతో పెరుగుతాడు. సమాజంలో ఎవరితోనూ కలవలేని అతనిని ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఇంట్లో మాత్రం ‘హార్డీ’ అనే పెంపుడు తాబేలు ఉంటుంది. అది మాత్రమే అతనికి ఉన్న ఏకైక స్నేహితుడు. ఈ క్రమంలోనే పెళ్లి కోసం మ్యారేజ్ సైట్లలో వెతుకుతుంటాడు. కానీ ప్రతి అమ్మాయి అతడిని రిజెక్ట్ చేస్తుంది.

Advertisement

ఈ నేపథ్యంలో ఓ పార్టీలో ఫ్రెడ్డీకి కైనాజ్ ఇరానీ (అలయా ఎఫ్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. కైనాజ్ భర్త రుస్తుం ఆమెకు రోజూ టార్చర్ తో నరకం చూపిస్తాడు. అతను ఆమెను క్రూరంగా కొడుతున్నాడని ఫ్రెడ్డీకి తెలుస్తుంది. కైనాజ్ కన్నీళ్లు చూసి చలించిపోయిన ఫ్రెడ్డీ, ఆమెను ఎలాగైనా కాపాడాలనుకుంటాడు. ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తారు. ఒకరోజు రాత్రి ఫ్రెడ్డీ తన కారుతో రుస్తుంను గుద్ది చంపేస్తాడు. ఇక్కడే ఊహించని షాకింగ్ ట్విస్ట్ వస్తుంది.

రుస్తుం చనిపోయిన మరుసటి రోజే కథలో అసలైన మైండ్ బ్లోయింగ్ మలుపు వస్తుంది. ఫ్రెడ్డీ సంతోషంగా కైనాజ్ ఇంటికి వెళ్లేసరికి, అక్కడ ఆమె తన ప్రియుడు రేమండ్‌ తో కలిసి ఎంజాయ్ చేయడాన్ని చూస్తాడు. నిజానికి కైనాజ్ ఫ్రెడ్డీని ప్రేమించదు. కానీ భర్త ఆస్తిని దక్కించుకోవడానికి ఒక ‘బకరా’ కోసం ఎదురు చూస్తుంది. అలాంటి టైమ్ లో తగిలిన అమాయకుడైన ఫ్రెడ్డీని వాడుకుంది. పైగా పోలీసులకు చెబితే రుస్తుంను చంపిన కేసులో నిన్నే జైలుకు పంపుతామని రేమండ్, కైనాజ్ కలిసి ఫ్రెడ్డీని బెదిరిస్తారు. మరి ఈ మోసానికి ఫ్రెడ్డీ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు ? వాళ్ళకి ఎలాంటి శిక్ష వేశాడు ? అమాయకంగా కన్పించే అతనిలో అంతా క్రూరత్వం ఎలా వచ్చింది ? అన్నది స్టోరీ.

Advertisement

ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ప్రముఖ దర్శకుడు శశాంక ఘోష్ తెరకెక్కించగా, ఏక్తా కపూర్ (బాలాజీ మోషన్ పిక్చర్స్) నిర్మించారు. థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలైన ఈ చిత్రం 2 గంటల 4 నిమిషాల నిడివితో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సినిమా హిందీ భాషలో రూపొందినప్పటికీ, తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు కార్తీక్ ఆర్యన్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనతో పాటు అలయా ఎఫ్ కథను మలుపు తిప్పే నెగెటివ్ షేడ్ ఉన్న కైనాజ్ పాత్రలో నటించగా, కరణ్ పండిట్, సజ్జాద్ డెలాఫ్రూజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రీతమ్ సంగీతం అందించగా, ఈ చిత్రానికి IMDbలో 7.2 రేటింగ్‌ ఉంది.

Read Also : ఊరినే వల్లకాడుగా మార్చే ఒకే ఒక్క పొరపాటు… సింగిల్ గా చూశారో ఫసక్

Tags

Related News

అర్జునుడిని మించిన విలుకాడు.. అయినా జీవితమంతా అవమానాలే… ఓటీటీలోకి తెలుగులోనే కర్ణుడి కథ

ఇదెక్కడి ఉన్మాదంరా అయ్యా… పెళ్ళాన్ని చంపిందని షార్క్ పై పగబట్టే సైకో

ఒక హత్య… వంద అనుమానాలు… క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గ్యారంటీ

డబ్బుల కోసమే బాయ్ ఫ్రెండ్ తో ప్రేమ డ్రామా… నాగ దుర్గ తమిళ మూవీ తెలుగు స్ట్రీమింగ్ షురూ

ఒక ప్రయాణం… రెండు ప్రేమకథలు… ప్రతి కుటుంబం చూడాల్సిన రోడ్ ట్రిప్ డ్రామా

తల్లికి పెళ్లి చేయాలనుకునే పెళ్లీడుకొచ్చిన కొడుకు… విజయ్ ఆంటోని ఫ్యామిలీ డ్రామా తెలుగులో

కుస్తీ పోటీల్లో ఇరగదీసే భార్య… ఇంట్లోనే స్ట్రగులయ్యే భర్త… తమిళ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు తెలుగులోనే

చెక్క వంతెన దాటితే చావు మూడినట్టే… క్లైమాక్స్‌తో పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ మూవీ తెలుగులో

Big Stories

Advertisement
×