E-Paper

బాబోయ్ పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం… కడుపుబ్బా నవ్వించే కామెడీ డిటెక్టివ్ డ్రామా

బాబోయ్ పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం… కడుపుబ్బా నవ్వించే కామెడీ డిటెక్టివ్ డ్రామా

Crime Comedy OTT : ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు సినిమాలు చూడవచ్చు అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. అందుకే ఏ భాషలో మూవీ రిలీజ్ అయినా, దాన్ని అన్నీ భాషల ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అలా కన్నడలో వచ్చిన క్రేజీ క్రైమ్ కామెడీ డ్రామా ఈరోజు మన మూవీ సజెషన్. బెల్ బాటమ్ (Bell Bottom) అనే ఈ సినిమా JioHotstarలో అందుబాటులో ఉంది. 1980ల నాటి నేపథ్యంలో సాగే ఈ సూపర్ హిట్ రెట్రో క్రైమ్-కామెడీ థ్రిల్లర్. ఇందులో రిషబ్ శెట్టి ‘డిటెక్టివ్ దివాకర్’ పాత్రలో నటించగా, హరిప్రియ కథానాయికగా నటించారు.

కథలోకి వెళ్తే…

మన కథానాయకుడు దివాకర్ (రిషబ్ శెట్టి). చిన్నతనం నుంచే జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తుంటాడు. అలాగే డిటెక్టివ్ నవలలు చదువుతూ పెరిగి పెద్దవుతాడు. ఎలాగైనా పెద్దయ్యాక ఒక గొప్ప డిటెక్టివ్ అవ్వాలని కలలు కంటాడు. అయితే అతని తండ్రి అన్నప్ప పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఉంటాడు. అతను తన కొడుకును కూడా పోలీస్ ఆఫీసర్ గా చూడాలని అనుకుంటాడు. తండ్రి ఒత్తిడి తట్టుకోలేక, ఇష్టం లేకపోయినా కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరతాడు దివాకర్. మొదటి కేసే కాస్త కష్టంగా ఉంటుంది.

ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మిస్టీరియస్ హత్య కేసు నమోదవుతుంది. సీనియర్ అధికారులు కూడా ఆ కేసును ఛేదించలేక చేతులు ఎత్తేస్తారు. ఆ సమయంలో దివాకర్ డిటెక్టివ్ నాలెడ్జ్ తో, చాలా సులువుగా ఆ మర్డర్ మిస్టరీని ఛేదిస్తాడు. ఈ ఒక్క కేసుతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ లో అతని పేరు మారుమోగిపోతుంది. అప్పటి నుంచి అందరూ అతన్ని ఎగతాళి చేయడం మానేస్తారు. పైగా గౌరవించడం మొదలు పెడతారు.

దివాకర్‌ కు సవాల్ ఎదురవుతుంది. ఇలాంటి సమయంలోనే ఆ ప్రాంతంలోని మూడు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో వరుసగా విచిత్రమైన దొంగతనాలు జరుగుతాయి. పోలీసులు రికవరీ చేసి, ముద్రలు వేసి భద్రపరిచిన దొంగతనం సొమ్ము మాత్రమే మాయమవుతుంది. ఆ దొంగలు ఎలాంటి ఆధారాలు వదలరు. పైగా వేలిముద్రలు కూడా వదలకుండా అత్యంత తెలివిగా దొంగతనం చేస్తారు. ఈ కేసు పోలీసుల పరువుకు సవాల్‌ ఆవుతుంది. దీనితో పైఅధికారులు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతను దివాకర్‌ కు అప్పగిస్తారు.

దివాకర్ ఖురేషితో కలిసి ఈ కేసు విచారణ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో నాటు సారా అమ్మే కుసుమ (హరిప్రియ) అనే అమ్మాయితో దివాకర్ ప్రేమాయణం మొదలు పెడతాడు. అయితే విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ దివాకర్‌ కు కొన్ని అనుమానాస్పద విషయాలు తెలుస్తాయి. దొంగతనం జరిగిన ప్రతి పోలీస్ స్టేషన్‌ కు ఏదో ఒక పని మీద కుసుమ వచ్చి వెళ్లినట్లు గుర్తిస్తాడు. అలాగే ‘సగాని పింటో’ అనే మరో అనుమానితుడు కూడా ఈ కేసులో యాడ్ అవుతాడు. ఆ తరువాత కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. మరి ఆ ట్విస్ట్ ఏంటి ? దివాకర్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన నిజం ఏంటి ? ఈ దొంగతనాల వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఎవరు ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Read Also : జైలులోనే అతి కిరాతకంగా హత్య… సైకో కిల్లర్ కు చెక్ పెట్టే లేడీ కిలాడీ

Tags

Related News

ఇంట్రోవర్ట్ ను చీట్ చేసినందుకు ఇంత ఘోరమా… మెంటల్ మాస్ క్లైమాక్స్

చావు అంచుల దాకా తీసుకెళ్ళే తొందరపాటు… ఫీల్ గుడ్ మలయాళం మూవీ

లవ్ కాదు లైఫ్ స్టోరీ… గుండె బరువెక్కే ఇంటెన్స్ ఎమోషనల్

పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్… ప్రతి ఒక్కరూ కనెక్టయ్యే అచ్చ తెలుగు సిరీస్

బాయ్ ఫ్రెండ్ తో డిటెక్టివ్ కూతురు జంప్… నెక్స్ట్ ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్

సిస్టమ్ మొత్తాన్ని గడగడలాడించిన కాటన్ ట్రేడర్… మైండ్ బెండింగ్ క్లైమాక్స్

కుళ్ళిపోయిన మృతదేహం… కొత్త ఎస్ఐ అడుగు పెట్టిన ఊళ్ళో అల్లకల్లోలం

×