E-Paper
Advertisement

లేడీస్ హాస్టల్ లో అమ్మాయి మర్డర్… అమాయకుడు బలి… చివరి 20 నిమిషాల్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్

లేడీస్ హాస్టల్ లో అమ్మాయి మర్డర్… అమాయకుడు బలి… చివరి 20 నిమిషాల్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్
Advertisement

Telugu Crime Thriller on OTT : నిజం చెప్పినా ఎవరూ నమ్మని పరిస్థితి వస్తే ? చేయని నేరానికి జీవిత ఖైదు పడితే ? అలాంటి ఓ అమాయక యువకుడి జీవితాన్ని తలకిందులు చేసిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కోర్ట్‌రూమ్ క్రైమ్ థ్రిల్లర్ ‘గీత సాక్షిగా’ (Geetha Sakshiga). దర్శకుడు ఆంథోనీ మట్టిపల్లి రూపొందించిన ఈ చిత్రం చట్టం, న్యాయం, పోలీసు దర్యాప్తు, కోర్టు విచారణల నేపథ్యంలో ఆసక్తికరంగా సాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో ఫ్రీగా చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అర్జున్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ పబ్‌లో డీజేగా పని చేస్తాడు. అటు వర్క్ లైఫ్, ఇటు కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న సాధారణ మధ్యతరగతి యువకుడు మన హీరో. అతను అమూల్య అనే యువతిని ప్రేమిస్తుంటాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో నగరంలోని ఓ లేడీస్ హాస్టల్‌లో మనీషా అనే యువతిపై అత్యాచారం జరిగి, ఆమె దారుణ హత్యకు గురవుతుంది.

Advertisement

ఈ కేసును విచారించే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శంకర్, సరైన ఆధారాలు లేకపోయినా కొన్ని పరిస్థితుల కారణంగా అర్జున్‌నే నిందితుడిగా అరెస్ట్ చేస్తాడు. అంతేకాదు అతనే దోషి అనిపించేలా సాక్ష్యాలను కూడా క్రియేట్ చేసి పెడతారు. అంటే స్వయంగా పోలీసులే ఒక తప్పు చెయని వ్యక్తిని ఈ కేసులో ఇరికించారు అన్నమాట. కోర్టులో అతనికి వ్యతిరేకంగా నిలిచిన సాక్ష్యాల కారణంగా అర్జున్‌కు జీవిత ఖైదు విధిస్తారు. తాను నిర్దోషినని ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు.

అయితే జైలుకు వెళ్లిన తర్వాత కూడా అర్జున్ న్యాయం జరుగుతుందనే ఆశలు వదులుకోడు. తనపై పడిన నిందను తొలగించుకోవడంతో పాటు అసలు నేరస్థులను బయట పెట్టాలని నిర్ణయించుకుంటాడు. మరి హీరో నిర్దోషిని అని నిరూపించుకున్నాడా ? అది ఎలా చేశాడు ? ఈ పోరాటంలో అతని ప్రేయసి అమూల్య కూడా అండగా నిలుస్తుంది. అసలు మనీషాను హత్య చేసింది ఎవరు ? అర్జున్‌ను ఈ కేసులో ఎందుకు ఇరికించారు ? వ్యవస్థలోని కుట్రలను ఛేదించి అతను నిర్దోషిగా బయటపడ్డాడా లేదా ? అనేదే సినిమా క్లైమాక్స్.

Advertisement

Also Read : గర్భిణీ నరబలి… చేతబడి… వరుస మరణాలు… వరలక్ష్మి శరత్‌కుమార్ సస్పెన్స్ థ్రిల్లర్

తెలుగులో ఫ్రీగానే స్ట్రీమింగ్

‘గీత సాక్షిగా’ ఓ ఇంట్రస్టింగ్ కోర్ట్‌రూమ్ డ్రామా. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో గోపి సుందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా ప్రస్తుతం JioTVలో ఉచితంగా తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. కోర్ట్‌రూమ్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్లు, సస్పెన్స్ కథలు ఇష్టపడే ప్రేక్షకులకు ‘గీత సాక్షిగా’ వర్త్ వాచింగ్ అని చెప్పవచ్చు. చివరి వరకు కంటిన్యూ చేసిన సస్పెన్స్, గ్రిప్పింగ్ కథ, న్యాయం కోసం ఒక వ్యక్తి చేసే పోరాటం ఈ సినిమాను ఓసారి తప్పకుండా చూడాల్సిన చిత్రంగా నిలబెడతాయి. ఇంకా చూడకపోతే ఈ వీకెండ్ ఒక లుక్కేయండి. స్ట్రీమింగ్ కూడా ఫ్రీనే కాబట్టి డోంట్ మిస్.

Tags

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×