E-Paper
Advertisement

నెట్ ఫ్లిక్స్ ను శాసిస్తున్న రూ.4566 కోట్ల మూవీ… ఇంకా చూడలేదా ?

నెట్ ఫ్లిక్స్ ను శాసిస్తున్న రూ.4566 కోట్ల మూవీ… ఇంకా చూడలేదా ?
Advertisement

Trending Monster Movie : అదిరిపోయే హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్స్, ఫాంటసీ సినిమాలకి ఇండియాలో ప్రేక్షాదరణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా వదలకుండా చూస్తారు మూవీ లవర్స్. ఇటీవల థియేటర్లలో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఓ సినిమా, ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోంది. వేల కోట్ల కలెక్షన్స్ తో దుమ్మురేపిన ఆ మూవీ పేరు మరేంటో కాదు ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్’ (Godzilla x Kong The New Empire). మరి ఈ మూవీ ఓటీటీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

బాక్సాఫీస్ రికార్డులు

2024లో థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సూపర్ హిట్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ట్రెండింగ్‌లో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రోజు నుంచి టాప్ 10 నుంచి బయట పడకుండా ఇప్పటికీ దూసుకెళ్తోంది. ఈ చిత్రం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ దుమ్మురేపింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.4,566 కోట్లు (4.66 బిలియన్లు) వసూలు చేసి భారీ విజయం సాధించింది. భారతదేశంలో మాత్రమే రూ.134.41 కోట్లు వసూలు చేసి మనీ మంత్రంగా మారింది.

Advertisement

గాడ్జిల్లా – కాంగ్ ఇద్దరూ కలిసి కొత్త శత్రువులతో యుద్ధం చేసే ఈ సినిమా మాన్స్టర్ వర్స్ ఫ్రాంచైజీలో ఒక మైలురాయి. ఈ మూవీ రిలీజ్ అయిన ఏడాదిన్నర తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ చిత్రం ఓటీటీలో విడుదలైన వెంటనే టాప్ 10లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం 10వ స్థానంలో ఉంటూ, కలంక్, ది నన్ 2, మా బెహన్, భూత్ బంగ్లా, ఆఫీస్ రొమాన్స్ వంటి చిత్రాలతో గట్టి పోటీ పడుతోంది. 1 గంట 54 నిమిషాల నిడివి గల ఈ సినిమా యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, భారీ స్కేల్ ఫైట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.

కథలో ఏముంది ?

గత యుద్ధం తర్వాత గాడ్జిల్లా భూమి ఉపరితలంపై ఉంటూ మానవాళిని, ఇతర రాక్షసుల (టైటాన్స్) నుండి కాపాడుతుంటుంది. కాంగ్ భూమి లోపల ఉండే రహస్య ప్రపంచం ‘హాలో ఎర్త్’ (Hollow Earth) లో తన జాతికి చెందిన ఇతరుల కోసం వెతుకుతూ ఒంటరిగా జీవిస్తుంటుంది. కొత్త విలన్ ‘స్కార్ కింగ్’: హాలో ఎర్త్‌లోని ఒక లోతైన ప్రాంతంలో కాంగ్‌ కు తనలాంటి కోతుల జాతి ఒకటి బానిసలుగా బతుకుతున్నట్లు తెలుస్తుంది. వారిని పాలిస్తున్న క్రూరమైన ఎరుపు రంగు కోతి ‘స్కార్ కింగ్’ (Skar King). అతను భూమి ఉపరితలాన్ని కూడా జయించి మానవాళిని అంతం చేయాలని ప్లాన్ చేస్తుంటాడు.

Advertisement

స్కార్ కింగ్ వద్ద ఒక పురాతన మంచు శక్తులు గల మహా రాక్షసి ‘షిమో’ (Shimo) బానిసగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన క్రిస్టల్ (స్ఫటికం) సాయంతో స్కార్ కింగ్ ఆ షిమోను తన అదుపులో ఉంచుకుని, దాని మంచు శక్తులతో ప్రపంచాన్ని గడ్డకట్టించాలని చూస్తాడు. స్కార్ కింగ్, అతని సైన్యాన్ని ఒంటిచేత్తో ఎదిరించడం కాంగ్‌ కు సాధ్యం కాదు. పైగా ఆ పోరాటంలో కాంగ్ చేయి తీవ్రంగా గాయపడుతుంది. మోనార్క్ (Monarch) శాస్త్రవేత్తలు కాంగ్‌కు ఒక రోబోటిక్ మెటల్ గ్లోవ్ అమరుస్తారు. ఆ తర్వాత కాంగ్ ఉపరితలానికి వచ్చి గాడ్జిల్లా సహాయం కోరుతుంది. మొదట ఇద్దరి మధ్య చిన్న యుద్ధం జరిగినా, ‘మోత్రా’ (Mothra) అనే పురాతన సీతాకోకచిలుక లాంటి దైవశక్తి జోక్యంతో గాడ్జిల్లా పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. ఆ తరువాత మంచు రాక్షసి నుంచి ఈ రెండూ కలిసి భూమిని ఎలా కాపాడాయి ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది స్టోరీ. ఈ మూవీ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన సిరీసులు… ‘ధురందర్ 2’ వ్యూస్ ఎంతంటే ?

Tags

Related News

18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు… 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

స్కూల్లోనే పిల్లల్ని చంపి తినే టీచర్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!

రూపాయి ఖర్చు లేకుండా చూడొచ్చు… ఓటీటీ ఫ్రీ క్యాటగిరీలో దుమ్మురేపుతున్న 7 వెబ్ సిరీస్‌లు

10 కోట్ల బ్యాగ్‌ దొరకడంతో మొదలయ్యే గందరగోళం… కితకితలు పెట్టే ఇమ్మిగ్రెంట్స్ కష్టాలు

స్కూల్ టీచర్ నుంచి డిటెక్టివ్‌గా… ట్రిపుల్ మర్డర్, ట్రెజర్ హంట్, లవ్ ట్రయాంగిల్ తో అదిరిపోయే డార్క్ కామెడీ సిరీస్

కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

Big Stories

Advertisement
×