E-Paper
Advertisement

Hombale Films – RCB: హోంబలే ఫిల్మ్స్ చేతిలోకి RCB..ఇక ఫ్యాన్స్ కు పండ‌గే ?

Hombale Films – RCB: హోంబలే ఫిల్మ్స్ చేతిలోకి RCB..ఇక ఫ్యాన్స్ కు పండ‌గే ?
Advertisement

Hombale Films – RCB:  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bengaluru) పెను ప్ర‌మాదంలో ఉంది. 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. టైటిల్ గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీ చేస్తే, ఏకంగా 11 మంది మరణించారు. ఇక ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టును విక్రయించే పరిస్థితులు కూడా వచ్చాయి. ఇప్పటికే డియాగో కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగానే వెల్లడించింది. మార్చి 31వ తేదీ 2026 సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ రాబోతున్నాడు. అంటే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 Tournament) మధ్యలోనే కొత్త ఓనర్ చేతిలోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వెళ్తుందన్నమాట.

Also Read: PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?

బెంగళూరు జట్టుపై ( RCB ) కన్నేసిన హోంబలే ఫిల్మ్స్

Advertisement

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ( Royal Challengers Bengaluru) విక్రయిస్తున్నారన్న వార్త బయటకు రావడంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఇప్పటికీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బెంగళూరు జట్టును ఇలా అమ్మేయడం తమను బాధిస్తోందని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులైతే ఈ అంశాన్ని జీర్ణించుకోవడం లేదు.

అయితే ఇలాంటి నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అదిరిపోయే న్యూస్ వచ్చింది. రాయల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు హోంబలే ఫిల్మ్స్ ( Hombale Films ) సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటకకు చెందిన ఈ హోంబలే ఫిల్మ్స్, సినిమా రంగంలో దూసుకు వెళ్తోంది. ఏది పట్టినా బంగారమవుతోంది. అందుకే తమ సొంత రాష్ట్రం ఐపీఎల్ జట్టును కొనుగోలు చేసేందుకు హోంబలే ఫిల్మ్స్ ఓనర్ విజయ్ కిరగందూర్ ( Vijay Kiragandur )  నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు డియాగో కంపెనీతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్ని ఓకే అయితే, రెండు బిలియన్స్ డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తామని చెబుతోంది.

RCB జట్టు కొనేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలు

Advertisement

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టును విక్రయిస్తున్నారన్న వార్త బయటకు రావడంతో చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. అర డజన్‌కు పైగా కంపెనీలు కాపు కాసుకుని కూర్చున్నాయి. దాదాపు రూ.17, 600 కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ లిస్టులో ఆదార్ పునా వాలా, అంబానీ ఫ్యామిలీ, ఆదానీ గ్రూప్, JSW గ్రూప్ ఇండస్ట్రీస్, రవి జైపురియా లాంటి కంపెనీలు రంగంలో దిగాయి. వీటితోపాటు విదేశాలకు సంబంధించిన రెండు ప్రైవేట్ కంపెనీలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయట. భారతదేశానికి సంబంధించిన కార్పొరేట్ గ్రూప్స్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై కన్ను వేసినట్లు సమాచారం. ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ ( Hombale Films ) రంగంలోకి దిగింది.

 

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు

 

 

Related News

55 ప‌రుగుల‌కే ఆలౌటైనా సిగ్గు రాలేదా? ఫాతిమా స‌నా ఓవ‌రాక్ష‌న్‌పై టీమిండియా క్రికెట‌ర్ సీరియ‌స్

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

సచిన్ వికెట్ తీయాలంటే.. ఆ దేవుడిని పూజించాల్సిందే..బ్రెట్ లీ కామెంట్స్ వైరల్

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

Big Stories

Advertisement
×