Visakhapatnam Drugs: విశాఖ బాగా డెవలప్ అయ్యింది. ఏదీ కావాలన్నా ఈజీగా దొరికేస్తుంది. గంజాయిని చాక్లెట్ల మాదిరి అమ్మేస్తున్నారు. కొకైన్ అయితే కోన్ ఐస్‌క్రీమ్ కొన్నంతా ఈజీ. లిక్విడ్ గంజాయి, ఆయిల్ గంజాయి ఏది కావాలన్నా ఎంత కావాలన్నా ఇట్టే దొరికేస్తుంది. ఒకప్పుడు పీస్ లవ్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన వైజాగ్ ఇప్పుడు డ్రగ్స్ దందా నీడలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇదేదో గాలి వార్త కాదు బ్రదర్. పోలీసుల రికార్డులే అసలు లెక్కలు చెబుతున్నాయి. 2024 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 553 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. వేల కిలోల గంజాయి స్వాధీనం, వందలాదిమంది అరెస్టులు, కోట్ల రూపాయల ఆస్తుల జప్తు.. అయినా ఈ మత్తు దందా ఆగడం లేదు.
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలోనూ గంజాయి గుప్పుమంటోంది. పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లోకి కొకైన్ పొట్లాలు వెళ్తున్నాయి. ఆఖరికి క్యాంపస్‌ను కూడా డ్రగ్ మార్కెట్‌గా మార్చేశారు. 2025లో ముగ్గురిని అరెస్ట్ చేసి 25 గ్రాముల కొకైన్, 3 లక్షల 60 వేల క్యాష్, బైక్, నాలుగు ఫోన్లు, ఓ డైరీని సీజ్ చేశారు. ఆ డైరీలో ఏముంది? ఎవరి పేర్లున్నాయి? అదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్.
Also read: సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేసిన నందమూరి లక్ష్మీపార్వతి.. ఏమన్నారంటే?
ఇక అక్టోబర్ 8న ఈస్ట్ పాయింట్ కాలనీలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని 50 గ్రాముల MDMA, ఒక లీటర్ లిక్విడ్ గంజాయి ఆయిల్‌ను పట్టుకున్నారు. ఈ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరి చేతులు మారింది..? ఎవరికి చేరాల్సి ఉంది..? ఇప్పుడు తేలాల్సిన అసలు ప్రశ్నలివే..!
ఇప్పుడు అసలు లెక్కలు చూడండి.. కళ్లు తిరుగుతాయ్. విశాఖ కమిషనరేట్ పరిధిలో 10వేల కిలోల గంజాయి సీజ్.. ఏడు వందల పైచిలుకు అరెస్టులు.. పదకొండు కోట్ల ఆస్తులు జప్తు.. అయినా సరే.. దందా మాత్రం డబుల్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. 72 ప్రధాన కేసుల్లో 129 మందికి శిక్షలు పడినట్లు ఇచ్చిన వివరాలు చెబుతున్నాయి. ఐనా అదే సీన్.. అదే మత్తు.ఇ క్కడే అసలు ట్విస్ట్ ఉంది. పట్టుబడుతున్నది ఎవరు? అమ్మేవాళ్లు కానీ కొనేవాళ్లు? ఆ నెట్‌వర్క్ వెనుకు ఉన్న పెద్దతలలను మాత్రం పట్టుకోలేకబోతోంది. చెట్టు కొమ్మలు నరికితే సరిపోదు. వేర్లు పీకాలి. మరి ఆ వేర్లు ఎక్కడ? మాఫియా మాస్టర్‌మైండ్ ఎవరు? పోలీసులు ఆ గేట్లు ఎప్పుడు తెరుస్తారు? విశాఖ ఎదురు చూస్తోంది.. సమాధానం కోసం.. మత్తు లేని నగరం కోసం.
Also read: ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్!