E-Paper
Advertisement

OTT Movie : చీరలో చీమ… చివరకు ఊహించని ట్విస్ట్… ఐశ్వర్య రాజేష్ నటించిన లేటెస్ట్ మూవీ

OTT Movie : చీరలో చీమ… చివరకు ఊహించని ట్విస్ట్… ఐశ్వర్య రాజేష్ నటించిన లేటెస్ట్ మూవీ
Advertisement

OTT Movie  : మలయాళం నుంచి వస్తున్న సినిమాలకు ఇప్పుడు క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ సినిమాలపై ఓ లుక్ వేస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఐదు మంది మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. సమాజంలో మహిళలు ఎదుర్కునే సమస్యలను ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు.  ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది. అనే వివరాల్లోకి వెళితే ..

మనోరమమాక్స్ (ManoramaMAX) లో

Advertisement

ఈ మలయాళం మూవీ పేరు ‘హర్’ (Her). 2024 లో వచ్చిన ఈ సినిమాకి లిజిన్ జోస్ దర్శకత్వం వహించారు. ఇందులో ఊర్వశి, పార్వతి తిరువోతు, ఐశ్వర్య రాజేష్, రమ్య నంబీశన్, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ OTT ప్లాట్‌ ఫామ్ మనోరమమాక్స్ ManoramaMAX లో అందుబాటులో ఉంది.

 అనామిక (ఐశ్వర్య రాజేష్)

Advertisement

అనామిక ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం PSC ఇంటర్వ్యూకి సిద్ధమవుతూ ఉంటుంది. ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నించడాన్ని ఆమె ప్రియుడు వ్యతిరేకిస్తాడు. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో, ఆమె ఒక చీమ కాటుకు గురవుతుంది. పబ్లిక్ స్థలంలో రెస్ట్‌రూమ్ దొరక్క ఇబ్బందిపడుతుంది. ఆమె ఒక ఆటో డ్రైవర్ (గురు సోమసుందరం) నుండి వేధింపులను కూడా ఎదుర్కొంటుంది. ఈ సెగ్మెంట్ మహిళలు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే నిరంతర సవాళ్లను చూపిస్తుంది.

రేష్మ (రమ్య నంబీశన్)

రేష్మ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె తన రోజువారీ జీవితాన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా పంచుకుంటుంది. నిజానికి ఆమె చిత్రీకరించే దృశ్యాలు భిన్నంగా ఉంటాయి. ఆమె స్థానిక నటులను ఉపయోగించి ఖర్చులను తగ్గించడం. వ్యక్తిగత లాభం కోసం ఇతరులను ఉపయోగించుకోవడం వంటి వ్యాపార యుక్తులను పాటిస్తుంది. ఈ సెగ్మెంట్ సోషల్ మీడియా యుగంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ద్వంద్వ వైఖరిని  వ్యంగ్యాత్మకంగా చూపిస్తుంది.

సంత (ఊర్వశి) & ప్రతాప్ పోతెన్:

ఇది ఒక వృద్ధ దంపతుల కథను చెప్తుంది. వాళ్ళు తమ రొటీన్‌ లైఫ్ లో సంతోషంగా ఉంటారు. అయితే భర్త ‘అలెక్సా’ వంటి టెక్నాలజీ పట్ల మక్కువ చూపడంతో, వారి సంబంధంలో సమస్యలు తలెత్తుతాయి. ఈ కథ టెక్నాలజీ ప్రభావాన్ని, వృద్ధాప్యంలో శృంగార ప్రాముఖ్యతను భావోద్వేగంగా చూపిస్తుంది. ఊర్వశి, ప్రతాప్ పోతెన్ నటన ఈ సెగ్మెంట్‌ను ఆకట్టుకునేలా చేస్తుంది.

రుచి (పార్వతి తిరువోతు)

రుచి ఒక సీనియర్ ఐటీ ప్రొఫెషనల్. ఆమె సాధారణ మహిళగా కనిపిస్తుంది. కానీ వ్యక్తిగత సమస్యలు, ఆమెను ఒత్తిడికి గురిచేసినప్పుడు, ఆమె తన చుట్టూ ఉన్నవారిపట్ల, ముఖ్యంగా తక్కువ సామాజిక స్థాయి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ సెగ్మెంట్ వృత్తిపరమైన ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యల వల్ల కలిగే ఇబ్బందులను చూపిస్తుంది. .

అభినయ (లిజోమోల్ జోస్)

అభినయ అనే ఇండిపెండెంట్ అమ్మాయి, తన ప్రియుడితో వివాహానికి సిద్ధపడుతుంది. ఈ క్రమంలో స్టోరీ కూడా ఊహించని మలుపు తిరుగుతుంది. ఇలా ఈ ఐదు స్టోరీలతో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Read Also : నోట్లో అరటి పండు పెట్టి చంపే సైకో… అలాంటి వాళ్లే ఈ కిల్లర్ టార్గెట్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×