E-Paper
Advertisement

రాత్రైతే ఊరిని వణికించే గోళ్లు… నవ్వించి చంపే కామెడీ

రాత్రైతే ఊరిని వణికించే గోళ్లు… నవ్వించి చంపే కామెడీ
Advertisement

Horror Comedy OTT : హారర్ కామెడీ జోనర్ లో వస్తున్న సినిమాలను ఇప్పుడు తెగ చూస్తున్నారు ప్రేక్షకులు. తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాలు భారీ హిట్లు కూడా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఒక రాజస్థానీ సినిమా గురించి చెప్పుకోబోతున్నాం. దెయ్యం అంటే ఒణికిపోయే వాళ్ళు కూడా ఈ సినిమా చూసి కడుపుబ్బ నవ్వుకుంటారు. నిజానికి రాజస్థానీ భాషలో హారర్ కామెడీ జోనర్ సినిమాలు చాలా తక్కువ. ఆ లోటును తీరుస్తూ వచ్చిన మొదటి పూర్తిస్థాయి హారర్ కామెడీ చిత్రం ఇది. ఈ సినిమా సుమారు 1 గంట 49 నిమిషాల నిడివితో కుర్చీలకు కట్టి పడేస్తుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

2023లో వచ్చిన ఈ రాజస్థానీ హారర్ కామెడీ సినిమా పేరు ‘నుచ్వానా’ (Nuchwana). ఈ సినిమాకు ధ్రువ్ సంఖ్లా దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆయనే చూశారు. ఇందులో ప్రఫుల్ బోరానా, హర్షాంత్ శర్మ, నేహా ఆస్వానీ, సందీప్ గోయల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను STAGE App లో చూడవచ్చు. ఇది రాజస్థానీతో పాటు గుజరాతీ, భోజ్‌పురి భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథలో ప్రధాన పాత్ర అయిన అంగద్ ఒక ఆర్మీ ఆఫీసర్. చాలా కాలం తర్వాత తన ప్రేయసి దుగ్గుతో నిశ్చితార్థం కోసం ఊరికి వస్తాడు. అతను తన స్నేహితులతో కలిసి సరదాగా సమయం గడుపుతుంటాడు. వీళ్ళకి దెయ్యాలంటే అస్సలు నమ్మకం ఉండదు, పైగా ఆ ఊరిలో ఉండే భయాలను ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ అకస్మాత్తుగా ఊరిలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. ఊరి జనాలంతా భయంతో వణికిపోతుంటే, ఈ కుర్రాళ్ళు మాత్రం దాన్ని లైట్ తీసుకుంటారు. ఈ సినిమాలో దెయ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. దానికి మూడు వేళ్లు, పొడవాటి గోర్లు ఉంటాయి. ఆ దెయ్యం ఎవరి మొహాన్ని అయితే గీరుతుందో, వాళ్ళు నెల రోజుల్లోపే చనిపోతారని ఊరి జనం నమ్ముతారు.

అయితే ఇప్పుడు ఆ దెయ్యం నిజంగానే వీళ్ళ మీద పడుతుంది. వీళ్ళంతా ఆ దెయ్యం చేతికి చిక్కి నానా తిప్పలు పడతారు. దెయ్యం నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు, పడే కష్టాలు చూస్తుంటే భయం కంటే నవ్వే ఎక్కువ వస్తుంది. ఆ దెయ్యం ఎందుకు వచ్చింది? అది వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేసింది? ఆ దెయ్యం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న 26 ఏళ్ల హాలీవుడ్ మూవీ… యాక్టింగ్ ఇరగదీసిన బ్రాడ్ పిట్… ఐయండిబిలో 8.8 రేటింగ్

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×