E-Paper
Advertisement

Horror Movie OTT : పగలు పల్లెటూరి పిల్ల… రాత్రి గాలిలో తేలే తల… విజువల్స్ తో వణుకు పుట్టించే సినిమా

Horror Movie OTT : పగలు పల్లెటూరి పిల్ల… రాత్రి గాలిలో తేలే తల… విజువల్స్ తో వణుకు పుట్టించే సినిమా
Advertisement

Horror Movie OTT :ఓటీటీలో ఒక థాయ్ మూవీ డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ను విశేషంగా అక్కట్టుకుంది. ఇందులో విజువల్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తోనే మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమా థాయ్‌లాండ్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ‘క్రాసూ’ అనే పురాణ గాథ ఆధారంగా తీశారు. రాత్రిపూట తల, ప్రేగులతో తిరిగే ఈ దెయ్యం కథలు అక్కడ చాలా ఫేమస్. ఈ సినిమాలో ఆ పాత కథకు ఒక అందమైన ప్రేమకథను కూడా జోడించారు. ఇది 92వ ఆస్కార్ అవార్డులకు థాయ్‌లాండ్ తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది కూడా. 1940ల కాలం నాటి పల్లెటూరి వాతావరణాన్ని, అడవులను చాలా నేచురల్‌గా చూపించారు ఇందులో. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్ అయింది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

థాయ్ సూపర్ నేచురల్ రొమాంటిక్ హారర్ మూవీ పేరు ‘ఇన్ హ్యూమన్ కిస్’ (Inhuman Kiss). ఇందులో ఫంతిరా పిపిట్యకోర్న్ (సాయి), ఓబ్నితి వివతనవరంగ్ (నోయి) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ ఫంతిరా పిపిట్యకోర్న్ (సాయి) తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా దెయ్యంగా మారినప్పుడు ఆమె కళ్లలో కనిపించే బాధ, భయం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. ఈ సినిమా హిట్ అవ్వడంతో, 2023లో దీనికి రెండో భాగం కూడా వచ్చింది. అది మొదటి పార్ట్ కంటే కొన్ని ఏళ్ల తర్వాత జరిగే కథతో సాగుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా కథ 1940ల కాలంలో థాయ్‌లాండ్‌లోని ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. అక్కడ ఒక పల్లెటూరిలో సాయి అనే ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఒక రోజు ఆ అమ్మాయికి తెలియకుండానే ఒక వింత శాపం తగులుతుంది. పగలు అందరిలాగే మామూలుగా ఉండే సాయి, రాత్రి అయ్యేసరికి మనిషిలా ఉండదు. ఆమె తల మొండెం నుంచి విడిపోయి, కేవలం ఊపిరితిత్తులు, ప్రేగులతో గాలిలో ఎగురుతూ రక్తం కోసం వేటాడుతుంది. ఊరిలో పశువులన్నీ వింతగా చనిపోతుంటే, ఏదో రాక్షసి తిరుగుతుందని ఊరి జనం అంతా కర్రలు, కత్తులు పట్టుకుని వేట మొదలుపెడతారు. అయితే సాయిని ప్రాణంగా ప్రేమించే ఆమె చిన్ననాటి స్నేహితుడు నోయికి ఈ విషయం తెలిసిపోతుంది.

తన ప్రేయసి రాక్షసి అని తెలిసినా సరే, ఆమెను వదులుకోలేక రాత్రిపూట ఆమె ఆకలి తీర్చడానికి జంతువుల రక్తాన్ని తెచ్చి ఇస్తుంటాడు. ఎలాగైనా ఆమెను ఆ శాపం నుండి కాపాడాలని చూస్తుంటాడు. అదే సమయంలో సాయిని ఇష్టపడే మరో స్నేహితుడు జెర్డ్, ఊరి వాళ్లతో కలిసి ఆ రాక్షసిని చంపాలని తిరుగుతుంటాడు. కానీ చివరికి తనకి ఇష్టమైన సాయే ఆ రాక్షసి అని తెలిసి జెర్డ్ కూడా షాక్ అవుతాడు. ఇక క్లైమాక్స్‌లో ఊరి జనం సాయిని పట్టుకోవడానికి చుట్టుముట్టేస్తారు. చివరికి సాయి పరిస్థితి ఏమైంది? ఆమె ప్రాణాలతో మిగిలిందా ? స్నేహితులు ఆమెను కాపాడతారా ? అనే విషయాలను ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : సినిమా అంటే ఇదే మావా… ప్రేమించినందుకు 14 ఏళ్ళ జైలు… కట్ చేస్తే ఎన్నడూ చూడని రివేంజ్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×