E-Paper
Advertisement

క్రిప్టోతో కోటీశ్వరుడు అవ్వాలనుకుంటే ఊహించని చిక్కులు… దిమాక్ కరాబ్ ట్విస్టులున్న కొరియన్ థ్రిల్లర్ తెలుగులోనే

క్రిప్టోతో కోటీశ్వరుడు అవ్వాలనుకుంటే ఊహించని చిక్కులు… దిమాక్ కరాబ్ ట్విస్టులున్న కొరియన్ థ్రిల్లర్ తెలుగులోనే
Advertisement

Korean Crime Thriller: క్రిప్టో కరెన్సీతో ఒక్కసారిగా కోటీశ్వరుడు కావాలనే ఆశ. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడికి ఈ కల మొదట అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ వ్యవస్థలో ఉన్న చిన్నచిన్న లోపాలను ఉపయోగించుకోవడం నేర్చుకున్న తర్వాత అతని ఎదుగుదల వేగంగా సాగుతుంది. నకిలీ పత్రాల నుంచి ప్రభుత్వ సబ్సిడీల వరకు ఒక్కో అడుగు వేస్తూ, చివరకు తన సొంత క్రిప్టో కాయిన్‌ ను సృష్టిస్తాడు. డబ్బు, పేరు, అధికారం అన్నీ వస్తాయి. కానీ అదే సమయంలో అతను నిర్మించిన సామ్రాజ్యం కూలిపోవడం మొదలవుతుంది. ఇదే కథతో తెరకెక్కిన కొరియన్ సినిమా ‘క్రిప్టో మ్యాన్’ (Crypto Man). మరి క్రేజీ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడవచ్చు ? తెలుగు ఆడియో అందుబాటులో ఉందా ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

దో-హ్యూన్ తల్లి చాటున పెరిగిన యువకుడు. తల్లికి అతనిపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సాధారణ జీవితంతో సంతృప్తి చెందని అతను త్వరగా డబ్బు సంపాదించాలని చూస్తుంటాడు. సమాజంలో కొంతమంది ఉపయోగించుకునే అవకాశాలను గమనిస్తూ, చట్టంలోని లొసుగులను తన ప్రయోజనానికి మార్చుకోవచ్చని తెలుసుకుంటాడు. మొదట నకిలీ పత్రాలు, ప్రభుత్వ సబ్సిడీలను ఉపయోగించుకోవడం వంటి చిన్న మోసాలతో మొదలు పెడతాడు. ప్రతి సారి డబ్బు రావడంతో అతనిలో ధైర్యం పెరుగుతుంది.

Advertisement

తాను చేస్తున్నది తప్పు అని తెలిసినా, సిస్టమ్‌ ను మోసం చేయగలిగితేనే తాను తెలివైనవాడిననే భావన అతనిలో బలపడుతుంది. క్రమంగా దో-హ్యూన్ క్రిప్టో కరెన్సీ ప్రపంచంలోకి అడుగు పెడతాడు. మార్కెట్‌ లో కొత్తగా వస్తున్న డిజిటల్ కరెన్సీలపై ఉన్న ఆసక్తిని గమనించి, తాను కూడా ఓ కాయిన్‌ ను రూపొందించాలని నిర్ణయించుకుంటాడు. అలా ‘మమ్మీ కాయిన్’ పేరుతో తన సొంత క్రిప్టో ప్రాజెక్ట్‌ ను ప్రారంభిస్తాడు. మొదట ఆ కాయిన్ విలువ పెరగడం మొదలవుతుంది. సోషల్ మీడియాలో దాని గురించి ప్రచారం పెరుగుతుంది. పెట్టుబడిదారులు చేరుతారు.

దో-హ్యూన్ ఒక్కసారిగా సాధారణ యువకుడి నుంచి క్రిప్టో సెలబ్రిటీగా మారిపోతాడు. కానీ వేగంగా పెరిగిన సామ్రాజ్యానికి అదే వేగంతో సమస్యలు కూడా వస్తాయి. అతను ఉపయోగించిన పద్ధతులు, నకిలీ పత్రాలు, ప్రభుత్వ వ్యవస్థను మోసం చేసిన విధానం ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలవుతుంది. తనపై నమ్మకం పెట్టుకున్న పెట్టుబడిదారుల ఒత్తిడి పెరుగుతుంది. క్రిప్టో విలువ పడిపోతే అతని పేరు, సంపద, భవిష్యత్తు అన్నీ ప్రమాదంలో పడతాయి. తాను నిర్మించుకున్న సామ్రాజ్యం నిజంగా తన తెలివితేటల ఫలితమా ? లేక మోసాల మీద నిలబెట్టిన కోటా ? క్లైమాక్స్ లో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది ? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

డేనియల్ జోయి అల్బ్రైట్ (Daniel Joey Albright), జంగ్ వోన్-చా (Jung Won Cha), సో హీ-జంగ్ (So Hee-jung), సాంగ్ జే-రిమ్ (Song Jae-rim) ఇందులో మెయిన్ లీడ్స్ గా నటించారు. ‘క్రిప్టో మ్యాన్’కు హ్యారీ హ్యున్ (Harry Hyun) దర్శకత్వం వహించారు. Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తమిళం, తెలుగు, కొరియన్ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి.

Read Also: కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

Related News

ఇల్లరికం అల్లుడి కష్టాలు… కూతురిని ముట్టుకొనివ్వని పట్టుకొనివ్వని తల్లి దెయ్యం… మస్ట్ వాచ్ మలయాళం మూవీ

స్కూల్లో స్టూడెంట్ రౌడీ వేషాలు… టీచర్ ఇచ్చే ట్విస్టుకు పట్టపగలే చుక్కలు… కొరియన్ టీచరా మజాకా

కోడి చుట్టూ తిరిగే కథ… చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించడం కష్టం… తెలుగులోనే స్ట్రీమింగ్

‘కాఫీవిత్ కరణ్’ షోకు ఎండ్ కార్డ్… కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్!

తండ్రిపై కోపంతో రింగ్‌లోకి దిగిన కుర్రాడు… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్

ఒకే కుటుంబంలో వరుస హత్యలు… కోట్ల ఆస్తి కోసం భయంకరమైన కుట్ర… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

నిజ జీవిత పోరాటానికి జాతీయ అవార్డు… 13 ఏళ్లుగా ఓటీటీ కోసం ఎదురుచూసిన మూవీకి మోక్షం… 8.2 రేటింగ్‌తో ఇప్పుడు స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×