E-Paper
Advertisement

విజిల్ ఊదితే వెంటాడే ఆత్మ… చావు ఎలా ఉంటుందో చూపించే మైండ్ బ్లోయింగ్ హారర్

విజిల్ ఊదితే వెంటాడే ఆత్మ… చావు ఎలా ఉంటుందో చూపించే మైండ్ బ్లోయింగ్ హారర్
Advertisement

Horror Thriller OTT : దెయ్యాల కథలతో వచ్చే సినిమాలు, ఈ మథ్య ప్రేక్షకులను బాగా భయపెడుతున్నాయి. రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఒక దెయ్యం సినిమాకు పాజిటివ్ రేటింగ్స్ వచ్చాయి. ఈ సినిమాను సింపుల్‌గా చెప్పాలంటే, ఇది దెయ్యం, చేతబడి లాంటి అదృశ్య శక్తితో సాగే కథ. ముఖ్యంగా ఇది ‘ఫైనల్ డెస్టినేషన్’, ‘ఇట్ ఫాలోస్’ వంటి సినిమాల స్టైల్‌లో ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో ఒక శాపం వల్ల వరుసగా మరణాలు సంభవిస్తాయి. ఇందులో కూడా ‘విజిల్’ ఊదిన ప్రతి ఒక్కరినీ ఒక వింత రూపం వెంటాడి మరీ చంపుతుంటుంది. ఇది పక్కాగా హారర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి నచ్చుతుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ సూపర్‌నేచురల్ హారర్ సినిమా పేరు ‘విజిల్’ (Whistle). హారర్ సినిమాల్లో టాప్ డైరెక్టర్ అయిన కోరిన్ హార్డీ, ఈ సినిమాను సుమారు 16 కోట్ల తక్కువ బడ్జెట్‌తో కెనడాలోని హామిల్టన్ ప్రాంతంలో షూట్ చేశారు. ఈ సినిమాలో వెన్నులో వణుకు పుట్టేలా సౌండ్ డిజైన్ చేశారు. కేవలం భయపెట్టడమే కాకుండా, 90ల నాటి స్లాషర్ సినిమాలను ఇది గుర్తుకు తెస్తుంది. ‘లోగాన్’ సినిమాతో ఫేమస్ అయిన డాఫ్నే కీన్, సోఫీ నెలిస్సే ఈ సినిమాలో తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇది గతేడాది ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో ప్రదర్శించినప్పుడు విమర్శకులు దీనికి మంచి రివ్యూలే ఇచ్చారు. ఆ తరువాత 2026 ఫిబ్రవరి 6న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఇది ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కొంత మంది కాలేజీ కుర్రాళ్లకు అనుకోకుండా ఒక పురాతనమైన వింత విజిల్ దొరుకుతుంది. అది మామూలు విజిల్ అనుకుని సరదాగా ఊదుతారు. కానీ వాళ్లకి తెలీని విషయం ఏంటంటే, అది శపించబడిన విజిల్. దాన్ని ఒక్కసారి ఊదితే చాలు.. చావును మనమే స్వయంగా ఇంటికి పిలిచినట్టు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆ విజిల్ ఊదినప్పటి నుంచి ఆ కుర్రాళ్లకి పిచ్చిపిచ్చి శబ్దాలు వినిపించడం, వింత ఆకారాలు కనిపించడం మొదలవుతాయి. ఆ విజిల్ నుంచి ఒక భయంకరమైన దెయ్యం లాంటి శక్తి బయటకు వచ్చి, ఒక్కొక్కరిని వేటాడటం స్టార్ట్ చేస్తుంది. చిత్రం ఏంటంటే, ఆ శక్తి వాళ్లు ఫ్యూచర్‌లో ఎలా చచ్చిపోతారో సరిగ్గా అలాగే చంపడానికి ప్లాన్ చేస్తుంది. తప్పించుకుందామన్నా ఆ దెయ్యం వాళ్లని వదలదు. తమ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వింతగా చనిపోతుంటే, మిగిలిన వాళ్ళు భయపడిపోయి ఆ విజిల్ శాపం నుంచి ఎలా బయటపడాలా అని తిప్పలు పడతారు. ఆ విజిల్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఆ చావు వేట నుంచి వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా ? అన్నదే ఈ సినిమా క్లైమాక్స్. గగుర్పు పుట్టించే సౌండ్ ఎఫెక్ట్స్, షాకింగ్ సీన్లతో సినిమా మొత్తం హారర్‌గా సాగుతుంది.

Read Also : కోట్లు కొల్లగొట్టే ప్లాన్.. నవ్విస్తూనే గజగజ వణికించే యాక్షన్… మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×