E-Paper
Advertisement

హారర్ సినిమాల పిచ్చి ఉన్న అమ్మాయినే టార్గెట్ చేసిన మాస్క్ కిల్లర్… హాలోవీన్ రాత్రి నరమేధం

హారర్ సినిమాల పిచ్చి ఉన్న అమ్మాయినే టార్గెట్ చేసిన మాస్క్ కిల్లర్… హాలోవీన్ రాత్రి నరమేధం
Advertisement

Horror Thriller Movie on OTT: హారర్ సినిమాల్లో హీరోలు కిల్లర్ నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్లాన్స్ వేస్తుంటారు. కానీ వాళ్లు చూసిన సినిమాలనే ఆయుధంగా చేసుకుని ఓ కిల్లర్ వెంటపడితే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇదే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘ది బాయ్ ఫ్రమ్ బిలో’ (The Boy from Below Movie 2026) ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చేసింది. మరి హర్రర్ మూవీ లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

1997లో స్టోరీ సాగుతుంది. హాలోవీన్ రాత్రి కార్పెంటర్ ఫాల్స్ అనే చిన్న పట్టణంలో కథ మొదలవుతుంది. క్విన్ కర్టిస్ అనే అమ్మాయి స్థానిక వీడియో స్టోర్‌లో పని చేస్తుంటుంది. ఆమెకు హారర్ సినిమాలంటే విపరీతమైన ఇష్టం. హాలోవీన్ సందర్భంగా హారర్ మూవీ మారథాన్‌తో సరదాగా గడపాలని క్విన్, ఆమె స్నేహితులు ప్లాన్ చేసుకుంటారు. కానీ ఆ రాత్రి వారి జీవితాల్లోకి ఊహించని ప్రమాదం వస్తుంది.

Advertisement

‘ది బాయ్ ఫ్రమ్ బిలో’గా పిలవబడే ఓ మాస్క్ ధరించిన సైకో కిల్లర్ ఆ పట్టణంలోకి వస్తాడు. అతనికి సాధారణ హత్యలతో సరిపెట్టుకోవాలనే ఉద్దేశం ఉండదు. హారర్ సినిమాలపై ఉన్న తన మోజును నిజ జీవితంలోకి తీసుకురావాలనుకుంటాడు. క్లాసిక్ స్లాషర్ సినిమాల్లో కనిపించే పరిస్థితులను, హత్యల తరహాలను తనదైన రీతిలో పునరావృతం చేస్తూ క్విన్, ఆమె స్నేహితులను టార్గెట్ చేయడం మొదలుపెడతాడు.

ఇక్కడే క్విన్‌కు ఉన్న హారర్ సినిమాల పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. కిల్లర్ ఎలా ఆలోచిస్తాడో, తర్వాత ఏం చేయవచ్చో ఆమెకు కొంతవరకు అర్థమవుతుంది. కానీ కళ్లముందు జరుగుతున్నది సినిమా కాదు, నిజమైన ప్రాణాపాయం. తన స్నేహితులు ఒక్కొక్కరుగా ప్రమాదంలో పడుతున్న సమయంలో క్విన్ తనకు తెలిసిన హారర్ మూవీ రూల్స్‌ను ఉపయోగించి కిల్లర్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ కిల్లర్ అసలు ఎవరు? కార్పెంటర్ ఫాల్స్‌కి అతనికి ఉన్న సంబంధం ఏమిటి? హారర్ సినిమాలపై అతనికి ఇంత మోజు ఎందుకు? క్విన్‌కు, ఆమె స్నేహితులకు అతడు ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?

Advertisement

ఈ సినిమాలో స్పూకీ మాడిసన్ క్విన్ కర్టిస్‌గా, జాక్ నార్మన్ ‘ది బాయ్’గా నటించారు. డీ వాలెస్, లేహ్ వోయ్సీ, ఫెలిస్సా రోజ్, చానీ మోరో వంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. మూవీ మరో ప్రత్యేకత 90ల హారర్ వాతావరణం. వీడియో స్టోర్లు, హాలోవీన్ నేపథ్యం, మాస్క్ ధరించిన కిల్లర్, హారర్ సినిమాలను ఇష్టపడే టీనేజ్ క్యారెక్టర్స్‌తో పాత స్లాషర్ మూవీ ఫీల్ వచ్చేలా రూపొందించారు. దర్శకుడు టోరీ జోన్స్ కూడా ఈ చిత్రాన్ని 90ల కాలం, వీడియో స్టోర్ సంస్కృతి, స్లాషర్ సినిమాలపై తనకున్న ప్రేమకు ఒక హోమేజ్‌గా రూపొందించినట్లు ప్రచారంలో పేర్కొన్నారు.

మొత్తంగా చూస్తే ‘స్క్రీమ్’, ‘హాలోవీన్’ తరహా పాతకాలపు స్లాషర్ సినిమాల వాతావరణాన్ని ఇష్టపడేవారికి ‘ది బాయ్ ఫ్రమ్ బిలో’ ఒక డిఫరెంట్ హారర్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు. సినిమా నిడివి సుమారు 1 గంట 37 నిమిషాలు. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్‌లో రెంట్ కి అందుబాటులో ఉంది. టోరీ జోన్స్ దర్శకత్వం వహించిన ఈ ఇండిపెండెంట్ హారర్ థ్రిల్లర్ ఆగస్టు 11 నుంచి డిజిటల్ గా అందుబాటులోకి వచ్చింది. Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: తలుపులు తెరవలేరు… బయట అడుగుపెడితే బతకలేరు… తెలుగులోనే ఈ సై-ఫై సర్వైవల్ థ్రిల్లర్

Related News

చైనీస్ కుంగ్ ఫూను అంతం చేయాలని చూసిన విలన్లకు దిమ్మతిరిగే షాక్… చివర్లో హై-వోల్టేజ్ ఫైట్

రొనాల్డోతో బంధం నుంచి ఫెర్గూసన్ ఆఫర్ వరకు… మౌరిన్హో సీక్రెట్స్ బయటపెట్టిన డాక్యుమెంటరీ

రాత్రిపూట అలాంటి శబ్దాలు… అదేంటని అడిగితే డిన్నర్ కి పిలిచి బంపర్ ఆఫర్

వెకేషన్‌లో ప్రియుడు మిస్సింగ్… వెతుకుతూ వెళ్తే అతడి అసలు బండారం బట్టబయలు

టీన్ గ్యాంగ్‌లోకి కొత్త కుర్రాడు… అతని చుట్టూనే వరుస హత్యల మిస్టరీ

రోడ్డు పేరుతో రైతుల భూములు కొట్టేయాలని ప్లాన్… మహిళ తిరుగుబాటుతో మొత్తం సిస్టమ్ షేక్

రియల్టర్‌గా మారిన మాజీ హిట్‌మ్యాన్.. ఒక్క ఎర్ర కవర్‌తో మళ్లీ మొదలైన నరహంతకుల వేట

Big Stories

Advertisement
×