E-Paper
Advertisement

ఆన్‌లైన్‌లో అప్లై చేసినా ఆఫీసుకు వెళ్లాల్సిందేనా? RTOలో అసలేం జరుగుతోంది!

ఆన్‌లైన్‌లో అప్లై చేసినా ఆఫీసుకు వెళ్లాల్సిందేనా? RTOలో అసలేం జరుగుతోంది!
Advertisement

Online Vehicle Transfer: స్వేచ్ఛ బ్యూరో: రవాణా శాఖను సేవారంగంలో డిజిటల్ శిఖరాన నిలబెడతామని, దళారీల ప్రమేయం లేని పారదర్శక పాలన అందిస్తామని అధికారులు పదేపదే చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వాహనాల కొనుగోలు, అమ్మకాలు, యాజమాన్య హక్కుల మార్పిడి (ట్రాన్స్‌ఫర్) సేవలను సులభతరం చేసేందుకు తీసుకొచ్చిన ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ విధానం సిబ్బంది ఉదాసీనత, కొందరి స్వార్థ ప్రయోజనాల వల్ల ఆశించిన లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది. సేవలు ఆన్‌లైన్ మోడ్‌లోకి మారినా.. దరఖాస్తుల ఆమోదం మాత్రం ‘మినిస్టీరియల్’ సిబ్బంది చేతుల్లోనే ఉండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

పేరుకే ఆన్‌లైన్.. తీరు మాత్రం పాతదే!

Advertisement

వాహనదారుడు ఆఫీసుకు రానవసరం లేకుండానే ఓటీపీ ఆధారంగా ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం ‘ఆధార్ ఆథెంటికేషన్’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అమ్మకందారు, కొనుగోలుదారు తమ వివరాలను నమోదు చేసి, ఆన్‌లైన్ లో ఫీజు చెల్లిస్తే ప్రక్రియ వేగంగా పూర్తవ్వాలి. కానీ, ఆన్‌లైన్ లో అందిన దరఖాస్తులను పరిశీలించాల్సిన మినిస్టీరియల్ స్టాఫ్ రకరకాల సాకులు చూపుతూ దరఖాస్తులను పక్కన పడేస్తున్నట్లు సమాచారం. సాంకేతిక లోపాలున్నాయని, ఆప్రాప్‌రియెట్ డాక్యుమెంట్లు లేవని నెపం నెడుతూ అప్లికేషన్లను ‘రిజెక్ట్’ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు రోజులు గడుస్తున్నా దరఖాస్తులను ‘పెండింగ్’లోనే ఉంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

చేతివాటానికి చెల్లుబాటు కాదనేనా?

Advertisement

అంతా పారదర్శకంగా, డిజిటల్ రూపంలో జరిగిపోతే తమ ‘చేతివాటానికి’ బ్రేక్ పడుతుందన్న ఉద్దేశంతోనే కొందరు సిబ్బంది ఈ కొత్త సంస్కరణలకు మోకాలడ్డుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నేరుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి రోజులు గడుస్తున్నా అప్రూవల్ చేయకుండా చుక్కలు చూపిస్తున్న కొందరు మినిస్టీరియల్ సిబ్బంది… ఏజెంట్లు లేదా దళారుల ద్వారా వచ్చే ఫైళ్లకు మాత్రం ఎలాంటి సాకులు చెప్పకుండా ఆమోదముద్ర వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

తీవ్ర అసహనంలో వాహనదారులు

ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంట్లోనే పనులు పూర్తవుతాయని భావించిన సామాన్యులకు నిరాశే మిగులుతోంది. ఆన్‌లైన్ లో నమోదు చేసి, రుసుములు చెల్లించినప్పటికీ దరఖాస్తులు ముందుకు కదలకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో వాహనదారులు సెలవులు పెట్టి మరీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోందని సమాచారం. ఆధార్ ఆధారిత విధానంలోనూ పనులు కాకపోతే ఇక డిజిటల్ సేవల వల్ల ఉపయోగం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఆన్‌లైన్ సేవలను నిర్వీర్యం చేస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, డిజిటల్ వ్యవస్థలు సజావుగా పనిచేసేలా పర్యవేక్షణ పెంచాలని పలువురు కోరుతున్నారు. ఆదిశగా అధికారులు చర్యలు తీసుకుంటారా? చూసిచూడనట్లు వ్యవహరిస్తారా? అనేది ఆసక్తి నెలకొంది.

Also Read: కేపీహెచ్‌బీలో ఇందిరమ్మ టవర్స్‌కు రేపే శంకుస్థాపన.. డిఫాల్ట్ మిల్లర్లపై సీఎం రేవంత్ ఫైర్!

Tags

Related News

కేపీహెచ్‌బీలో ఇందిరమ్మ టవర్స్‌కు రేపే శంకుస్థాపన.. డిఫాల్ట్ మిల్లర్లపై సీఎం రేవంత్ ఫైర్!

కొంపల్లిలో పేకాట స్థావరంపై SOT దాడి.. మాజీ చైర్మన్‌తో సహా 8 మంది అరెస్ట్!

దేవరయాంజాల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 6 గంటలుగా ఎగిసిపడుతున్న మంటలు, కోట్ల ఆస్తి నష్టం!

పింఛన్‌దారులకు శుభవార్త! పాత నిబంధనలతోనే కొత్త పింఛన్లు..

హైటెక్ సిటీలో భారీ మాల్.. షాపింగ్, థియేటర్లు, రెస్టారెంట్లు అన్నీ ఒకే చోట.. సరికొత్త వీకెండ్ డెస్టినేషన్!

ఎల్బీ‌నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. అసలే ఏం జరిగింది? కుటుంబసభ్యుల ఆందోళన

నియోపోలిస్ ప్లాట్ 17 మళ్ళీ వేలం, చేతులెత్తేసిన వజ్ర కన్స్ట్రక్షన్స్, అప్పట్లో ఎకరా రూ.136 కోట్లకు కొనుగోలు

Big Stories

Advertisement
×