Brahmamudi serial today Episode: ఇంద్రాదేవి, అపర్ణ వచ్చి కావ్యను తిట్టి నువ్వ ఎలాగూ మారవు మా మనవడి సైడు నుంచి నరుక్కొస్తామని ఇంద్రాదేవి అపర్ణను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ కూడా ఈ ఓల్డ్ పీపుల్స్‌ను నమ్ముకుని లాభం లేదు. కళావతి గారిని ఇంప్రెస్ చేయడానికి మనమే యూత్ ఫుల్‌గా ఆలోచించాలి అని మనసులో అనుకుంటూ అటూ ఇటూ చూస్తుంటే.. కళ్యాణ్ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. తమ్ముడేంటి తాచు పాములా మెలికలు తిరుగుతున్నాడు. అవును తమ్ముడు మంచి కవి కదా తమ్ముడితో మంచి కవిత్వం రాయించుకుని కళావతి గారికి వినిపించి ఇంప్రెస్ చేయోచ్చు అని కళ్యాణ్ దగ్గరకు వెళ్తాడు. కళ్యాణ్ ఫోన్‌లో అప్పుతో మాట్లాడుతుంటాడు.
అబ్బో పెళ్లాంతో పులిహోర కలుపుతున్నాడా.? అయినా వీళ్లిద్దరికీ పెళ్లి అయింది కదా ఇలా మాట్లాడుకోవడం ఏంటి అని కళ్యాణ్ నువ్వు తర్వాత మాట్లాడుకోవచ్చు.. ఒక ఇంపార్టెంట్ పని ఉంది అని రాజ్ చెప్పగానే ఆగు అన్నయ్యా ఇక్కడ అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది అంటాడు కళ్యాణ్. దీంతో రాజ్ నీ పొట్టిదే కదా తర్వాత మాట్లాడుకోవచ్చు కదా అంటే.. తర్వాత అంటే అది తప్పించుకుంటుంది అన్నయ్యా నువ్వు కాస్త సైలెంట్‌గా ఉండు అంటూ ఇదిగో పొట్టి నువ్వు వస్తున్నావా..? లేదా..? అని అప్పును అడుగుతాడు. నేను పని మీద వెళ్తున్నాను అని అప్పు చెప్పగానే.. అయితే ముద్దు అయినా పెట్టు అని కళ్యాణ్ అడగ్గానే.. అప్పు కారు పక్కకు ఆపుకుని ముద్దు ఇవ్వబోతుంటే.. రాజ్ ఫోన్ లాక్కుంటాడు. కళ్యాణ్ ఏయ్ అన్నయ్యా ఎమైంది అంటాడు.
కుళ్లురా నాకు కుళ్లు నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు అని చెప్పగానే కళ్యాణ్ షాక్ అవుతాడు. ఎందుకు కుళ్లు అన్నయ్యా అనగానే.. కావ్యతో జరిగింది చెప్తాడు. దీంతో కళ్యాణ్ నాన్నమ్మ మాటలు నమ్మి వదినను డిస్టర్బ్ చేస్తావా..? అనగానే అందుకే ముందు నువ్వు వచ్చి నాకో లెటర్ రాయి.. ఇంకోసారి మీ వదిన విషయంలో తప్పు చేయాలనుకోవడం లేదు. అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను.. అంటాడు రాజ్. కళ్యాణ్ సరే అంటాడు. కళ్యాణ్ పేపర్ తీసుకుని రాస్తుంటే.. రాజ్ తన మనసులో మాటలు చెప్తుంటాడు. రాసేది అయిపోయాక లెటర్ రాజ్‌కు ఇస్తూ ఇది నేరుగా వదినకు ఇస్తూ తననే అడుగు అని చెప్తాడు కళ్యాణ్. ఇంప్రెస్ అవుతుందంటావా..? అని రాజ్ అడగ్గానే.. షాక్ అయితే అవుతుంది. అని కళ్యాణ్ చెప్తాడు. అంటే లెటర్ బాగా లేదు అంటావా..? అని రాజ్ అడగ్గానే.. కంటెంట్ ఎలా ఉంటే ఏంటి అన్నయ్యా..? నీ ఫీలింగ్స్ చెప్పావుగా అది చాలులే.. వెళ్లి సిన్సియర్‌గా ట్రై చేయ్ తప్పకుండా ఒప్పుకుంటుంది అని చెప్పగానే.. రాజ్ వెళ్లిపోతాడు. అందులో నువ్వు ఏం రాస్తే ఏంటన్నయ్యా నువ్వే జీవితం అనుకుని బతుకుతుంది మా వదిన అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్.
రాజ్ లోపలికి వెళ్లగానే.. హాల్లో రుద్రాణి ఎలాగైనా సరే ఇవాళ ఇంట్లో వరుసల గురించి రాజ్‌కు చెప్తాలి అనుకుంటుంది. ఇంతలో రాజ్ రాగానే అడ్డుగా నిలబడుతుంది. ఏంటి దాచిపెడుతున్నావు అని రాజ్‌ను అడుగుతుంది. దాచాల్సింది కాబట్టి.. అని రాజ్ చెప్పగానే.. అదే ఏంటి అని అడుగుతున్నాను అంటుంది రుద్రాణి.. ఇప్పుడు చూడకూడదని దాచిపెట్టానంటే దాని అర్థం ఏంటి..? అని రాజ్ అడగ్గానే.. నేను చూడకూడదని అంటుంది రుద్రాణి.. మరి మీరు చూడకూడనిది ఏముంటే మీకు ఎందుకండి.. అయినా మీరు ఎందుకు అడ్డు నిలబడ్డారో తెలియడం లేదు అని రాజ్ అడగ్గానే.. నీ గురించి ఒక సీక్రెట్ విషయం చెప్పాలి అంటుంది. నేను కూడా కళావతి గారి గురించి ఒక విషయం తెలసుకోవాలి అని చెప్తాడు. దీంతో రుద్రాణి నేను కూడా కళావతి గురించే చెప్పాలనుకుంటున్నాను అనగానే రాజ్ అవునా.. అంటూ కన్పీజ్ చేసి పైకి వెళ్లిపోతాడు. ఇంతలో స్వప్న వచ్చి రుద్రాణిని తిడుతుంది. ఉదయం నుంచి నీ సుపుత్రుడు కనిపించడం లేదు ఎక్కడికి పంపించావు అని అడుగుతుంది. వాడు ఎక్కడికి వెళ్లాడో నాకేం తెలుసు అంటుంది రుద్రాణి. కట్ చేస్తే.. రాహుల్ ఒక అమ్మాయి దగ్గర డాన్స్ చేస్తూ ఉంటాడు. మరోవైపు రాజ్, కావ్య దగ్గరకు వెళ్లి తను రాయించుకుని వచ్చిన లెటర్ ఇస్తాడు. లెటర్ తీసుకుని కావ్య చదివి షాక్ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?