OTT Movie : ఈ సైకో కిల్లర్ సినిమాలు చూడటానికి భయంకరంగా అనిపిస్తాయి. ఈ సైకోలు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పుడుమనం చెప్పుకోబోయే సినిమాలో ఒక సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తుంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయడంతో, ఈ స్టోరీ మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్ ఫ్లిక్స్(Netflix)లో
ఈ తమిళ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఇరైవన్’ (Iraivan). 2023 లో విడుదలైన ఈ సినిమాకి అహ్మద్ దర్శకత్వంవహించారు. సుధన్ సుందరం, జయరాం లు పాషన్ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించారు. ఇందులో జయం రవి (అర్జున్), నయనతార (ప్రియా), రాహుల్ బోస్ (బ్రహ్మా), నరైన్ (ఆండ్రూ), మరియు వినోత్ కిషన్ (బాబు) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఒక సైకోపాత్ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. నెట్ ఫ్లిక్స్(Netflix)లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
చెన్నై నగరం, ఒక సైకోపాత్ సీరియల్ కిల్లర్ భయంతో వణికిపోతోంది. అతను అమ్మాయిలను కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేసి, వారి శరీరాలపై “స్మైలీ ఫేస్” చెక్కుతాడు. ఈ కిల్లర్‌ను “స్మైలీ కిల్లర్” గా పిలుస్తారు. అర్జున్ అనే ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈ కేసును హాండిల్ చేస్తాడు. అతను నేరస్థులను అరెస్ట్ చేయడానికి బదులు ఎన్‌కౌంటర్‌ల ద్వారా న్యాయం చేస్తుంటాడు. అతని స్నేహితుడు ఆండ్రూ,అతనిని తన ఆవేశాన్ని అదుపులో ఉంచమని హెచ్చరిస్తుంటాడు. కానీ అతని మాటలను పెద్దగా పట్టించుకొడు. అర్జున్,ఆండ్రూ సోదరి ప్రియా (నయనతార)తో ప్రేమలో ఉంటాడు. కానీ తన వృత్తిలో శత్రువుల కారణంగా, ఆమెను వివాహం చేసుకోవడానికి ఆలోచిస్తుంటాడు. ఆండ్రూ తన భార్య జాస్మిన్ (విజయలక్ష్మి) కుమార్తె సోఫీతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అర్జున్, ఆండ్రూ ఈ సీరియల్ కిల్లర్ కేసును ఛేదించడానికి కలిసి పనిచేస్తారు. వారు కిల్లర్‌ను బ్రహ్మా (రాహుల్ బోస్)గా గుర్తిస్తారు. అతను తనను తాను “గాడ్”గా భావిస్తూ, హత్యలను ఒక దైవిక చర్యగా చూస్తాడు.
బ్రహ్మా తన బాధితులను ఎంచుకోవడంలో, హత్యలను అమలు చేయడంలో తెలివిగా వ్యవహరిస్తుంటాడు. చాలా నెలల కష్టపడిన తర్వాత, అర్జున్, ఆండ్రూ కలసి బ్రహ్మాను పట్టుకుంటారు. కానీ ఈ కిల్లర్ ని పట్టుకునే క్రమంలో ఆండ్రూ దారుణంగా చనిపోతాడు. ఈ దుర్ఘటన అర్జున్‌ను తీవ్రంగా కలచివేస్తుంది. అతను పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి, ఆండ్రూ కుటుంబంను చూసుకోవడానికి ఒక కాఫీ షాప్‌ను ప్రారంభిస్తాడు. ఇది ఇలా ఉంటే మరో వైపు బ్రహ్మా పోలీసు కస్టడీ నుండి తప్పించుకుని, తన హత్యలను మళ్లీ ప్రారంభిస్తాడు. అర్జున్, అతని మనుషులను టార్గెట్ చేస్తాడు. ఆ తరువాత స్టోరీ భయంకారంగా మారిపోతుంది. చివరికి అర్జున్ మళ్ళీ డ్యూటి ఎక్కుతాడా ? కిల్లర్ అంతు చూస్తాడా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : బ్యాచిలర్స్ తో ఆడుకునే ఆడ దెయ్యం… ఈ మలయాళ కామెడీ కమ్ హర్రర్ మూవీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్