Psychological Thriller Series OTT : ప్రేమలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి కోసం ఏదైనా చేయాలనిపించడం సహజమే. కానీ అదే ప్రేమ కాస్తా అతిగా మారితే నరకం ఎలా ఉంటుందో బతికుండాగానే కనిపిస్తుంది. ఓ వ్యక్తి జీవితంలోకి అతడి మాజీ ప్రేమికురాలు మళ్లీ తిరిగి వస్తుంది. ఆమె రీఎంట్రీతో అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. ప్రేమ, అసూయ, అబ్సెషన్, గతం తాలూకు రహస్యాలతో నడిచే సైకలాజికల్ రొమాంటిక్ డ్రామానే ‘Ishqa Ishqa’. ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అంటే…
కబీర్ ఓ సక్సెస్ ఫుల్ రైటర్. అతడి జీవితంలోకి సుహాని వచ్చిన తర్వాత కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది. గతంలో జరిగిన విషయాలను పక్కన పెట్టి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అతడు భావిస్తాడు. తన కెరీర్ పై దృష్టి పెట్టి, తనకు ఇష్టమైన వ్యక్తితో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటాడు. కానీ కబీర్ గతం మాత్రం అతడిని అంత సులభంగా వదలదు. అతడి చిన్ననాటి ప్రేమ అరొహి మళ్లీ అతడి జీవితంలోకి వస్తుంది.
కబీర్ రాసిన ‘ఇష్కా ఇష్కా’ నవలలో కూడా అరొహి జ్ఞాపకాలే ఉంటాయి. అందుకే ఆమె రీఎంట్రీ అతడి వ్యక్తిగత జీవితంతో పాటు రైటింగ్ కెరీర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. అరొహి మాత్రం కబీర్ ను మర్చిపోలేదు. గతంలో ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎంత బలంగా ఉందో ఆమె ప్రవర్తనలో కనిపిస్తుంది. కబీర్ మాత్రం సుహానితో కొత్త జీవితాన్ని కొనసాగించాలనుకుంటాడు. ఈ ఇద్దరి మధ్య సుహాని రావడంతో ప్రేమకథ క్రమంగా ఓ టెన్షన్ తో కూడిన ట్రయాంగిల్ గా మారుతుంది.
అయితే ఇక్కడ సమస్య కేవలం ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు అనేది మాత్రమే విషయం కాదు. అరొహి కబీర్ జీవితంలోకి తిరిగి రావడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది అసలు టెన్షన్. గతంలో పాఖీ అనే అమ్మాయి కబీర్ కు దగ్గరవడంతో అరొహిలో పెరిగిన అసూయ పరిస్థితులను ప్రమాదకరంగా మారుస్తుంది. ఇప్పుడు సుహాని కూడా కబీర్ జీవితంలో ఉండటంతో ఆమె ప్రవర్తన మరింత అనూహ్యంగా మారుతుంది.
మరోవైపు కబీర్ కుటుంబం కూడా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటుంది. అతడి తమ్ముడు అబీర్ చిన్నప్పుడు ఎదుర్కొన్న ప్రమాదానికి సంబంధించిన అప్పు కుటుంబంపై భారంగా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కబీర్ ప్రయత్నిస్తుండగా, అరొహి కూడా తనదైన పద్ధతిలో జోక్యం చేసుకుంటుంది. కబీర్ సుహానితో జీవితాన్ని కొనసాగించాలనుకున్న ప్రతిసారి అరొహి ఏదో ఒక రూపంలో అడ్డుగా వస్తుంది. ఒకవైపు పెళ్లి, కుటుంబ బాధ్యతలు, మరోవైపు గత ప్రేమ… వీటి మధ్య కబీర్ మానసికంగా ఇబ్బంది పడుతుంటాడు. అరొహి ఉద్దేశం ఏంటి ? ఆమె కబీర్ ని ఎందుకు వదిలిపెట్టడం లేదు ? చివరికి సుహాని-కబీర్ బంధం ఏ పరిస్థితికి చేరుతుంది ? అన్నదే సిరీస్‌లో ఆసక్తిని పెంచే అంశం.
ఇందులో లో కబీర్, సుహాని, అరొహి ప్రధాన పాత్రలుగా కథ సాగుతుంది. సిరీస్ లో రొమాన్స్‌తో పాటు సస్పెన్స్, సైకలాజికల్ డ్రామా అంశాలు కూడా ఉన్నాయి. 2026 అక్టోబర్ 7న ఈ సిరీస్ Amazon Prime Videoలో విడుదలైంది. ప్రస్తుతం ఇది హిందీ ఆడియోలో అందుబాటులో ఉంది.