BigTV English

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన తమిళ కామెడీ హారర్ ఫాంటసీ థ్రిల్లర్… ఐఎండీబీలో 8.0 రేటింగ్… ఇంకా చూడలేదా?

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన తమిళ కామెడీ హారర్ ఫాంటసీ థ్రిల్లర్… ఐఎండీబీలో 8.0 రేటింగ్… ఇంకా చూడలేదా?

OTT Movie: ఓటీటీలో ఒక తమిళ హారర్ మూవీ అదరగొడుతోంది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా, కామెడీ జానర్ లో తెరకెక్కింది. ఒక దురదృష్టవంతుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చేసే ప్రయత్నంతో ఈ స్టోరీ నడుస్తుంది. మూవీ లవర్స్ కి ఈ సినిమాలో కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది. ఈ తమిళ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


సన్ యన్ ఎక్స్ టి (Sun NXT) లో

ఈ తమిళ ఫాంటసీ హారర్ మూవీ పేరు ‘జిన్: ది పెట్’ (Jinn: The Pet). 2025 లో వచ్చిన ఈ సినిమాకి టి.ఆర్. బాలా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ముగెన్ రావు (శక్తి పాత్రలో), భవ్య త్రిఖా (ప్రియా పాత్రలో) ప్రధాన పాత్రల్లో నటించగా, బాలా సరవణన్, ఇమ్మన్ అణ్ణాచి, రాధా రవి, వడివుక్కరసి, నిజల్గల్ రవి, వినోధిని వైద్యనాథన్, జార్జ్ విజయ్, మాస్టర్ శక్తి సహాయక పాత్రలలో నటించారు. ఈ సినిమా 2025 మే 30 న థియేటర్లలో విడుదలైంది. జూన్ 20 నుండి సన్ యన్ ఎక్స్ టి (Sun NXT) లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఈ మూవీ 2 గంటల 16 నిమిషాల రన్‌ టైమ్‌తో IMDbలో 8.0/10 రేటింగ్ కలిగి ఉంది. కామెడీ, హారర్, రొమాన్స్ జానర్‌ల లో ఈ సినిమా తెరకెక్కింది.


స్టోరీలోకి వెళితే

ఈ సినిమా శక్తి అనే ఒక సంగీతకారుడి చుట్టూ తిరుగుతుంది. అతను మలేషియాలో ఐదు సంవత్సరాలు మ్యూజిక్ బ్యాండ్‌లో పనిచేసిన తర్వాత చెన్నైకి తిరిగి వస్తాడు. అతడు దూరదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాడు. అతని అదృష్టాన్ని మార్చాలనే ఆశతో, శక్తి ఒక పురాతన పెట్టెలో బంధించబడిన ‘పెంపుడు జిన్’ను కొనుగోలు చేస్తాడు. ఈ జిన్‌ను మూడు షరతులతో అదుపు చేయవచ్చని తెలుసుకుంటాడు. అతను ఈ జిన్‌తో తన సంగీత కలలను నెరవేర్చుకోవాలని, చెన్నైలో ఒక కొత్త బ్యాండ్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇంతలో శక్తి చెన్నైలో ప్రియా అనే అమ్మాయిని కలుస్తాడు. మొదటి చూపులోనే వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు.

అయితే జిన్‌ను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, శక్తి షరతులను ఉల్లంఘిస్తాడు. దీనివల్ల జిన్ ను నియంత్రించలేకపోతాడు. ఆ తరువాత అతని జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ఈ దురదృష్టాలకు జిన్ కారణమని శక్తి మొదట అనుకున్నప్పటికీ, తర్వాత అది వాళ్ళ రక్షకుడని తెలుస్తుంది. ఆ తరువాత జిన్ చర్యలు భయంకరమైన సంఘటనలకు దారితీస్తాయి. శక్తి, అతని స్నేహితులు ఈ అతీంద్రియ శక్తిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ వీళ్ళకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. చివరికి జిన్ ను శక్తి అదుపు చేస్తాడా ? జిన్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? శక్తి లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఫాంటసీ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : కోర్టు రూమ్ లోనే హత్య… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు… ఐఎండీబీలో 8.9 రేటింగ్

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×