OTT Movie : ప్రపంచం ఎలా నాశనం అవుతుంది? అంటే లెక్కలేనన్ని వాదనలు, థియరీలు విన్పిస్తాయి. అందులో యుద్ధం కూడా ఒకటి. సాధారణంగా శత్రు దేశాలు అవతలి దేశాలలో ఉన్న పవర్ ఫుల్ వెపన్స్ ను చూసి వెనక్కి తగ్గుతారు. అందుకే పెద్ద దేశాలన్నీ అణుబాంబు లాంటి ప్రపంచాన్ని నాశనం చేసే కొత్త కొత్త వెపన్స్ ప్రయోగాల్లో మునిగిపోతాయి. కానీ కేవలం ఒక రైఫిల్ తోనే భారీ బిల్డింగులను సైతం కూలదోస్తే శత్రువులు గజగజా వణకడం ఖాయం. అలాంటి ఓ సూపర్ రైఫిల్, దానిని తయారు చేసిన వ్యక్తి స్టోరీనే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో ఓ లుక్కేద్దాం పదండి.
స్టోరీలోకి వెళ్తే…
సినిమా 1941లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రారంభమవుతుంది. మిఖాయిల్ కలాష్నికోవ్ ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన యువకుడు. అతను సోవియట్ యూనియన్‌లో రెడ్ ఆర్మీలో ట్యాంక్ కమాండర్ గా పని చేస్తాడు. యాంత్రిక సమస్యలను పరిష్కరించడంలో చేయి తిరిగిన వాడు. పైగా కొత్త ఆయుధాలను సృష్టించగల సమర్థుడు.
మిఖాయిల్ బ్రయాన్స్క్ యుద్ధంలో జర్మన్ యాంటీ-ట్యాంక్ గన్‌ను నాశనం చేసే సమయంలో తీవ్రంగా గాయపడతాడు. ఈ యుద్ధంలో అతను సోవియట్ సైన్యం ఉపయోగించే ఆయుధాలు (ముఖ్యంగా మెషిన్ గన్‌లు) ఫెయిల్ అవ్వడం గమనిస్తాడు. అది అతన్ని కొత్త ఆయుధాన్ని రూపొందించే ఆలోచన వైపు నడిపిస్తుంది.
గాయపడిన తర్వాత, మిఖాయిల్‌ను ఆసుపత్రికి తరలిస్తారు. ఆ తర్వాత అతన్ని గోలుట్విన్‌లోని ష్చురోవ్ ఆర్మ్స్ టెస్టింగ్ ఫెసిలిటీకి పంపిస్తారు. అక్కడ అతను ప్రముఖ ఆయుధ డిజైనర్లు అలెక్సీ సుడాయేవ్, సెర్గీ కొరోవిన్‌లతో పోటీపడతాడు. అక్కడే ఎకటెరినా మోయిసీవా అనే ఒక లేడీ డిజైన్ అసిస్టెంట్ ను కలుస్తాడు. తర్వాత ఆమె హీరో భార్య అవుతుంది.
మిఖాయిల్ మొదటి డిజైన్ సుడాయేవ్ గన్‌తో పోటీలో ఓడిపోతుంది. కానీ అతని స్నేహితులు కొత్త డిజైన్‌పై పని చేయమని ప్రోత్సహిస్తారు. యుద్ధం ముగిసే సమయానికి అతను ఒక కొత్త ఆటోమేటిక్ రైఫిల్‌ను రూపొందిస్తాడు. దీనిని అతను కొవ్రోవ్ ఆర్మ్స్ ఫ్యాక్టరీలో తయారు చేస్తాడు. అనధికారికంగా తన రైఫిల్‌ను టెస్ట్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేస్తారు. కానీ ఆయుధ డిజైనర్ వాసిలీ డెగ్ట్యార్యోవ్ అతని ట్యాలెంట్ ను గుర్తించి, హీరో తయారు చేసిన రైఫిల్ డిజైన్ ను గౌరవిస్తాడు. డెగ్ట్యార్యోవ్ పోటీ నుండి తప్పుకుని, మిఖాయిల్ రైఫిల్ ను మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఇస్తాడు.
1947లో మిఖాయిల్ రైఫిల్ అంటే AK-47 (అవ్టోమాట్ కలాష్నికోవా 1947), సోవియట్ ప్రభుత్వ పరీక్షలలో పాస్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదొక ఐకానిక్ ఆయుధంగా మారుతుంది. ఈ రైఫిల్ స్ట్రాంగ్ గా ఉంటుంది, ఉపయోగించడానికి ఈజీ కూడా. సింపుల్ గా చెప్పాలంటే ఇదొక “సూపర్ రైఫిల్”. కానీ ఇదే రైఫిల్ అతన్ని, అతని కుటుంబాన్ని సమస్యల్లో పారేస్తుంది. ఆ సమస్యలు ఏంటి? రైఫిల్ ను తయారు చేసినందుకు అతను ఎందుకు బాధ పడ్డాడు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఆకాశంలో వింతలు… ప్రపంచం అంతానికి సంకేతాలు… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?
ఈ మూవీ పేరు “Kalashnikov”. 2020లో రిలీజ్ అయిన ఈ మూవీ రష్యన్ బయోగ్రాఫికల్ ఫిల్మ్. ఇది AK-47 ఆటోమేటిక్ రైఫిల్‌ను కనిపెట్టిన మిఖాయిల్ కలాష్నికోవ్ జీవితం ఆధారంగా తీసిన సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.