BigTV English

OTT Movie : 20 ఏళ్ల అమ్మాయితో 60 ఏళ్ల ముసలాడు… సంయుక్త మీనన్ ను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసుండరు భయ్యా

OTT Movie : 20 ఏళ్ల అమ్మాయితో 60 ఏళ్ల ముసలాడు… సంయుక్త మీనన్ ను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసుండరు భయ్యా

OTT Movie : ఏడు పదుల వయసులో ఉన్న విలక్షణ నటుడు నాజర్. అందులో సగం కూడా వయసు లేని సంయుక్త మీనన్‌ నాజర్ తో జతకట్టింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘Erida’. ఈ మలయాళీ ముద్దుగుమ్మ తన అందాలతో రెచ్చిపోయి ఆడియన్స్ కి కనువిందు చేసింది. ఒక వృద్ధుడికి భార్యగా తన నటనతో ఆకట్టుకుంది. ఈ స్టోరీ గ్రీకు పురాణంలోని వివాదాల దేవత ఎరిస్ నుండి ప్రేరణ పొందింది. ఈ సినిమా వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే

అను (సంయుక్త మీనన్‌) అనే ఇరవై ఏళ్ళ యువతి, శంకర్ (నాజర్) అనే 60 ఏళ్లు పైబడిన, జూదానికి బానిసైన ఒక ధనవంతుడిని వివాహం చేసుకుంటుంది. ఆమె కుటుంబం అతనికి అప్పు ఉండటం వల్ల, తప్పని పరిస్థితుల్లో ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది. శంకర్, అనుని తన “అదృష్ట చిహ్నం”గా భావిస్తూ, ఆమెను ఒక బంగళాలో దాదాపు ఖైదీలా ఉంచుతాడు. ఒక రోజు శంకర్ తన వ్యాపార ప్రత్యర్థితో హై-స్టేక్స్ పోకర్ గేమ్‌లో అనును పందెంగా పెట్టి భారీ మొత్తంలో డబ్బును గెలుస్తాడు. ఆ డబ్బును తన బంగళాలోని సేఫ్‌లో దాచుతాడు. ఆ తరువాత శంకర్ ఒక పని మీద బెంగళూరుకు వెళ్తాడు. ఆ రాత్రి అను ఆ బంగ్లాలో ఒంటరిగా ఉంటుంది. ఆ సమయంలో కిషోర్ అనే ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇతను ఒక పోలీసు అధికారిగా కనిపిస్తూ, శంకర్ అక్రమ డబ్బు గురించి తెలుసుకుని, అనుతో ఒక ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు.

ఈ సంఘటన అను జీవితంలో ఒక పెనుమార్పును తెస్తుంది. అను, శంకర్ నుంచి విముక్తి కోసం, అతని సేఫ్‌లోని డబ్బును దొంగిలించి, అతన్ని చంపాలని ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్‌లో కిషోర్ పాత్ర ట్విస్ట్‌లతో నడుస్తుంది. క్లైమాక్స్‌లో శంకర్, అను, కిషోర్ మధ్య జరిగే ఈ ఆట ఒక విషాదకరమైన ముగింపుకు దారితీస్తుంది. చివరికి శంకర్ ని అను చంపుతుందా ? కిషోర్ అనుతో ఎలాంటి డీల్ చేసుకుంటాడు ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ డ్రామా సినిమాని మిస్ కాకుండా చూడండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘Erida’ 2021లో విడుదలైన క్రైమ్ డ్రామా చిత్రం. వి.కె. ప్రకాష్ దర్శకత్వంలో సంయుక్త మీనన్ (అను), నాసర్ (శంకర్ గణేష్), కిషోర్, హరీష్ పెరడి, ధర్మజన్ బోల్గట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మలయాళం, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. ఇది 2 గంటల 4 నిమిషాల రన్‌టైమ్‌తో, 2021 అక్టోబర్ 28న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.

Read also : అబ్బాయిలను రెచ్చగొట్టి ఆ పని చేసే టీనేజర్… పని కానిస్తూ పరలోకానికి క్లయింట్… ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూడాల్సిన మూవీ

Related News

OTT Movie : అమ్మాయిల మంచం కింద దూరి సైకో అరాచకం… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie: తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసే కూతురు.. పెళ్లి కాకుండానే ప్రియుడితో అలా..

OTT Movie : కోట్లాది ప్రజల ప్రాణాలు గాల్లో… సీక్రెట్ ప్లేస్ లో దాక్కొని సినిమా చూసే దిక్కుమాలినోళ్లు… క్షణక్షణం ఉత్కంఠ

OTT Movie : బంగారం గొలుసు తీగ లాగితే మర్డర్ డొంక కదిలే… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చావు ఇంట్లో ముసలావిడ చెవిదుద్దులు మిస్సింగ్… కట్ చేస్తే కళ్ళు తిరిగే ట్విస్టు… మస్ట్ వాచ్ తమిళ థ్రిల్లర్

Bakasura Restaurant OTT: నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న బకాసుర రెస్టారెంట్!

Big Stories

×