Microsoft Surface Laptops: టెక్ ప్రియులను ఆకట్టుకునేలా మైక్రోసాఫ్ట్ కొత్త సర్ఫేస్ డివైజ్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. క్వాల్కమ్ తాజా స్నాప్‌డ్రాగన్ X2 ప్లస్ ప్రాసెసర్‌తో పనిచేసే కొత్త సర్ఫేస్ ప్రో, సర్ఫేస్ లాప్‌టాప్‌లను సంస్థ ఆవిష్కరించింది. వేగవంతమైన పనితీరు, మెరుగైన AI సామర్థ్యాలతో పాటు ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందించేలా వీటిని రూపొందించింది. ఇక వీటికి జతగా హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్, ప్రత్యేక కోపైలట్ బటన్‌తో కొత్త సర్ఫేస్ మౌస్‌ను కూడా మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది. ఈ కొత్త డివైజ్‌ల ఫీచర్లు, బ్యాటరీ లైఫ్, ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
కొత్త సర్ఫేస్ డివైజెస్‌కు స్నాప్‌డ్రాగన్ X2 ప్లస్ ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. గత మోడళ్లతో పోలిస్తే.. AI పనులను రెట్టింపు వేగంతో పూర్తి చేయగలదని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. గ్రాఫిక్స్ పనితీరు కూడా 60 శాతం మెరుగుపడింది. ఫ్యాన్ అవసరం లేని డిజైన్ కారణంగా డివైజెస్ నిశ్శబ్దంగా పనిచేస్తాయి.
Also Read: రిలయన్స్ డిజిటల్ సంచలనం.. iPhone 17 Proపై ఏకంగా రూ.77,000 తగ్గింపు!
సర్ఫేస్ ప్రోలో 12.3 అంగుళాల డిస్‌ప్లే, సర్ఫేస్ లాప్‌టాప్‌లో 13.3 అంగుళాల స్క్రీన్ ఉన్నాయి. రెండింటిలోనూ 500 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. సర్ఫేస్ ప్రోలో 1080p ఫ్రంట్ కెమెరాతో పాటు 10MP వెనుక కెమెరా ఉంది. లాప్‌టాప్‌లో ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉంటుంది. Wi-Fi 7, USB-C పోర్టులు కూడా అందించారు.
బ్యాటరీ విషయంలోనూ ఈ డివైజెస్ ఆకట్టుకుంటాయి. సర్ఫేస్ లాప్‌టాప్‌లో 22.5 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 18 గంటల వరకు ఇంటర్నెట్ వినియోగం సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది. సర్ఫేస్ ప్రో 15.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. కొత్త సర్ఫేస్ మౌస్‌లో బ్లూటూత్ 6.0, ప్రత్యేక కోపైలట్ బటన్ ఉన్నాయి.
సర్ఫేస్ ప్రో ప్రారంభ ధర రూ.1,10,400 కాగా.. సర్ఫేస్ లాప్‌టాప్ ప్రారంభ ధర రూ.1,15,200గా ఉంది. సర్ఫేస్ మౌస్ ధర దాదాపు రూ.7,700. ఇవి అక్టోబర్ 13 నుంచి ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. బిజినెస్ యూజర్ల కోసం సర్ఫేస్ ప్రోలో 5G ఆప్షన్ కూడా అందిస్తున్నారు.
Also Read: బ్యాటరీ కింగ్ Vivo Y21 5Gపై ఏకంగా 25,500 తగ్గింపు.. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి!