IPL 2026 : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా ఐపీఎల్ లో అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ ఏ ఆటగాడు వెలుగులోకి వస్తాడో.. ఎప్పుడూ ఏ ఆటగాడు ఫామ్ కోల్పోతాడో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఒక జట్టులో అద్భుతంగా ఆడిన ఆటగాడు.. మరో జట్టులో మాత్రం చెత్త చెత్తడా ఆడుతుంటాడు. ఇలా ఐపీఎల్ లో ప్రతి సంవత్సరం ఆటగాళ్లు అంతా మారుతుంటారు. కొందరూ వేలంలోకి వెళ్లితే.. మరికొందరినీ రిటైన్ చేసుకోవడం ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే..?
Also Read : Asia Cup 2025 : ఆసియా కప్ లో హ్యాండ్ షేక్ వివాదానికి కారణం అతడేనా..?
చెన్నై సూపర్ కింగ్స్ కి చెందిన కీలక ఆటగాడికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ ఆఫర్ ప్రకటించిందట. అయితే ఆ ఆటగాడు మాత్రం తిరస్కరించి చెన్నై సూపర్ కింగ్స్ లోనే కొనసాగుతున్నాడు. అయితే ఆ ఆటగాడు మరెవ్వరో కాదండోయ్.. విరాట్ కోహ్లీ ఫ్రెండ్.. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అంట. చాలా రోజుల నుంచి చెన్నై కి ఆడుతున్న గైక్వాడ్ చెన్నై ని వదిలి వెళ్లడానికి ఆసక్తి చూపించలేదు. మరోవైపు ఆర్సీబీ 2025 సీజన్ లో టైటిల్ సాధించగానే.. జట్టును మరింత మెరుగు పరిస్తే.. మరిన్ని టైటిల్స్ గెలవవచ్చని ధీమాలో ఉంది. అయితే ఈ సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించిన రజత్ పాటిదార్ ని కాదని.. రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ చేయాలని భావించిందట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. కానీ అందుకు రుతురాజ్ గైక్వాడ్ అంగీకరించలేదని సమాచారం.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో 5 టైటిల్స్ సాధించి టాప్ 2 ప్లేస్ లో ఉంది. అందరికంటే ఫస్ట్ ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్ సాధించి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. మరే జట్టు కూడా 5 మ్యాచ్ లు గెలవలేదు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గురించి సోషల్ మీడియాలో వార్త వైరల్ కావడం విశేషం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ దాదాపు 17 సీజన్ల నుంచి కొనసాగుతున్నాడు. విరాట్ అభిమానులు అంతా కూడా రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ కి మద్దతు తెలిపారు. మరోవైపు 17 సంవత్సరాల తరువాత 2025 సీజన్ కి ఆర్సీబీ టైటిల్ రావడంతో బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో సంబురాలు జరుపుకుంది ఆ జట్టు. ఆ సంబురాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఆర్సీబీ జట్టు తరపున మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆర్సీబీ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆ దెబ్బకు ఇప్పటికీ కూడా ఆర్సీబీ లో మ్యాచ్ జరుగుతుందంటే అభిమానులకు అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతం చెన్నై ఆటగాడు భారీ ఆఫర్ ని తిరస్కరించాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.