BigTV English

OTT Movie : మనిషిని బలిస్తే బంగారాన్ని ఇచ్చే పాడుబడ్డ బావి… ఇలాంటి హార్రర్ స్టోరీ నెవర్ బిఫోర్ భయ్యా

OTT Movie : మనిషిని బలిస్తే బంగారాన్ని ఇచ్చే పాడుబడ్డ బావి… ఇలాంటి హార్రర్ స్టోరీ నెవర్ బిఫోర్ భయ్యా

OTT Movie : సినిమాలలో హర్రర్ సినిమాలకుండే క్రేజే వేరు. ఒళ్ళు గగుర్పొడిచే భయంకరమైన సీన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తే వచ్చే కిక్కే వేరప్పా అనుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఈ సినిమా స్టోరీ మొత్తం దెయ్యాల గ్రామం చుట్టూ తిరుగుతుంది. దెయ్యాల ఊర్లు అనే కథలు ఎన్నో వినే ఉంటాము మనము. కానీ ఆ కథలను ఈ మూవీలో కళ్ళారా చూడచ్చు. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…

చిత్రం 1968లో ఒక గ్రామంలో జరిగిన ఒక ఉత్సవంతో మొదలవుతుంది. అక్కడ ఒక వ్యక్తి విద్యుత్ స్తంభాన్ని కత్తిరించడంతో, విద్యుత్ తీగ గ్రామస్తులందరినీ చంపేస్తుంది. దీనితో ఆ గ్రామం దెయ్యాల గ్రామంగా మారుతుంది. తరువాత కథ 2019లోకి మారుతుంది. గజ్జా, కాళియురుండ, సంకర్ అనే ముగ్గురు కిడ్నాపర్లు కామిని (సోనం బజ్వా) అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి, నైనా (పొన్నంబలం) అనే గ్యాంగ్‌స్టర్ దగ్గర‌కు తీసుకెళతారు. నైనా తమ రహస్యం బయటకు చెప్పకుండా ఉండేందుకు ఆ అమ్మాయిని చంపమని తన మనుషులను ఆదేశిస్తాడు.


మరొవైపు నీచమైన గ్యాంగ్‌స్టర్ నైనా నుండి తప్పించుకోవడానికి కిరణ్ (వైభవ్ రెడ్డి) తన భార్య శ్వేత (ఆత్మిక), ఈ కిడ్నాపర్లతో కలిసి ఒక కొండ గ్రామానికి వెళతాడు. అది దెయ్యాల గ్రామం అన్న విషయం వాళ్ళకి తెలీదు. ఈ గ్రామంలో మాతమ్మ (వరలక్ష్మి శరత్‌కుమార్) అనే దెయ్యం వీళ్ళకు చుక్కలు చూపిస్తుంది. ఆమె కన్పించిన వారికల్లా తన అందాన్ని ఎరగా వేస్తుంది. అలాగే “నేను అందంగా ఉన్నానా?” అని అడుగుతూ బాధితులను చంపుతుంది. సరైన సమాధానం చెప్పని వారిని ఆమె దెయ్యం రూపంలోకి మారి చంపేస్తుంది.

ఈ క్రమంలోనే మాతమ్మ తన గత కథను వివరిస్తుంది. 1968లో ఆమె తన సోదరి మోహిని, మామ వేణుతో ఒక ఇంట్లో నివసిస్తుంది. వేణు ఒక బావి తవ్వమని సంబత్ అనే వ్యక్తిని ఆదేశిస్తాడు. బావి తవ్వే సమయంలో అందులో ఒక గుండీలో బంగారు నగలతో నిండిన మట్టి కుండ కనిపిస్తుంది. ఈ బంగారానికి ఒక దెయ్యం (కాట్టేరి) కాపలా కాస్తుంది. దానికి తినడానికి ఆహారంగా మనుషులు కావాలి. అలా ఇచ్చిన వారికి కావలసినంత బంగారం ఇస్తుంది. లేకపోతే గ్రామస్తులను చంపుతుంది. ఆరుముగం ఈ రహస్యాన్ని తెలుసుకుని, గ్రామస్తులందరినీ విద్యుత్ తీగతో చంపేస్తాడు. దీనితో గ్రామం దెయ్యాల గ్రామంగా మారుతుంది. అయితే విషయం తెలుసుకున్న కిరణ్, అతని బృందం మాతమ్మ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి, బంగారాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కామిని అకస్మాత్తుగా మోహిని దెయ్యంగా మారుతుంది. నైనా (ఆరుముగం) తన గత రహస్యాలను దాచడానికి కిరణ్‌ను చంపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతను పొరపాటున తనను తాను చంపుకుంటాడు. అసలు నైనా ఎలా చచ్చాడు? చివరికి బంగారాన్ని సొంతం చేసుకున్నారా లేదా? హీరో హీరోయిన్ దీన్నుంచి ఎలా బయట పడ్డారు ? అనే విషయాలను సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ భయంకరమైన మూవీ పేరు “కాట్టేరి” (Katteri). 2022లో విడుదలైన తమిళ హారర్-కామెడీ చిత్రం ఇది. దీనికి దీకే (Deekay) దర్శకత్వం వహించారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ప్రధాన పాత్రల్లో వైభవ్ రెడ్డి, వరలక్ష్మి శరత్‌కుమార్, సోనం బజ్వా, ఆత్మిక, కరుణాకరన్, రవి మరియా, మైమ్ గోపి, పొన్నంబలం నటించారు. ఎస్.ఎన్. ప్రసాద్ సంగీతం సమకూర్చగా, 2022 ఆగస్టు 5న థియేటర్లలో విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఓటీటీలో మాత్రం హర్రర్ మూవీ లవర్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది.ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఈ చిత్రం తెలుగులో “సైతాన్” పేరుతో డబ్ అయ్యింది.

Read Also : లేడీ పోలీస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకోవడానికి ఊహించని పని… సీను సీనుకో ట్విస్ట్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×