OTT Movie : ఓటీటీలో వెబ్ సిరీస్ లు తమ సత్తా చాటుకుంటున్నాయి. సినిమాలకు ధీటుగా, ఈ సిరీస్ లు పోటీ పడుతున్నాయి. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సిరీస్ లకు సెన్సార్ నిబంధనలు కూడా లేకపోవడంతో, కొన్ని సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఒక పోలిస్ మిస్సింగ్ తో ఈ స్టోరీ నడుస్తుంది. ఇందులో సస్పెన్స్ తో కూడిన ట్విస్టులు ఉత్కంఠ భరితంగా సాగుతాయి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో
ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘కేరళ క్రైమ్ ఫైల్స్ : సీజన్ 2’ (Kerala Crime Files : Season 2). 2025 లో వచ్చిన ఈ సిరీస్ కి అహమ్మద్ ఖబీర్ దర్శకత్వం వహించారు. ఇందులో అర్జురాధాకృష్ణన్ (సబ్-ఇన్స్పెక్టర్ నోబుల్), అజు వర్గీస్ (సబ్-ఇన్స్పెక్టర్ మనోజ్), లాల్ (సర్కిల్ ఇన్స్పెక్టర్ కురియన్), ఇండ్రన్స్ (సీపీవో అంబిలీ రాజు) ప్రధాన పాత్రల్లో నటించారు. మొదటి సీజన్ (2023) ఒక సబర్బన్ లాడ్జ్‌లో జరిగిన వేశ్య హత్య కేసు చుట్టూ తిరుగుతుంది. సీజన్ 2 మాత్రం ఒక సివిల్ పోలీస్ ఆఫీసర్ అంబిలీ రాజు మిస్సింగ్ కేసును పరిచయం చేస్తుంది. ఈ సిరీస్ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలలో జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో జూన్ 20, నుంచి అందుబాటులో ఉంది. సీజన్ 1 మాదిరిగానే, ఈ సీజన్ కూడా విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంది.
స్టోరీలోకి వెళితే
సీజన్ 2 తిరువనంతపురంలో జరుగుతుంది. ఇక్కడ ఒక స్థానిక పోలీస్ స్టేషన్‌లోని అధికారులను, నేరస్థులతో అనుమానాస్పద సంబంధాల కారణంగా పై అధికారులు బదిలీ చేస్తారు. కొత్తగా నియమించిన అధికారుల బృందం, స్థానిక నేర కార్యకలాపాల గురించి ఎటువంటి జ్ఞానం లేకుండా, విధులు చేపట్టడం ప్రారంభిస్తారు. ఈ సందర్భంలో సివిల్ పోలీస్ ఆఫీసర్ అంబిలీ రాజు కనిపించకుండా పోతాడు. అతని ఫోన్, రక్తం మరకలతో డ్రైనేజ్ లో దొరుకుతుంది. దీనివల్ల పోలీసు శాఖలో అతని మిస్సింగ్ పై అనుమానాలు మొదలవుతాయి. సబ్-ఇన్స్పెక్టర్ నోబుల్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారణ చేపడుతుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కురియన్, సబ్-ఇన్స్పెక్టర్ మనోజ్ సహాయంతో. అంబిలీ రాజు ఒక సాధారణ అధికారి అయినప్పటికీ, అతనికి స్థానికంగా మంచి పేరు ఉండటంతో, ఈ కేసు పోలీసులసకు కీలకంగా మారుతుంది.
అయితే అతని వ్యక్తిగత జీవితం కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది. అతను నిజంగా నిజాయితీగల అధికారిగా ఉండేవాడా, అవినీతిలో మునిగిపోయాడా? అతను బాధితుడా లేదా నేరస్థుడా? అనే సందేహాలు కలుగుతాయి. పోలీసులు అంబిలీ గతం పరిశీలిస్తూ, అతని మిస్సింగ్ వెనుక ఉన్న రహస్యాలను వెలికితీసే క్రమంలో, ఈ కేసు ఒక డాగ్ ట్రైనర్ అయిన జైస్మన్ వైపు వెళ్తుంది. అంబిలీ అదృశ్యం వెనుక జైస్మన్ ప్రతీకార పథకం ఉందని తెలుస్తుంది. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులతో తిరుగుతుంది. చివరికి అంబిలీ మిస్సింగ్ కు కారణం ఎవరు ? అంబిలీ బతికే ఉన్నాడా ? జైస్మన్ గతం ఏమిటి ? కుక్కలకు, ఈ కేసుకు సంబంధం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఒకే అమ్మాయితో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్… మతిపోగొట్టే ట్విస్టులున్న కొరియన్ థ్రిల్లర్