BigTV English

OTT Movie : ప్రేమించిన అమ్మాయితోనే ఆ పాడు పని… 8.9 IMDb రేటింగ్… కలవరపెట్టే క్లైమాక్స్

OTT Movie : ప్రేమించిన అమ్మాయితోనే ఆ పాడు పని… 8.9 IMDb రేటింగ్… కలవరపెట్టే క్లైమాక్స్
Advertisement

OTT Movie : ఊహించని టర్న్ లతో, ఆసక్తిరమైన సర్ప్రైజ్ లతో ప్రేక్షకులకు ఆకట్టుకునే సినిమాలెన్నో ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. భాష అడ్డు కాదనుకునే వాళ్ళకైతే కావలసినంత ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన మూవీ సజెషన్ ఒక కన్నడ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో ఏకంగా హీరోనే హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తాడు. మరి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో రూపొందిన ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? కథేంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో అందుబాటులో… కానీ చిన్న ట్విస్ట్
ఈ కన్నడ రొమాంటిక్ డ్రామా పేరు ‘Kerebete’. మలెనాడు ప్రాంతంలో జరిగే సంవత్సరాంతర కెరెబేటె (మత్స్య శిక్షణ) సంప్రదాయం చుట్టూ తిరిగే కథ. ఈ చిత్రం ఒక యువకుడి ప్రేమ, కుల వివక్షత అనే అంశాలతో, ఊహించని ట్విస్ట్‌లతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది.

రాజ్‌గురు భీమప్ప దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో గౌరీశంకర్ (నాగ), బిందు శివరామ్ (మీనా), హరిని శ్రీకాంత్ (నాగ తల్లి), గోపాలకృష్ణ దేశ్‌పాండే తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Videoలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. కానీ రూ.99 రెంట్ చెల్లించి చూడాలి. కన్నడ ఆడియోతో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని కొన్నాక 30 రోజులు అందుబాటులో ఉంటుంది. అయితే ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే 48 గంటల్లో పూర్తి చేయాలి


కథలోకి వెళ్తే…
నాగ (గౌరీశంకర్ SRG) మలెనాడు ప్రాంతంలోని ఒక గ్రామంలో ఉండే రఫ్ అండ్ టఫ్ యువకుడు. కలప స్మగ్లింగ్ కారణంగా తరచూ జైలుకు వెళతాడు. సినిమా మొదట్లో అతను జైలు నుండి విడుదలై, కెరెబేటె అనే సంప్రదాయ మత్స్య శిక్షణలో పాల్గొంటాడు. నాగ తల్లి (హరిని శ్రీకాంత్) అనాథ. ఆమె దిగువ కులం నుండి వచ్చిందనే కారణంతో వారి తండ్రి ఆస్తిలో వాటాను ఇవ్వకుండా ఈ తల్లికొడుకులను గెంటేస్తుంది వాళ్ళ తండ్రి తరపు ఫ్యామిలీ.

నాగ కళాశాల విద్యార్థిని మీనా (బిందు శివరామ్)ను ప్రేమిస్తాడు. ఆమె ఉన్నత కులం నుండి వచ్చిన అమ్మాయి. అతను తన తల్లి, మీనాతో సంతోషకరమైన జీవితం కోసం భూమిని కొనడానికి కష్టపడి పని చేస్తాడు. కానీ మీనా తల్లిదండ్రులకు వీళ్ళ ప్రేమ గురించి తెలుస్తుంది. దీంతో వాళ్ళు నాగ తల్లిని బహిరంగంగా అవమానిస్తారు. దీంతో ఆగ్రహంతో నాగ మీనా తండ్రిని కొట్టి, గ్రామంలో అందరి ముందు అవమానిస్తాడు.

Read Also : నన్, గర్ల్ ఫ్రెండ్ తో స్కూల్లోనే ఇదెక్కడి అరాచకంరా అయ్యా ? మొత్తం అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

దీంతో నాగ, మీనా మధ్య దూరం పెరుగుతుంది. ఈ సంఘటన తర్వాత నాగ మీనాను కిడ్నాప్ చేస్తాడు. దీనితో పోలీసులు అతని కోసం గాలింపు ప్రారంభిస్తారు. ఎనిమిది నెలల తర్వాత, మీనా గర్భవతిగా తిరిగి వస్తుంది. కానీ నాగ ఆచూకీ ఉండదు. అసలు నాగ ప్రేమించిన అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? 8 నెలల తరువాత హీరో ఏమయ్యాడు? తిరిగి వచ్చిన హీరోయిన్ ను వాళ్ళ ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేసింది? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×