Family Drama : ఓటీటీలలో ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు విడుదల అవుతుంటాయి. అందులో థ్రిల్లర్ సినిమాలు లెక్కలేనన్ని ఉంటాయి. కానీ మనసుకు హత్తుకునే అందమైన ప్రేమ కథలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. మీరు కూడా ఇలాంటి సినిమాల కోసమే వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ‘మా ఇంటి కథ’ (Maa Inti Katha) అనే వెబ్ సిరీస్ గురించి, దాని స్టోరీ గురించి తెలుసుకుందాం పదండి.
మా ఇంటి కథ’ అనే ఈ తెలుగు మినీ వెబ్ సిరీస్ సాధారణ మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరిగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. శ్రావణ్ దాములూరి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్లు ఉంటుంది. ఏప్రిల్ 17 నుండి ETV Win ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అచ్చ తెలుగులో అందుబాటులో ఉంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కు పండగ ఈ సిరీస్.
వైజాగ్ సమీపంలోని ఒక గ్రామంలో కథ నడుస్తుంది. సామ్రాట్ (రోహిత్ సత్యన్) అనే వ్యక్తి టైలరింగ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తాడు. అతనికి భార్య శివమ్మ (అనూష నూతుల) కూడా హెల్ప్ చేస్తుంది. ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఉంటారు. సూర్య (ఉదయ్ కిరణ్) అనే టీనేజ్ అబ్బాయి పెద్ద కొడుకు. చిన్న కొడుకు శ్యామ్ (రిషి కార్తికేయ). అతను 5వ తరగతి చదువుతుంటాడు. అన్నీ మధ్యతరగతి కుటుంబాలలో ఉన్నట్టే ఈ కుటుంబంలోనూ కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా సామ్రాట్ తాకట్టు పెట్టిన భార్య నగలను విడిపించాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని క్షణం తీరిక లేకుండా కష్టపడతాడు.
తన అక్క ద్వారా ‘చీటీలు’ కూడా కడుతుంటాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో చదివించలేకపోతాడు. అందుకే చిన్న కొడుకు శ్యామ్ ను మాత్రమే ప్రైవేట్ స్కూల్ లో చేర్పిస్తాడు. ఇది పెద్ద కొడుకు సూర్యకు నచ్చదు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలే పిల్లలు అర్థం చేసుకోకపోవడంతో మనస్తాపానికి, అసూయకు కారణం అవుతాయి. ఈ క్రమంలోనే కథలో ట్విస్ట్ ఉంటుంది. ఒకానొక సందర్భంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఊరెళతారు, ఇంట్లో ఒంటరిగా ఉన్న సూర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ స్వేచ్ఛ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది ? సామ్రాట్ కన్న కలలు ఏంటి ? ఆ కుటుంబం ఆశలు ఎలా నెరవేరాయి ? అనేదే ఈ సిరీస్ ఇతివృత్తం. ఈ సిరీస్ ముఖ్యంగా 90s కిడ్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. బాల్యాన్ని గుర్తుచేస్తూ, ప్రతి మధ్యతరగతి కుటుంబం కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్‌గా ఫీల్ గుడ్ స్టోరీతో సాగే సిరీస్ ఇది.
Read Also : డెడ్లీ మార్షల్ ఆర్ట్స్… దుమ్మురేపే యాక్షన్ సీన్స్… ఈ మాస్టర్ పీస్ ను డోంట్ మిస్