E-Paper
Advertisement

ఒక్క ఫోన్ కాల్‌తో కుటుంబం మొత్తం రోడ్డున… అమ్మాయి రంగంలోకి దిగాక రచ్చ రచ్చ

ఒక్క ఫోన్ కాల్‌తో కుటుంబం మొత్తం రోడ్డున… అమ్మాయి రంగంలోకి దిగాక రచ్చ రచ్చ
Advertisement

Malayalam Cyber Thriller on OTT: ఒక చిన్న పల్లెటూరు… సంప్రదాయాలను, దైవాన్ని నమ్మే ఓ కుటుంబం… డిజిటల్ ప్రపంచం గురించి పెద్దగా అవగాహన లేని అమాయక ప్రజలు… అలాంటి వాళ్ల జీవితాల్లోకి అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠా అడుగు పెడితే ? కష్టపడి సంపాదించిన డబ్బంతా ఒక్క క్లిక్‌తో పోయి… ఆ మోసం కారణంగా కుటుంబంలోనే ఓ విషాదం జరిగితే ? అప్పటివరకు సాధారణంగా జీవించిన ఓ గ్రామీణ యువతి… ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ నేరగాళ్లపై యుద్ధం ప్రకటిస్తే ? ఈ ఆసక్తికరమైన ఆలోచనతో తెరకెక్కిన మలయాళ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ‘అచ్యుత అవతారం’ (Achyuta Avataaram 2026). మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కేరళలోని కాసరగోడ్ ప్రాంతంలోని ఓ ప్రశాంతమైన పల్లెటూరులో అచ్యుత తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటుంది. ఆ కుటుంబానికి ఆధునిక ప్రపంచం కంటే సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, దైవభక్తి చాలా ముఖ్యం. ఒకరికొకరు తోడుగా ఉంటూ సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటారు. డిజిటల్ ప్రపంచం ఎంత వేగంగా మారిపోతుందో వాళ్లకు పెద్దగా తెలియదు. మొబైల్ ఫోన్లు, ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ బ్యాంకింగ్ లాంటివి మాత్రం రోజువారీ జీవితంలో భాగమవుతుంటాయి. ఇదే విషయం సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతుంది.

Advertisement

ఒక అంతర్జాతీయ సైబర్ స్కామ్ నెట్‌వర్క్ కేరళలోని అమాయక ప్రజలను టార్గెట్ చేయడం మొదలు పెడుతుంది. నమ్మించేలా మెసేజ్‌లు పంపడం, మోసపూరిత లింకులు పంపడం, అత్యవసర పరిస్థితి పేరుతో వ్యక్తిగత వివరాలు తీసుకోవడం… ఇలా ఒక్కో కుటుంబాన్ని వలలోకి లాగుతుంటారు. అచ్యుత కుటుంబం కూడా అలాంటి ఓ డిజిటల్ మోసానికి చిక్కుతుంది. మొదట చిన్న మొత్తంగా మొదలైన మోసం క్రమంగా పెద్ద ఆర్థిక నష్టంగా మారుతుంది. జీవితాంతం కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బు ఒక్కసారిగా ఖాతాల నుంచి మాయమవుతుంది. ఏం జరిగిందో అర్థం కాక కుటుంబం షాక్‌లోకి వెళ్తుంది.

కానీ అసలు విషాదం అప్పుడే మొదలవుతుంది. ఆ సైబర్ మోసం వల్ల అచ్యుతకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ప్రాణాలు కోల్పోతాడు. డబ్బును కోల్పోవడం కంటే ప్రాణాన్ని కోల్పోవడమే ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేస్తుంది. ఒకవైపు ఆర్థికంగా నష్టపోయిన కుటుంబం.. మరోవైపు తమ కళ్లముందే జరిగిన విషాదాన్ని జీర్ణించుకోలేక మానసికంగా కుంగిపోతుంది. అక్కడే అచ్యుత పూర్తిగా మారిపోతుంది. ఇంతకాలం తన కుటుంబం, ఊరు, దైవభక్తి చుట్టూ మాత్రమే జీవించిన ఆమె… ఇప్పుడు తన కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తుల కోసం వెతకాలని నిర్ణయించుకుంటుంది. పోలీసులపై మాత్రమే ఆధారపడకుండా… తనకు తెలిసిన మార్గాల్లో ఆ సైబర్ నేరగాళ్ల జాడను తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడుతుంది.

Advertisement

ఇక్కడే సినిమా ఆసక్తికరంగా మారుతుంది. సైబర్ క్రైమ్ కథల్లో సాధారణంగా కంప్యూటర్ నిపుణులు, హ్యాకర్లు, పోలీస్ అధికారులు రంగంలోకి దిగుతుంటారు. కానీ ‘అచ్యుత అవతారం’లో అలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఏదీ లేని ఓ సాధారణ గ్రామీణ యువతి డిజిటల్ నేర ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. మొదట ఆమెకు టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన ఉండదు. కానీ తన కుటుంబానికి జరిగిన అన్యాయం ఆమెను నేర్చుకునేలా చేస్తుంది. ఒక్కో ఆధారాన్ని వెతుక్కుంటూ వెళ్తున్న కొద్దీ, తాను ఎదుర్కొంటున్నది ఓ చిన్న మోసం కాదని ఆమెకు అర్థమవుతుంది. దీని వెనుక దేశాల సరిహద్దులను దాటి పనిచేస్తున్న ఓ భారీ సైబర్ నేర వ్యవస్థ ఉందని తెలుస్తుంది.

ఒక గ్రామంలోని అమాయక ప్రజలను టార్గెట్ చేయడం నుంచి మొదలైన కథ.. క్రమంగా అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న డిజిటల్ నేరగాళ్ల నెట్‌వర్క్ వరకు వెళ్తుంది. అచ్యుత ముందుకు వెళ్లే కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుంది. చివరికి అచ్యుత సైబర్ మోసగాళ్ల అసలు నెట్‌వర్క్‌ను ఎలా గుర్తించింది? వాళ్లు ఉపయోగించిన డిజిటల్ ఉచ్చులను ఎలా ఛేదించింది ? తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఆమె ఎలా న్యాయం సాధించింది? ఆమెతో పాటు గ్రామంలోని ప్రజలు ఈ పోరాటంలో ఎలా భాగమయ్యారు? అన్నదే క్లైమాక్స్‌లో చూడాల్సిన అంశం.

తెలుగులో కూడా చూడవచ్చు

‘అచ్యుత అవతారం’ సాధారణ సైబర్ క్రైమ్ కథలా కాకుండా… ఓ సంప్రదాయ కుటుంబం, గ్రామీణ జీవితం, దైవభక్తి, కుటుంబ భావోద్వేగాలను అంతర్జాతీయ డిజిటల్ నేరాల ప్రపంచంతో కలిపిన ప్రయోగాత్మక థ్రిల్లర్. నాన్-లీనియర్ కథనం, హైపర్‌లింక్ స్క్రీన్‌ప్లే, సైబర్ స్కామ్ నేపథ్యం ఈ సినిమాకు ప్రత్యేకతగా నిలుస్తాయి. ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు, మలయాళం, హిందీ తదితర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మాళవిక నందన్, అవినాష్, సీమ జి. నాయర్ ప్రధాన పాత్రల్లో నటించగా పునీత్ దర్శకత్వం వహించారు.

Read Also: జైలు నుంచి క్రైమ్ సామ్రాజ్యం… చెల్లెలికి మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

Related News

తల్లి మరణంతో ఊరు మారిన అమ్మాయి… ఆడపిల్లల వల్ల ఇంత పెద్ద సమస్యా ? అసలు గుట్టేంటి ?

ప్రాణాలు కాపాడిన డాక్టర్‌పైనే పిచ్చి… పెళ్ళాం ఉన్నా వదలకుండా ఇదేం అరాచకం భయ్యా

ప్రియుడిని పరీక్షించమని ఫ్రెండ్‌నే పంపింది… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్…

జైలు నుంచి క్రైమ్ సామ్రాజ్యం… చెల్లెలికి మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

బెంగాల్ మొత్తం ఈ జంట వెంటే.. హార్డ్ డ్రైవ్ కోసం ఇదేం అరాచకం భయ్యా

చావుతో దాగుడుమూతలు ఆడే ఫ్రెండ్స్… కింద పడితే గేమ్ ఓవర్… ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అడ్వెంచర్

ఫేస్ ఇంటర్నేషనల్ స్టార్ లా ఉందని జీవితమే నరకం చేశారు… సమాజం చేసిన పనికి దిమ్మతిరిగిపోతుంది

Big Stories

Advertisement
×