E-Paper
Advertisement

కేరళ ప్రజలలో పాతుకుపోయిన ఫుట్‌బాల్ ప్రేమ… ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

కేరళ ప్రజలలో పాతుకుపోయిన ఫుట్‌బాల్ ప్రేమ… ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ
Advertisement

Malayalam Football Documentary: కేరళలో ఫుట్‌బాల్ అంటే కేవలం ఓ ఆట కాదు. గెలిచిన రోజు పండగ చేసుకునే అభిమానులు, ఓడినప్పుడు గంటల తరబడి జరిగే చర్చలు, బ్రెజిల్–అర్జెంటీనా జట్ల కోసం రాత్రిళ్లు మేల్కొని మ్యాచ్‌ లు చూసే యువత… ఇలా ఫుట్‌బాల్ అక్కడి ప్రజల జీవితంలోనే ఓ భాగంగా మారిపోయింది. ఆ అభిమానం వెనకున్న కథలను తెరపైకి తీసుకొచ్చే ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ ‘పంథడిక్కమ్’ (Panthadikkam). మరి కేరళ ఫుట్‌బాల్ సంస్కృతిని చూపించే ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందంటే ?

కథలోకి వెళ్తే…

‘పంథడిక్కమ్’ రొటీన్ కథతో సాగే కల్పిత సిరీస్ కాదు. కేరళకు ఫుట్‌బాల్‌ తో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని ఐదు భాగాలుగా చూపించే స్పోర్ట్స్ డాక్యుమెంటరీ. ఒకప్పుడు క్లబ్ ఫుట్‌బాల్‌ తో మొదలైన ప్రయాణం, తర్వాత సంతోష్ ట్రోఫీ కాలంలో వచ్చిన గుర్తింపు, ఆ తర్వాత ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ వైపు సాగిన మార్పులను ఇందులో చూపిస్తారు.

Advertisement

ఫుట్‌బాల్ కేరళలో ఎలా ఓ సంస్కృతిగా మారిందనేదే ఈ సిరీస్‌ లో ప్రధాన అంశం. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఫుట్‌బాల్ చుట్టూ ఏర్పడిన అభిమాన సంఘాలు, స్థానిక ప్రత్యర్థిత్వాలు, అభిమానుల మధ్య జరిగే చర్చలు, మ్యాచ్‌ ల సమయంలో కనిపించే సందడి వంటి విషయాలకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. బ్రెజిల్, అర్జెంటీనా వంటి అంతర్జాతీయ జట్లకు కేరళలో ఏర్పడిన అభిమానాన్ని కూడా ప్రత్యేకంగా చూపిస్తారు.

ఫుట్‌బాల్ మ్యాచ్‌ ల కోసం రాత్రివేళ ఏర్పాటు చేసే స్క్రీనింగ్స్, ఆటగాళ్ల పోస్టర్లతో అలంకరించిన ఆటోలు, పెద్ద ఫ్లెక్స్‌ లు, టర్ఫ్‌ లలో జరిగే మ్యాచ్‌ లు… ఇవన్నీ అక్కడి అభిమాన సంస్కృతిలో ఎంతగా కలిసిపోయాయో ఈ డాక్యుమెంటరీ వివరిస్తుంది. అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడటానికి విదేశాలకు వెళ్లే వారి అనుభవాలను కూడా ఇందులో చూడొచ్చు. ఇక ఈ సిరీస్‌ లో ప్రత్యేకంగా కనిపించే మరో కథ.. భారత తొలి జాతీయ అంపైటీ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ వైశాఖ్ ఎస్.ఆర్. ప్రయాణం. శారీరక పరిమితులను దాటి ఫుట్‌బాల్‌ పై తన ప్రేమను కొనసాగించిన అతడి అనుభవం ఈ డాక్యుమెంటరీకి మరో కోణాన్ని తీసుకొస్తుంది.

ఏ ఓటీటీలో చూడొచ్చు ?

Advertisement

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) వాయిస్ ఓవర్ అందించిన మలయాళ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ‘పంథడిక్కమ్’. దీనికి నిక్స్ లోపెజ్ దర్శకత్వం వహించారు. మొత్తం ఐదు ఎపిసోడ్లు ఉండగా ఒక్కో ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాల నిడివితో ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీ మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది.

Read Also: తండ్రిపై కోపంతో రింగ్‌లోకి దిగిన కుర్రాడు… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్

 

Tags

Related News

కుక్కను వెతుక్కుంటూ వెళ్లిన బాలుడికి ఊహించని వ్యక్తి జాడ దొరికితే… ఓటీటీలోకి డిఫరెంట్ మిస్టరీ మూవీ

లవర్ బ్లాక్ చేసిందని ఈ కుర్రాడు చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరు… నెల తిరక్కుండానే ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా మూవీ

అక్టోబర్‌లో ఓటీటీలోకి వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే… హారర్, థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు భారీ లిస్ట్

క్రిప్టోతో కోటీశ్వరుడు అవ్వాలనుకుంటే ఊహించని చిక్కులు… దిమాక్ కరాబ్ ట్విస్టులున్న కొరియన్ థ్రిల్లర్ తెలుగులోనే

ఇల్లరికం అల్లుడి కష్టాలు… కూతురిని ముట్టుకొనివ్వని పట్టుకొనివ్వని తల్లి దెయ్యం… మస్ట్ వాచ్ మలయాళం మూవీ

స్కూల్లో స్టూడెంట్ రౌడీ వేషాలు… టీచర్ ఇచ్చే ట్విస్టుకు పట్టపగలే చుక్కలు… కొరియన్ టీచరా మజాకా

కోడి చుట్టూ తిరిగే కథ… చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించడం కష్టం… తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×