E-Paper
Advertisement

మైండ్ బెండింగ్ కొరియన్ డ్రామాలు… ఒక్కో మూవీ ఒక్కో ఆణిముత్యం

మైండ్ బెండింగ్ కొరియన్ డ్రామాలు… ఒక్కో మూవీ ఒక్కో ఆణిముత్యం
Advertisement

K-Drama OTT : కొరియన్ డ్రామాలకు వరల్డ్ వైడ్ గా మంచి ఆదరణ దక్కుతోంది. రోజురోజుకీ కే- డ్రామాలలోనూ క్రేజీ కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటిదాకా అలా ఓటీటీలలోకి వచ్చిన ఆ బెస్ట్ సినిమాలు, సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం పదండి. సౌత్ కొరియన్ సినిమా ప్రపంచాన్ని ఊపేసిన ఈ ఆరు మాస్టర్‌పీస్ సినిమాలను ఇప్పటిదాకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

Memories of Murder

‘మెమొరీస్ ఆఫ్ మర్డర్’ 2003లో తెరకెక్కిన మూవీ. అంతేకాదు యదార్థ గాథ కూడా. 1980ల కాలంలో ఊర్లో వరుస హత్యలు చేస్తూ ఉంటాడు ఒక సైకో కిల్లర్‌. అతన్ని పట్టుకోవడానికి ఇద్దరు పోలీసులు చేసే ప్రయత్నం బెడిసి కొడుతుంది. ఆ తరువాత ఏం జరిగిందో సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Mother

Advertisement

‘మదర్’ (2009) మూవీలో బుద్ధిమాంద్యం ఉన్న కొడుకు మీద మర్డర్ కేసు పెడతారు. తన కొడుకు నిర్దోషి అని నిరూపించడానికి ఒక తల్లి ఎంత దూరం వెళ్ళింది అన్నది కథ. చివరకు ఆమెకు తెలిసిన భయంకరమైన నిజం ఏంటి అనేది గుండెల్ని పిండేసేలా చూపించారు. ప్రైమ్ వీడియోలో దీన్ని చూడవచ్చు.

Oldboy

2003లో వచ్చిన మూవీ ‘ఓల్డ్ బాయ్’. ఇది రివేంజ్ డ్రామాలలోనే ఒక సంచలనం. ఓ వ్యక్తిని 15 ఏళ్ల పాటు గదిలో బంధించి, అకస్మాత్తుగా వదిలేస్తారు. తనను అసలు ఎందుకు అలా బంధించారో తెలుసుకునే క్రమంలో వచ్చే ట్విస్టులు, షాకింగ్ క్లైమాక్స్ ఆడియన్స్ ను ఉలిక్కిపడేలా చేస్తాయి. దీన్ని ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

I Saw the Devil

Advertisement

2010లో వచ్చిన ‘ఐ సా ద డెవిల్’లో తన భార్యను చంపిన సైకో కిల్లర్‌ పై ఒక సీక్రెట్ ఏజెంట్ రివేంజ్ తీర్చుకుంటాడు. వాడిని పట్టుకుని, చంపకుండా టార్చర్ చేసి, వదిలేస్తూ… పదే పదే చిత్రహింసలు పెడుతుంటాడు. ఆ వేటలో హీరో కూడా ఒక రాక్షసుడిలా మారి ఆ సైకోకి ఎలా చుక్కలు చూపించాడు అన్నది కథ. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Also Read : కళ్లు చెదిరే విజువల్స్…శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే తొమ్మిది తోకల నక్క… ఆకట్టుకుంటున్న ఫాంటసీ సిరీస్

Train to Busan

2016లో విడుదలైన సంచలనం ‘ట్రెయిన్ టు బుసాన్’. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన మూవీగా పేరు తెచ్చుకున్న జోంబీ సినిమా ఇది. బుసాన్ రైలు ప్రయాణంలో జోంబీ వైరస్ అటాక్ జరుగుతుంది. తన కూతురిని కాపాడుకోవడానికి ఒక తండ్రి చేసే పోరాటం కన్నీళ్ళు పెట్టిస్తుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

Parasite

ఆస్కార్ గెలిచిన సినిమా ‘పారాసైట్’ (2019). పేద కుటుంబం తెలివిగా ధనవంతుల ఇంట్లో పనికి కుదురుతారు. ఆ తర్వాత అక్కడ జరిగే ఊహించని పరిణామాలు, పేద-ధనిక వర్గాల మధ్య ఉండే తేడాలను ఒక డార్క్ కామెడీ-థ్రిల్లర్‌ లో చూపించిన విధానం కట్టిపడేస్తుంది. దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×