E-Paper
Advertisement

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ
Advertisement

Telugu Comedy Movie: ఊర్లో ఓ కొత్త పెళ్లికొడుకు గురించి చిన్న రూమర్ మొదలైతే చాలు… అది క్షణాల్లో ఊరంతా పాకిపోతుంది. పెళ్లి జరిగిన వెంటనే వ్యక్తిగత జీవితం గురించి జనాలు మాట్లాడటం మొదలు పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది ? పైగా ఒక దంపతుల విషయంలో పుట్టిన అపార్థాలు, గాసిప్స్, కుటుంబ గౌరవం అన్నీ కలిసి పెద్ద సమస్యగా మారితే ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. కానీ ఇదే టాపిక్ తో ఇప్పుడు మనం చెప్పుకునే సినిమాలో నవ్వులు పూస్తాయి. ఓ కొత్త పెళ్లి, దాని చుట్టూ పుట్టే అనుమానాలు, ఊరి నోళ్లలో నానే రూమర్లు… వీటన్నింటి మధ్య నడిచే గ్రామీణ కామెడీ కథే ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ (Mension House Mallesh). మరి ఈ తెలుగు కామెడీ డ్రామా ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వచ్చిందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

గ్రామీణ నేపథ్యంలో కథ మొదలవుతుంది. కొత్తగా పెళ్లి జరుగుతుంది మల్లేష్ కి. కానీ శోభనం జరిగిన నెక్స్ట్ డేనే అతను టాక్ ఆఫ్ ది విలేజ్ అవుతాడు. చిన్నప్పుడే తండ్రి వేధింపులతో అతను ఊరు వదిలి పారిపోతాడు. తండ్రి చనిపోయాక ఊరికి వస్తాడు. కానీ అతని బాగా తాగుడుకు బానిస అవుతాడు. అయితే ఆ విషయాన్ని దాచి అతని తల్లి పెళ్లి చేస్తుంది. కానీ తాగే అలవాటు వల్ల ఫస్ట్ నైట్ రోజు పనవ్వదు. భార్య ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. కానీ ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా టామ్ టామ్ అవుతుంది.

Advertisement

భార్యతో తన సంబంధం ఎలా ఉంది ? వారి వ్యక్తిగత జీవితంలో నిజంగా ఏం జరుగుతోంది ? అనే విషయాలపై కూడా ఊరి జనాలు రకరకాల ఊహాగానాలు మొదలు పెడతారు. అతని వ్యక్తిగత విషయం కాస్తా గ్రామం మొత్తానికి వినోదంగా మారుతుంది. మల్లేష్ మాత్రం తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. ఇదే సమయంలో అదే ఊర్లో ఉండే వ్యక్తి ఈ సాకుతో మల్లేష్ కు ఉన్న కొంత భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాదు దమ్ముంటే పిల్లల్ని కనమని సవాల్ చేస్తాడు.

ఒకవేళ మల్లేష్ పిల్లలని కని చూపిస్తే అతని భూమిని ఇచ్చేస్తాను అని చెప్తాడు. అలా జరగకపోతే మల్లేష్ తన భూమిని అతని రాసి ఇవ్వాలనే డీల్ పెట్టుకుంటారు. ఇంతకీ మల్లేష్ కి పిల్లలు పుట్టారా లేదా ? చివరికి ఎవరి భూమిని ఎవరు లాక్కున్నారు ? మల్లేష్ తాగుడు అలవాటును భార్య, తల్లి కలిసి ఎలా మానిపించారు ? అనేది తెరపై చూడాల్సిందే.

తెలుగులోనే స్ట్రీమింగ్

Advertisement

కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla), మురళీధర్ గౌడ్ (Muralidhar Goud), రాజ్‌కుమార్ కసిరెడ్డి (Rajkumar Kasireddy), గాయత్రి రమణ (Gayatri Ramana), మాగంటి శ్రీనాథ్ (Maganti Srinath) తదితరులు నటించిన ఈ సినిమాకు బాల సతీష్ (Bala Satish) దర్శకత్వం వహించారు. ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఒరిజినల్ కావడంతో తెలుగు ఆడియో అందుబాటులో ఉంది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళ ఆడియోలు కూడా ఉన్నాయి.

Read Also: గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

Related News

రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే

ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా

నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్న ‘రోమాంచకం’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇంటికి ఎదురుగా ముసుగేసుకుని కూర్చొనే మహిళ… దగ్గరయ్యే కొద్దీ పెరిగే భయం… సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్

యాక్సిడెంట్లో యూనికార్న్ డెత్… రక్తం కోసం మనుషులే రాక్షసులైతే? క్రేజీ హారర్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×