E-Paper
Advertisement

 భార్యను హత్య చేసే డిటెక్టివ్… ఫ్యూచరిస్టిక్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

 భార్యను హత్య చేసే డిటెక్టివ్… ఫ్యూచరిస్టిక్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్
Advertisement

Mercy Movie : 90 నిమిషాల్లో నిర్దోషిత్వం నిరూపించుకోవాలి… లేదంటే మరణం తప్పదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. క్రిస్ ప్రాట్, రెబెక్కా ఫెర్గూసన్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మెర్సీ’ (Mercy 2026 Movie). ప్రముఖ దర్శకుడు తైమూర్ బెక్మాంబెటోవ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2029 నాటి ఫ్యూచరిస్టిక్ లాస్ ఏంజెల్స్‌లో సాగుతుంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

సినిమా మొత్తం ఫ్యూచర్ లోనే సాగుతుంది. నేరాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం ఒక సరికొత్త న్యాయ వ్యవస్థను ప్రవేశపెడుతుంది. మెర్సీ క్యాపిటల్ కోర్ట్. ఇక్కడ మనుషులు కాదు, మాడాక్స్ అనే అత్యాధునిక AI జడ్జ్, జ్యూరీ, ఎగ్జిక్యూషనర్‌ గా పని చేస్తుంది. నిందితుడిని ఒక ప్రత్యేక కుర్చీలో కట్టేసి, నిరూపించుకోవడానికి కేవలం 90 నిమిషాలు మాత్రమే ఇస్తారు. ఆ సమయంలోగా తన గిల్ట్ పర్సంటేజ్ నేరం చేసినట్లు ఉన్న అవకాశంను 92% కంటే తగ్గించుకోకపోతే… ఆ కుర్చీలోనే మరణశిక్ష అమలవుతుంది. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది.

Advertisement

లాస్ ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ లో డిటెక్టివ్ క్రిస్టోఫర్ రావెన్ (క్రిస్ ప్రాట్) ఈ AI కోర్టు వ్యవస్థను అమల్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాడు. కానీ ఒకరోజు ఉదయం అతను కళ్లు తెరిచేసరికి… తానే ఆ మెర్సీ కుర్చీకి కట్టేసి ఉంటాడు. అతని భార్య నికోల్ (అన్నాబెల్ వాలిస్) ఘోరంగా హత్యకు గురైందని, ఆ హత్యకు అతనే నిందితుడని AI జడ్జ్ మాడాక్స్ (రెబెక్కా ఫెర్గూసన్) ప్రకటిస్తుంది. అతని గిల్ట్ రేషియో 97.5%గా చూపిస్తుంది. క్రిస్‌కు కేవలం 90 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి. ఆ సమయంలోగా తన నిర్దోషితనాన్ని నిరూపించుకోవాలి. ఆ కుర్చీలో కూర్చొని డిజిటల్ నెట్‌వర్క్ ద్వారా సిటీలోని అన్ని CCTV కెమెరాలు, భార్య ఈమెయిల్స్, మెసేజ్‌లు, బాడీక్యామ్ ఫుటేజీలను జల్లెడ పడతాడు.

బయట ఉన్న అతని పార్ట్‌నర్ కూడా సహాయం చేస్తుంది. ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ లో ఒక్కొక్క ట్విస్ట్ బయట పడుతుంది. ఈ హత్య వెనుక ఎవరి హస్తం ఉంది ? AI సిస్టమ్‌ ను దుర్వినియోగం చేసి తనను ఇరికించింది ఎవరు ? ఆ ఏఐ జడ్జ్ నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు ? అన్నది స్టోరీ. 1 గంట 39 నిమిషాల క్రిస్ప్ రన్ టైమ్, ఫాస్ట్ పేస్డ్ నెరేషన్ ఉన్న ఈ మూవీ Amazon Prime Videoలో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : రెంటు తక్కువని వెళ్తే డైరెక్ట్ నరకమే… పొరపాటున పడుకునే ముందు ఈ హర్రర్ మూవీని చూడొద్దు భయ్యా

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×