E-Paper

అందానికే అసూయ తెప్పిస్తోంది, నిద్ర‌కూడా పోనివ్వ‌డం లేదు.. ఎవ‌రీ 17 ఏళ్ల ఇరా ఏరీ ?

అందానికే అసూయ తెప్పిస్తోంది, నిద్ర‌కూడా పోనివ్వ‌డం లేదు.. ఎవ‌రీ 17 ఏళ్ల ఇరా ఏరీ ?
Advertisement

Ira Aery:  టీ 20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026 ) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మొన్న జూన్ 12వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ జూలై 5వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు దాదాపు పది మ్యాచ్ లు పూర్తయ్యాయి. అటు టీమిండియా కూడా పాకిస్తాన్ పై మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఇరా ఏరీ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అచ్చం హీరోయిన్ లా ఆమె ఉండడం… అందులోనూ ఇండియాకు సంబంధించిన లేడీ కావడంతో ఇరా ఏరీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాస్తవంగా మహిళల క్రికెట్ అంటే ఎవరు చూడరు. కానీ ఇరా ఏరీ ( Australian cricketer Ira Aery) ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మ్యాచ్ లు ఇండియన్స్ ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

Also Read: vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

అందానికే అసూయ తెప్పిస్తోంది.. ఎవ‌రీ 17 ఏళ్ల ఇరా ఏరీ ?

Advertisement

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు తరఫున బరిలోకి దిగిన ఇరా ఏరీ గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడుతున్న ఈ 17 ఏళ్ల ఇరా ఏరీ భారత సంతతికి చెందిన క్రికెటర్. ఈమె పుట్టి పెరిగింది ఆస్ట్రేలియా అయినప్పటికీ… ఆమె తల్లిదండ్రులు మాత్రం ఇండియాకు సంబంధించిన వాళ్ళు. కానీ ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. అందుకే ఇరా ఏరీ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున బరిలోకి దిగుతోంది. 2009 ఫిబ్రవరి 25వ తేదీన ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగరంలో ఆమె జన్మించారు. అయితే చిన్నప్పటినుంచి ఆమెకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి… ఆదిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ఆడుతున్నారు ఇరా ఏరీ.

ఇరా ఏరీ ప్రత్యేకతలు ఇవే

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున ఆడుతున్న ఇరా ఏరీ… రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్. ఈమె బ్యాటింగ్ కూడా చేస్తుంది. అంటే ఆల్ రౌండర్ అన్నమాట. మేల్ బోర్న్ స్టార్స్ ఉమెన్, విక్టోరియా ఉమెన్ జట్లకు కూడా ఆమె ప్రాతినిధ్యం వహించింది. బ్రిస్బెండ్ ట్రై సిరీస్ నేపథ్యంలో ఇంగ్లాండ్, శ్రీలంక అలాగే ఆస్ట్రేలియా జట్లు తెలపడ్డాయి. ఈ సందర్భంగా ఆమె 13 వికెట్లు పడగొట్టారు. 26 పరుగులకు నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించారు. ఈ తరుణంలోనే టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు ఆమె సెలెక్ట్ అయ్యారు.

Advertisement

Also Read: Kumar asangakkara On vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

 

 

Related News

Sanjay Manjrekar: నేనే కోచ్ అయితే, వైభవ్ రెండు చెంపలు వాయించేవాడిని

ఇండియా చేతిలో ఓట‌మి..పాకిస్తాన్ ప్లేయర్లకు నరకం చూపిస్తున్న కోచ్‌

బంగ్లాదేశ్ లో దంచికొడుతున్న ఎండ‌లు..మైదానంలోనే కుప్ప‌కూలిన‌ టిమ్ డేవిడ్

మా పాక్ ప్లేయ‌ర్ల‌కు కూడా కాలి బూటు చూపించాడు..వైభ‌వ్ పై ప‌ర్మినెంట్ బ్యాన్ వేయాలి

పేరుకే సుంద‌ర్ ఆల్ రౌండర్, కానీ పీకిందేమి లేదు.. వాడి వ‌ల్ల రూపాయి లాభం లేదు

లంక ప్లేయ‌ర్ ఒక్క‌డినే బ‌లి చేస్తారా ? వైభ‌వ్ ఏమైనా సుద్ధ పూసనా, త‌న్ని త‌రిమికొట్టండి !

వార్నీ ఇదేందిర‌య్యా.. వ‌ర్షం వ‌స్తుంటే డైవ్ లు కొడుతూ లేడీ క్రికెట‌ర్ల ర‌చ్చ‌, ఏకంగా 26 ఏళ్ల త‌ర్వాత‌

×