E-Paper

హత్యలు చేస్తూ పత్రికల్లో వింత పజిల్స్… కిర్రాక్ సైకో థ్రిల్లర్

హత్యలు చేస్తూ పత్రికల్లో వింత పజిల్స్… కిర్రాక్ సైకో థ్రిల్లర్
Advertisement

True Crime Thriller : ఒక సీరియల్ కిల్లర్ కేసు… దాన్ని ఛేదించడానికి ఏళ్ల తరబడి శ్రమించిన పోలీసులు, జర్నలిస్టులు, ఒక కార్టూనిస్ట్… చివరికి దొరికింది నిజమా? లేక మరో మిస్టరీనా? ఇలాంటి ప్రశ్నలతో ప్రేక్షకుడిని చివరి వరకు ఉత్కంఠలో ఉంచే హాలీవుడ్ మాస్టర్‌పీస్ ‘Zodiac’. 2007లో విడుదలైన ఈ అమెరికన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌కు డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించారు. జేక్ జిలెన్‌హాల్, మార్క్ రఫెలో, రాబర్ట్ డౌనీ జూనియర్, క్లోయి సెవిగ్నీ ప్రధాన పాత్రల్లో నటించారు. నిజ జీవితంలో సంచలనం సృష్టించిన Zodiac Killer కేసు ఆధారంగా ఈ సినిమా రూపొందింది. IMDbలో 7.7/10 రేటింగ్ సాధించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Zodiac ప్రస్తుతం Apple TV, Amazon Videoలో రెంట్, కొనుగోలు (Buy/Rent) కు అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

1960ల చివరలో, 1970ల ప్రారంభంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతాన్ని ఒక సీరియల్ కిల్లర్ భయభ్రాంతులకు గురిచేస్తాడు. తనను “Zodiac” అని పిలుచుకునే ఆ నేరస్థుడు వరుస హత్యలు చేయడమే కాకుండా, పోలీసులకు, వార్తాపత్రికలకు సవాల్ విసురుతూ రహస్య కోడ్‌లతో కూడిన లేఖలు పంపిస్తుంటాడు. ఈ కేసును ఇన్‌స్పెక్టర్ డేవ్ టోస్కీ (మార్క్ రఫెలో), అతని సహచరులు దర్యాప్తు చేస్తుంటారు. మరోవైపు పత్రికా రిపోర్టర్ పాల్ ఏవరీ (రాబర్ట్ డౌనీ జూనియర్), కార్టూనిస్ట్ రాబర్ట్ గ్రేస్మిత్ (జేక్ జిలెన్‌హాల్) కూడా ఈ కేసుపై ఆసక్తి పెంచుకుంటారు.

విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రతి అనుమానితుడిపై ఆధారాలు దొరుకుతాయి. కానీ చివరి క్షణంలో అవన్నీ కూలిపోతాయి. ఒక్కో క్లూ కొత్త మిస్టరీని తెరపైకి తీసుకొస్తుంది. సంవత్సరాలు గడిచినా హంతకుడి జాడ దొరకదు. అయితే గ్రేస్మిత్ మాత్రం ఈ కేసుపై మోజు పెంచుకుని, తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి నిజాన్ని వెతకడం ప్రారంభిస్తాడు.

Advertisement

చివరికి జోడియాక్ కిల్లర్ ఎవరు? పోలీసులు అతడిని పట్టుకోగలిగారా? గ్రేస్మిత్ కనుగొన్న నిజం ఏమిటి? అసలు ఈ కేసు ఎందుకు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ క్రిమినల్ కేసుల్లో ఒకటిగా మిగిలిపోయింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కినందున కథ మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ఎందుకు చూడాలి?

‘Zodiac’ సాధారణ సీరియల్ కిల్లర్ సినిమా కాదు. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ ఉండవు. బదులుగా నెమ్మదిగా సాగే ఇన్వెస్టిగేషన్, ఇంటెన్స్ స్క్రీన్‌ప్లే, అద్భుతమైన నటన, 1970ల కాలాన్ని కళ్లకు కట్టిన విజువల్స్ తో ఈ సినిమా నడుస్తుంది.

డేవిడ్ ఫించర్ దర్శకత్వం, జేక్ జిలెన్‌హాల్, మార్క్ రఫెలో, రాబర్ట్ డౌనీ జూనియర్ నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కేసును ఛేదించాలనే మోజు ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో దర్శకుడు అద్భుతంగా చూపించారు. Mind-Bending Crime Thrillers, Serial Killer Mysteries, True Crime సినిమాలు ఇష్టపడేవారికి ‘Zodiac’ తప్పకుండా చూడాల్సిన క్లాసిక్ మూవీ.

Read Also : కామెడీ నుంచి థ్రిల్లర్ వరకు… ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళం మూవీస్

Related News

తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉండదు… లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ

Malayalam Thriller : భర్త కళ్లముందే మరో అబ్బాయితో… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్ట్

మిస్టీరియస్ నాలుకతో ముద్దూ ముచ్చట… మైండ్ ను మడత పెట్టే ట్విస్టులు

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..!

ఈ ఇద్దరమ్మాయిల రచ్చ చూస్తే నిద్ర కరువు… సింగిల్ గా చూడాల్సిన మూవీ భయ్యా

కనిపించిన ప్రతీ అబ్బాయితో సన్నిహితంగా ఉండే అమ్మాయి… చివరికి షాకింగ్ క్లైమాక్స్

ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన సిరీసులు… ‘ధురందర్ 2’ వ్యూస్ ఎంతంటే ?

×