E-Paper
Advertisement

Ind vs NZ 1st T20I: న్యూజిలాండ్ తో నేడే తొలి టీ20..శ్రేయాస్ కు అవ‌మానం..అత‌డికే ఛాన్స్‌..గంభీర్ పాలిటిక్స్ మ‌ళ్లీ షురూ

Ind vs NZ 1st T20I: న్యూజిలాండ్ తో నేడే తొలి టీ20..శ్రేయాస్ కు అవ‌మానం..అత‌డికే ఛాన్స్‌..గంభీర్ పాలిటిక్స్ మ‌ళ్లీ షురూ
Advertisement

Ind vs NZ 1st T20I: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand ) మధ్య ఇవాల్టి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మొన్నటి వరకు 3 వన్డేలు జరగకగా ఇప్పుడు పొట్టి ఫార్మాట్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం ఐదు టి20 లు నిర్వహించనున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సన్నద్ధం కోసం ఈ ఐదు టి20 లు ఉపయోగపడనున్నాయి. అందుకే తెలివిగా బీసీసీఐ, న్యూజిలాండ్ తో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తోంది. టి20 క్రికెట్ ఆడనున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ తిరిగి బాధ్యతలు తీసుకోబోతున్నారు.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

ఇవాళ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య తొలి టీ20

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాల్టి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. మొట్టమొదటి టి20 నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. రాత్రి 7 గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ లు ఉచితంగా రాబోతున్నారు.

శ్రేయాస్ అయ్య‌ర్ కు అవ‌మానం

ఇక తొలి టీ20 నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తిలక్ వర్మ స్థానంలో టి20 జట్టు టోర్నమెంట్ కోసం సెలెక్ట్ అయిన శ్రేయాస్ అయ్యర్ , మూడవ స్థానంలో బరిలోకి దిగుతాడని అందరూ అనుకున్నారు. కానీ గంభీర్ పాలిటిక్స్ మొదలయ్యాయి. దీంతో సూర్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఇషాన్ కిషన్ ఇవాల్టి మ్యాచ్ లో మూడవ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఇషాన్ కిషన్ శ్రేయాస్ అయ్యర్ కు ఛాన్స్ దక్కదన్నమాట. దీంతో అతని ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. గౌతమ్ గంభీర్ చెత్త నిర్ణయాల వల్ల శ్రేయాస్ అయ్యర్ కు అవకాశం రావడం లేదని ఫైర్ అవుతున్నారు.

Advertisement

సంజు శాంసన్ వికెట్ కీపర్ ఉండగా మళ్లీ ఇషాన్ కిషన్ ఎందుకు? అంటూ నిలదీస్తున్నారు. అయితే తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ సెలెక్ట్ అయ్యాడు. కానీ తిలక్ వర్మ తరహాలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావాలన్నా ముఖ్య కారణంతో ఈశాన్ కిషన్ కు తుది జట్టుల అవకాశం వచ్చిందని చెబుతున్నారు. ఇక ఇప్పటి వరకు న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 25 టీ20 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ఇండియా నే పై చేయి సాధించింది. 14 మ్యాచ్ ల‌లో టీమిండియా విజయం సాధించగా… పది మ్యాచ్ ల‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది.

టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జట్ల అంచ‌నా

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, ఇషాన్ కిష‌న్‌, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్ర‌వర్తి, అర్ష్‌దీప్ సింగ్

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: డెవాన్ కాన్వే (WK), టిమ్ రాబిన్సన్, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్‌), కైల్ జామీసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ

Also Read: Shoaib Malik Retirement: పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ‌..PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×