E-Paper
Advertisement

బెంగాల్ మొత్తం ఈ జంట వెంటే.. హార్డ్ డ్రైవ్ కోసం ఇదేం అరాచకం భయ్యా

బెంగాల్ మొత్తం ఈ జంట వెంటే.. హార్డ్ డ్రైవ్ కోసం ఇదేం అరాచకం భయ్యా
Advertisement

Nibba Nibbi on OTT: ప్రేమలో పడితే ఇద్దరూ కలిసి పారిపోవడం కామన్. కానీ… అదే ప్రేమ కోసం తుపాకులు పట్టుకుని, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల రహస్యాలను దాచుకున్న హార్డ్‌డ్రైవ్‌తో రోడ్డెక్కితే ? వెంటపడుతున్న గ్యాంగ్‌లు… చుట్టుముడుతున్న ప్రమాదాలు… మరోవైపు తమలో తామే గొడవపడే ప్రేమికులు… ఇలాంటి పరిస్థితుల్లో ఆ జంట ఎలా తప్పించుకుంది ? వాళ్ల చేతికి చిక్కిన హార్డ్‌డ్రైవ్‌లో అసలు ఏం ఉంది ? దాన్ని దక్కించుకోవడానికి పెద్ద మనుషులు ఎందుకు అంతలా వెంటపడ్డారు ? ప్రేమ, యాక్షన్, రక్తపాతం, డార్క్ కామెడీతో సాగిపోయే ఈ క్రేజీ రోడ్ జర్నీనే బెంగాలీ చిత్రం ‘నిబ్బా నిబ్బి’ (Nibba Nibbi). ఈ క్రేజీ లవ్ స్టోరీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

దేవా, పారో ఇద్దరూ సాధారణ ప్రేమికులు కాదు. ఒకరంటే ఒకరికి పిచ్చి. తమ ప్రేమ కోసం ఏం చేయడానికైనా వెనుకాడని ఈ జంటకు సమాజం పెట్టిన నియమాలు, చట్టాలు పెద్దగా పట్టవు. బాధ్యతల గురించి ఆలోచించే టైప్ కూడా కాదు. తమకు నచ్చినట్టు జీవించడం… తమకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడమే వీళ్ల ప్రపంచం. అలాంటి సమయంలో అనుకోకుండా దేవా, పారోల చేతికి ఒక కీలకమైన హార్డ్‌డ్రైవ్ వస్తుంది. అది సాధారణ డేటా ఉన్న పరికరం కాదు. బెంగాల్‌లోని పలువురు ప్రభావశీల వ్యక్తులు, రాజకీయ నాయకులకు సంబంధించిన అత్యంత సున్నితమైన రహస్యాలు అందులో ఉంటాయి. ఆ రహస్యాలు బయటకు వస్తే అధికారంలో ఉన్న చాలామంది పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉంటుంది.

Advertisement

అదే అసలు సమస్యగా మారుతుంది. ఆ హార్డ్‌డ్రైవ్ తమ దగ్గర ఉందని తెలుసుకున్న పవర్‌ఫుల్ వ్యక్తులు దాన్ని ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని నిర్ణయించుకుంటారు. దేవా, పారోలను పట్టుకోవడానికి ప్రైవేట్ గ్యాంగ్‌లను రంగంలోకి దింపుతారు. ఒక్కసారిగా ఈ ఇద్దరు ప్రేమికుల సాధారణ జీవితం ప్రమాదకరమైన పరుగు పందెంగా మారిపోతుంది. మరోవైపు పారో గర్భవతి. ఆమెను కూడా వెంటబెట్టుకుని దేవా బెంగాల్ అంతటా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చేతిలో తుపాకులు… వెనుక ప్రాణాలు తీయడానికి వచ్చిన గ్యాంగ్‌లు… ముందు తెలియని దారి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవా, పారో మాత్రం తమదైన స్టైల్‌లోనే వ్యవహరిస్తుంటారు.

వాళ్లను వెంటాడే ప్రమాదం ఎంత పెరుగుతుందో… వాళ్ల మధ్య జరిగే గొడవలు, వింత సంభాషణలు కూడా అంతే వినోదాన్ని పంచుతాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ, ఆ ప్రేమలో కోపం, అనుమానం, మొండితనం, స్వార్థం కూడా కలిసిపోయి ఉంటుంది. దీంతో వాళ్ల ప్రయాణం కేవలం విలన్ల నుంచి తప్పించుకునే కథలా కాకుండా… ఈ ఇద్దరి సంబంధాన్ని కూడా పరీక్షించే ప్రయాణంగా మారుతుంది. ప్రతి మలుపులో కొత్త ప్రమాదం ఎదురవుతుంది. ఎక్కడి నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియదు. ఒకవైపు హార్డ్‌డ్రైవ్ కోసం వేట కొనసాగుతుంటే… మరోవైపు దేవా, పారో తమ ప్రాణాలను కాపాడుకుంటూ ముందుకు సాగాల్సి వస్తుంది. తుపాకులు పేలుతుంటాయి… రక్తపాతం జరుగుతుంది. కానీ ఈ ఇద్దరి పిచ్చి ప్రేమ మాత్రం ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా వింతగా నవ్వు తెప్పిస్తుంది.

Advertisement

క్రమంగా అసలు సమస్య హార్డ్‌డ్రైవ్‌లో ఉన్న రహస్యాలేనని అర్థమవుతుంది. దాన్ని తమ చేతుల్లో ఉంచుకోవడం ఎంత ప్రమాదకరమో దేవా, పారోలకు కూడా తెలుస్తుంది. కానీ అప్పటికే వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు. వాళ్లను వేటాడుతున్న వ్యక్తులు మరింత దగ్గరవుతారు. తప్పించుకోవడానికి ప్రతి అడుగు ప్రాణాలతో చెలగాటంగా మారుతుంది. ఇక్కడి నుంచి కథ మరింత వేగం పుంజుకుంటుంది. తమను చంపడానికి వచ్చిన వాళ్ల నుంచి దేవా, పారో ఎలా తప్పించుకున్నారు? తమ చేతిలో ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను ఉపయోగించి తమను వెంటాడుతున్న పవర్‌ఫుల్ వ్యక్తులకే ఎలా ఝలక్ ఇచ్చారు ? చివరకు ఈ ఇద్దరి ప్రేమ గెలిచిందా ? లేక వారి పిచ్చి నిర్ణయాలే వాళ్ల జీవితాలను నాశనం చేశాయా? అనేదే క్లైమాక్స్‌లో ఆసక్తికరంగా మారుతుంది.

తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఉందా ?

తథాగత ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిబ్బా నిబ్బి’ ప్రేమకథను చాలా డిఫరెంట్ యాంగిల్‌లో చూపించే డార్క్ కామెడీ యాక్షన్ చిత్రం. సాధారణ రొమాంటిక్ కథల కంటే భిన్నంగా… గన్స్, క్రైమ్, రోడ్ జర్నీ, టాక్సిక్ రిలేషన్‌షిప్, బ్లాక్ హ్యూమర్‌ను కలిపి తెరకెక్కించిన విధానం ఈ సినిమాకు ప్రత్యేకత. ‘నిబ్బా నిబ్బి’ ప్రస్తుతం ZEE5లో ఒరిజినల్ బెంగాలీ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమాను చూడొచ్చు.

Read Also: పైలెట్ కావాల్సిన కుర్రాడు రెడ్ లైట్ ఏరియాలో ప్రేమంటూ… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే

Tags

Related News

జైలు నుంచి క్రైమ్ సామ్రాజ్యం… చెల్లెలికి మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

చావుతో దాగుడుమూతలు ఆడే ఫ్రెండ్స్… కింద పడితే గేమ్ ఓవర్… ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అడ్వెంచర్

ఫేస్ ఇంటర్నేషనల్ స్టార్ లా ఉందని జీవితమే నరకం చేశారు… సమాజం చేసిన పనికి దిమ్మతిరిగిపోతుంది

తల్లి కొడుకుల మధ్యే పవర్ వార్… సొంత కుటుంబంతోనే ఇంత పెద్ద వార్ ఏంట్రా బాబూ

గురువుతో గొడవ పెట్టుకున్న స్టూడెంట్… టీవీ లైవ్‌లో రచ్చ రచ్చ.. అసలు గుట్టేంటి భయ్యా?

ఆర్టిస్టులకు ‘గుడ్ లక్’ చెబితే ఇంత ఘోరమా ? ఈ నమ్మకం వెనకున్న అసలు స్టోరీనే ఈ మూవీ

హాస్పిటల్ లో ఉగ్రవాదుల ఉన్మాదం… పసిపిల్లల కోసం నర్సులు చేసిన సాహసం చూస్తే కన్నీళ్లాగవు

Big Stories

Advertisement
×