Wanhui Restaurant: చైనీయుల బుర్రే బుర్ర. వాళ్ల ఆలోచనలు చాలా క్రేజీగా ఉంటాయి. బిజినెస్ ఏదైనా సరే, కస్టమర్లను అద్భుతంగా ఆకట్టుకోవడంలో ముందుంటారు. తాజాగా చైనాలోని ఓ టీ టైమ్ రెస్టారెంట్ నిర్వాహకులు కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు. సాధారణంగా కస్టమర్లకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు రెస్టారెంట్ లో టీవీలు ఏర్పాటు చేస్తారు. చక్కటి మ్యూజిక్ పెడతారు. ఇంకా చెప్పాలంటే చక్కటి ఫిష్ ఎక్వేరియాలు ఏర్పాటు చేస్తారు. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఉత్తర ప్రావిన్స్ షాంగ్జీలోని ఒక రెస్టారెంట్ ఎవరూ చేయని ఆలోచన చేసింది. ఇంతకీ అసలు ఏం చేశారంటే..
సింహాలతో ముచ్చటిస్తూ చాయ్ తాగేలా ఏర్పాటు
తైయువాన్ నగరంలోని వాన్హుయ్ రెస్టారెంట్ తాజాగా క్రేజీ ఆలోచన చేసింది. తన రెస్టారెంట్ లో చిన్న సింహం పిల్లలను ఊయలలో ఉంచింది. ఈ రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లు గరమ్ గర్ చాయ్ తాగుతూ సింహాలతో ఆడుకునే వెసులుబాటు కల్పించారు. సింహం పిల్లలు మాత్రమే కాదు, తాబేళ్లు, జింకలు, లామాలను కూడా ఉంచిది. ఎవరికి ఏం నచ్చితే వాటితో కాసేపు సరదాగా గడపవచ్చు. జూన్ లో ఈ రెస్టారెంట ప్రారంభమైంది. ఇక్కడ చాయ్ తాగుతూ జంతువులతో సరదాగా గడపాలంటే 1,078 యువాన్లు ($150) చెల్లించాల్సి ఉంటుంది. ఈ అవకాశం రోజుకు కేవలం 20 మందికే అందిస్తుంది. అదీ ముందుగా వచ్చిన 20 మందికే అవకాశం కల్పిస్తుంది. ఈ క్రేజీ అవకాశాన్ని చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. కాసేపు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు.
Read Also: మూడు కాళ్ల సుందరాంగుడు.. 16 వేళ్లు.. 2 జననాంగాలు.. ఇతడిది ఓ అరుదైన జన్మ!
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
అటు ఈ రెస్టారెంట్ లో మూగ జీవాలను ఉపయోగించి బిజినెస్ చేయడం పట్ల చాలా మంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వీసుకు ఉన్న చట్టబద్ధత, జంతు సంక్షేమం గురించి తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వీసు గురించి తెలుసుకున్న చాలా మంది నెటిజన్లు నెగెటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైనదిగా అభివర్ణిస్తున్నారు. “ఇది ధనవంతులు ఆడటానికి ఓ గేమ్ గా ఉంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “ఇక్కడ సాధారణ ప్రజలు టీ తాగడానికి స్తోమత లేని విధంగా ఉంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇలాంటి ఆలోచన మంచిది కాదు, మూగ జీవాల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. సదరు జంతువులను జూకు తరలించాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హోటల్ చైనాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ, ఈ రెస్టారెంట్ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Read Also: ఇన్స్టాలో అందాల ఆరబోత.. ఇప్పుడు జైల్లో.. నెలకు వీరి సంపాదన ఎంతో తెలుసా?