E-Paper
Advertisement

O Romeo OTT : షాహిద్ కపూర్ – త్రిప్టీ దిమ్రీ మూవీకి కోర్టులో ఊరట… థియేట్రికల్ రన్ తరువాత ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్

O Romeo OTT : షాహిద్ కపూర్ – త్రిప్టీ దిమ్రీ మూవీకి కోర్టులో ఊరట… థియేట్రికల్ రన్ తరువాత ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్
Advertisement

O Romeo OTT : షాహిద్ కపూర్, ట్రిప్టీ దిమ్రీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఓ’రోమియో’. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఇది వివాదాస్పదంగా మారింది. గ్యాంగ్ స్టర్ హుస్సేన్ ఉస్తారా కుమార్తె సనోబర్ షేక్ తన తండ్రిని నెగిటివ్ గా చిత్రీకరించారనే ఆరోపణలపై లీగల్ నోటీసు జారీ చేసింది. అయితే న్యాయ పోరాటం తర్వాత ఈ కేసు కోర్ట్ నుండి విముక్తి పొందింది. ముంబై సివిల్ కోర్టు దానిని రిలీజ్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలై హాట్ టాపిక్ అవ్వడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. ఇది స్వతంత్రం వచ్చిన కొత్తలో ముంబై నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకంలోని ఒక కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది ? ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఎప్పుడు రిలీజ్ అంటే

అన్ని అడ్డంకులు తొలగడంతో విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ‘ఓ’రోమియో’ చిత్రం 2026 ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ యాక్షన్-థ్రిల్లర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. OTTplay ప్రీమియం సబ్‌స్క్రైబర్లు కూడా టాప్-అప్ ఎంపికతో సినిమాను చూసే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమా మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది. హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. తమన్నా భాటియా, దిశా పటాని, నానా పటేకర్, అవినాష్ తివారీ, విక్రాంత్ మాస్సే, ఫరీదా జలాల్ వంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. షాహిద్ కపూర్-విశాల్ భరద్వాజ్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రం ఇది.

‘ఓ’రోమియో కథాంశం ఏమిటి?

Advertisement

ఈ సినిమా కథ యదార్థ సంఘటనల ఆధారంగా ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగుతుంది. తన భర్తను చంపిన అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం వంటి వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది సప్నా (త్రిప్తి డిమ్రి) అనే ఒక డేరింగ్ మహిళ. ఆమె తన టార్గెట్ చేరుకోవడానికి మొండి గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా (షాహిద్ కపూర్) సహాయం కోరుతుంది. హుస్సేన్ ఆమెకు ఆయుధాలు వాడటం, సెల్ఫ్ డిఫెన్స్ లాంటి విద్యలను నేర్పిస్తాడు. ఈ ప్రయాణంలో వాళ్ళ మధ్య జరిగే హింసాత్మకమైన ప్రేమకథే ఈ సినిమా.

Read Also : కొరియన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. అదరగొట్టే సిరీస్‌లు ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ ?

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×