Mobile Numerology: ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి ఫోన్ నంబరే వారి పూర్తి గుర్తింపుగా మారిపోయింది. బ్యాంకు ఖాతా నుంచి ఆధార్ కార్డు వరకు.. స్కూల్ అడ్మిషన్ల నుంచి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ల వరకు ప్రతిచోటా మొబైల్ నంబర్ అత్యంత కీలకంగా మారింది. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత సంబంధాలు, వృత్తిపరమైన అవకాశాలు.. అన్నీ ఈ పది అంకెలతోనే ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ‘మొబైల్ న్యూమరాలజీ’ కి ప్రాధాన్యం పెరుగుతోంది. దేశంలో దాదాపు 40 శాతం మంది తమకు కలిసివచ్చే నంబర్ కోసం సంఖ్యా శాస్త్రవేత్తలను సంప్రదిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త మొబైల్ నంబర్ ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో ఈ కథనంలో చూద్దాం.
ఫోన్ నంబర్‌లోని అంకెల అమరిక, రీపిట్ అయ్యే సంఖ్యలు, చివరి నాలుగు అంకెల మొత్తంతో పాటు.. ఆ నెంబర్ సదరు వ్యక్తి పుట్టిన తేదీ, పేరు, వృత్తికి ఎలా సరిపోతున్నాయో పరిశీలించడాన్ని మెుబైల్ న్యూమరాలజీ అంటారు. ప్రపంచంలో అందరికీ ఒకేలా కలిసివచ్చే ‘యూనివర్సల్ లక్కీ నంబర్’ అంటూ ఏదీ ఉండదు. వ్యక్తి ప్రాధాన్యతలను బట్టి, చేసే పనిని బట్టి నంబర్ అమరిక మారుతుంది.
చాలామంది మొత్తం పది అంకెల కూడికను మాత్రమే చూస్తారు. కానీ దానితో పాటు చివరి నాలుగు అంకెల మొత్తాన్ని కూడా వేర్వేరుగా లెక్కించి పరిశీలించాలి. ఈ రెండు మొత్తాలు.. పుట్టిన తేదీకి మాత్రమే కాకుండా, మీరు చేసే వృత్తికి కూడా అనుకూలించాలి. ఉదాహరణకు వ్యాపారవేత్తలు, కళాకారులు, రాజకీయ నాయకులు, ఐటీ ఉద్యోగులకు వేర్వేరు సంఖ్యా శక్తి (Numerical Energy) అవసరమవుతుంది.
మొబైల్ నంబర్‌లో ఎడమ నుంచి కుడికి వెళ్లేకొద్దీ ప్రతి అంకె ప్రాధాన్యత పెరుగుతుంది. అందుకే చివరి నాలుగు అంకెలకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి. ఇవి వీలైనంత వరకు చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వైపు (ఆరోహణ క్రమం) ఉండేలా చూసుకోవాలి. నంబర్ ముగింపు ఎదుగుదలను సూచించేలా ఉండాలి తప్ప, తగ్గుముఖం పట్టేలా లేదా పురోగతిని ఆపేలా ఉండకూడదు.
మెుబైల్ నంబర్‌లో వచ్చే 56 కాంబినేషన్లు, 55 లేదా 555 వంటి ఒకే విధమైన అంకెలు ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఉపయోగపడే కాంబినేషన్, ఫైనాన్స్ లేదా పరిపాలనా రంగంలో ఉన్నవారికి సరిపోకపోవచ్చు. అలాగే ఏ ఒక్క అంకె కూడా నంబర్‌లో మూడు కంటే ఎక్కువ సార్లు రాకూడదు. ఎక్కువసార్లు పునరావృతమైతే అది ఆ నంబర్ సమతుల్యతను దెబ్బతీస్తుంది.
సంఖ్యాశాస్త్రం ప్రకారం మొబైల్ నంబర్ ఎంచుకునేటప్పుడు 4, 0, 8 అంకెలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రాకుండా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ కాంబినేషన్ నంబర్ చివరి భాగంలో వస్తే ఆ సంఖ్య ప్రభావం కాస్త భారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి కొత్త నంబర్ తీసుకునేటప్పుడు ఈ వరుసను నివారించడం శ్రేయస్కరం.
Also Read: BSNL లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. ఉచిత సిమ్, కాల్స్, 24GB డేటా!
ఒక విజేతకు లేదా సక్సెస్‌ఫుల్ వ్యక్తికి కలిసివచ్చిన మొబైల్ నంబర్ వారి పుట్టిన తేదీ, పేరు, జీవిత శైలికి అనుగుణంగా పనిచేస్తుంది. దాన్ని చూసి మీరు కూడా అదే చివరి అంకెలు లేదా మొత్తం వచ్చేలా నంబర్ తీసుకుంటే సమాన ఫలితాలు రావు. కాబట్టి పూర్తిస్థాయి సంఖ్యాశాస్త్ర విశ్లేషణ ద్వారా మీ జాతకానికి, వృత్తికి సరిపోయే నంబర్‌ను ఎంచుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Airtel యూజర్లకు ఊహించని గిఫ్ట్.. ఏడాది ప్లాన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఫ్రీగా 150GB డేటా!